Thursday 19 June 2014

జానకీ రమణ భక్త పారిజాత....

రచన: శ్రీ త్యాగరాజు.
రాగం: శుద్ధ సీమంతినీ
తాళం:ఆది.

పల్లవి: జానకీ రమణ భక్త పారిజాత
పాహి సకల లోక శరణ  || జానకీ||

అనుపల్లవి:
గాన లోల ఘన తమాల నీల
కరుణాలవాల సుగుణ శీల  ||జానకీ||

చరణం:
రక్త నళిన దళ నయన నృపాల
రమణీయానన ముకుర కపోల
భక్తి హీన జన మద గజ జాల
పంచ వదన త్యాగరాజ పాల ||జానకీ||

Wednesday 18 June 2014

మధురా నగరిలో చల్లనమ్మబోదు...

రచన: శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై.
రాగం: ఆనంద భైరవి.
తాళం: ఆది.

పల్లవి:
మధురా నగరిలో చల్లనమ్మబోదు
దారి విడుము కృష్ణా! కృష్ణా!    ||మధురా||

అనుపల్లవి:
మాపటి  వేళకు తప్పక వచ్చెద
పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా!కృష్ణా! ||మధురా||

చరణం-1:
కొసరి కొసరి నాతొ సరసములాడకు
రాజమార్గమిది కృష్ణా!కృష్ణా!  ||మధురా||

చరణం-2:
బ్రజ వనితను నను చేరవద్దురిక
విడు విడు నా చెయి కృష్ణా!కృష్ణా! ||మధురా||

వాతాపి గణపతిం భజే.....

రచన: శ్రీ ముత్తుస్వామి దీక్షితులు.
రాగం: హంసధ్వని.
తాళం: ఆది.


వాతాపి గణపతిం భజే
హం వారణాస్యం వరప్రదం || వాతాపి ||

భూతాది సంసేవిత చరణం
భూత భౌతికా ప్రపంచ భరణం
వీతరాగిణం వినత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం  ||వాతాపి||

పురాకుంభ సంభవమునివర
ప్రపూజితం త్రికోణమధ్యగతం
మురారీ ప్రముఖ ద్యుపాసితం
మూలాధారా క్షేత్రాస్థితం
పరాది చత్వారి వాగాత్మకం
ప్రణవ స్వరూప వక్రతుండం
నితంతరం నిటల చంద్రఖండం
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజపాశ బీజాపూరం
కలుష విదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం || వాతాపి ||

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...