Thursday 31 July 2014

పిబరే రామరసం

రచన: శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర.
రాగం: యమునా కళ్యాణి.
తాళం: ఆది.
భాష: సంస్కృతం.

పల్లవి:
పిబరే రామ రసం రసనే     ||పిబరే||

చరణం:
జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
శుధ్ధ పరమ హంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం     ||పిబరే||

● ■ ● ■ ● ■ ● ■ ● ■ ● ■ ● ■ ● ■ ● ■ ●

पिबरे राम रसम् रसने         ||पिबरे||

जनन मरण भय शोक विदूरम्
सकल शास्त्र निगमागम सारम्
शुध्द परम हम्स आश्रम गीतम्
शुक शौनक कौशिक मुख पीतम्    ||पिबरे ||

Wednesday 30 July 2014

బంటురీతి కొలువు

రచన:త్యాగరాజు
రాగం:హంసనాదం
తాళం:ఆది

పల్లవి:
బంటురీతికొలువియ్యవయ్య రామా   ||బంటు||

అనుపల్లవి:
తుంటవింటివాని మొదలైన మాదాదుల కొట్టినేల కూలజేయునిజ                     ||బంటు||

చరణం:
రోమాంచమను ఘనకంచుకము రామభక్తుడనే ముద్రబిళ్ళయు
రామనామమనే వరఖడ్గమివి
రాజిల్లునయ్య త్యాగరాజునిజ      ||బంటు||

Monday 28 July 2014

రమించు వారెవరురా...

రచన:శ్రీ త్యాగరాజు
రాగం: సుపోషిణీ
తాళం: రూపక

పల్లవి:
రమించువారెవరురా రఘుత్తమా నిను వినా || రమించు||

అనుపల్లవి:
శమాది షడ్గుణగణా సకల భువన జనులలో ||రమించు||

చరణం:
రమయనే సుమర్మము రామయనే శర్మము
లసదమర వరుల కబ్బెనో త్యాగరాజ సన్నుత   ||రమించు||

Friday 25 July 2014

ముందు వెనుక యిరు

రచన : శ్రీ త్యాగరాజు
రాగం:దర్బారు
తాళం:ఆది

ముందు వెనుకయిరు పక్కల తోడై
ముర ఖర హర రారా           ||ముందు||

ఎందు కాన నీయందము వలె
రఘునందన వేగమే రారా     ||ముందు||

చండ భాస్కర కులాబ్ధి చంద్ర
కోదండ పాణియై రారా
అండ కొలుచు సౌమిత్రి సహితుడై
అమిత పరాక్రమ రారా         ||ముందు||

ఓ గజ రక్షక ఓ రాజ కుమార
ఓంకార సదన రారా
భాగవత ప్రియ బాగ బ్రోవవయ్య
త్యాగరాజ నుత రారా          ||ముందు||

Thursday 24 July 2014

దశ మహావిద్యలు - 2: శ్రీ తారామాత:

తారా దేవీ దశ మహా విద్యలలో రెండవ మహావిద్య.తారామాత స్వరూపం అచ్చం కాళీ మాత లాగానే ఉంటుంది. కానీ కాళీ మాత నలుపు రంగులో ఉంటే తారామాత నీలం రంగులో ఉంటుంది. తారామాత రూపం భయంకరంగా ఉన్నా అమె కారుణ్యమూర్తి.

తరింపజేయు శక్తి తార. కష్టాలు,బాధలు, అజ్ఞానం, పేదరికం, ఆపదలు, భయాలు, తెలివితక్కువ తనం ఇత్యాది ఏకష్టం నుంచి అయినా తరింపచేయగల శక్తి స్వరూపిణి
తారాదేవి. ముఖ్యంగా ఈ దేవి కృపవల్ల కవిత్వశక్తి, ధారణాశక్తి,జ్ఞానశక్తి కలుగుతాయి. తరింపచేయడమే తార తత్వం. తారని
ఉగ్రతారగా, ఏకజటగా పిలుస్తూ తంత్రంలో కూడా ఉపాసిస్తారు.

తారామాత పుట్టుక గురించి తంత్రంలో ఓ కథ బాగా ప్రచారంలో ఉంది. క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు ఉద్భవించిన  హాలాహలాన్ని లోకరక్షణకై లోకనాయకుడైన పరమేశ్వరుడు స్వీకరించాడు. కానీ దాని ప్రభావం నుండి పరమేశ్వరుణ్ణి తప్పించడానికి ఆ జగన్మాత శ్రీ తారాదేవి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు తన చనుబాలనిచ్చి ఆ విష ప్రభావాన్ని తగ్గించింది.

బౌద్ధంలో ఈ మాత పూజకు చాలా ప్రాధాన్యత ఉంది.తాంత్రిక బౌద్ధంలో తారామాత యొక్క ఉపాసనకు చాలా విశిష్టత ఉంది. బౌద్ధంలో ఈ దేవికి సంబంధించిన మంత్రాలన్ని పాళీ భాషలో ఉన్నాయి. టిబెట్, చైనా, థాయిల్యాండ్, జపాన్, మంగొలియా దేశాల్లో ఈ దేవి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తారాపీఠ్ గ్రామంలో శ్రీ తారాదేవి యొక్క ఆలయం వున్నది.



Wednesday 23 July 2014

దశమహావిద్యలు - 1: శ్రీ కాళీ మాత:

శ్లో||జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ|
దుర్గాక్షమా శివధాత్రి స్వాహాస్వధా నమోస్తుతే||

మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయం మరియు సంశయం ఎక్కువ,ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీ మాత.
కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యలలో ఈమె ప్రధాన దేవత. నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీ మాతయే సృష్టించిందని చెప్పబడివుండి. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించినా ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహా సాధువులు,సన్యాసులు కాళీ మాతను సేవించి కైవల్య ప్రాప్తినొందారు. వారిలో శ్రీ రామకృష్ణ పరమహంస ప్రముఖులు.

ఒకనాడు భూమిపైన పాపసంచయం బాగా పెరిగిపోయింది. భగవన్నామస్మరణ, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి, ప్రజలు అరిషడ్వర్గాలకులోనై స్వేచ్ఛగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండాపోయింది. దీంతో ఆగ్రహించిన కాళీ మాత ఉగ్రంగా నాట్యం చేయనారభించింది. దీంతో లోకాలన్ని కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీ మాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవుణ్ణి చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీ మాత మహాదేవుడిపై తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తూంటుంది. మనమూ ఆ కారుణ్యమూర్తిని స్మరిద్దాం...

కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనమిది రూపాలు..
1. దక్షిణ కాళిక         2. సిద్ధ కాళిక
3. గుహ్య కాళిక        4. శ్రీ కాళిక
5. భద్ర కాళిక           6. చాముండా కాళిక
7. శ్మశాన కాళిక        8. మహాకాళిక.

కాళీ మాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరించింది. అందుకే కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి.





Tuesday 22 July 2014

శ్రీ దేవి దశమహావిద్యలు

మహామాత,మహాదేవి అయినటువంటి ఆ ఆదిపరాశక్తి ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించివుంది... అయితే లోక రక్షణకు,భక్తుల కోరిక వలన,రాక్షస సంహారానికి మరియు లోకోద్ధరణకు ఆమె ఎన్నో రూపాలలో అవతరించింది ఇంకా ఎన్నో లీలలనూ ప్రదర్శించింది...వాటిల్లో  ప్రముఖమైనవి శ్రీ దేవి యొక్క "దశమహావిద్యలు"...

లోకనాయకుడైనటువంటి ఆ పరమేశ్వరునితో  వైరం పెట్టుకున్న దక్షుడు పరమేశ్వరుడు లేకుండా ఒక యజ్ఞాన్ని చేయనారంభించాడు. ఆ యఙ్ఞానికి మహాదేవుణ్ణి మరియు సతీదేవిని ఆహ్వానించలేదు.తండ్రి చేస్తున్న యాగం గురించి తెలుసుకున్న సతీదేవి యాగానికి వెళ్ళడానికి పరమేశ్వరుని అనుమతి అడిగింది. సతీదేవి యాగానికి వెళితే ఏం జరుగుతందో పరమేశ్వరుడికి తెలుసు.అందుకే వెళ్ళవద్దని ఆమెకు ఎన్నో రకాలుగా నచ్చజెప్పాడు శ్రీ కంఠుడు. అయినా సతీదేవి వినలేదు.వద్దన్నా వినకుండా వెళుతున్న సతీదేవి వెళ్ళకుండా ఆయన అడ్డుపడ్డాడు. దాంతో ఆమె ఆగ్రహంతో దశమహావిద్యలను సృజించింది ఆ విద్యలు శివుణ్ణి దశదిశల నుండి చుట్టుముట్టాయి. విధిలీలలకు పరమేశ్వరుడు సైతం అతీతుడు కాడు. ఇలా దేవి లీలల వల్ల దశమహావిద్యల సృజన జరిగింది.

తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది.
1)కాళీ                     2)తార
3)షోడశి                   4)భువనేశ్వరి
5)భైరవి                    6)ఛిన్నమస్త
7)ధూమవతి              8)భగళాముఖి
9)మాతంగి                10)కమలాత్మిక.

ఇవే దేవి యొక్క దశమహావిద్యలు...




Wednesday 2 July 2014

నామ రామాయణము...

శ్రీ నామ రామాయణము...


బాల కాండము:

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్
శేషతల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్
చండకిరణకుల మండన రామ్
శ్రీ మద్దశరథ నందన రామ్
కౌసల్యా సుఖవర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియ ధన రామ్
ఘోర తాటకా ఘాతక రామ్
మారీచాది నిపాతక రామ్
కౌశిక మఖ సంరక్షక రామ్
శ్రీమదహల్యోద్ధారక రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతారామ్

గౌతమముని సంపూజిత రామ్
సుర మునివర గణ సంస్తుత రామ్
నావిక ధావిత మృదు పద రామ్
మిథిలా పురజన మోహక రామ్
విదేహ మానస రంజక రామ్
త్ర్యమ్బక కార్ముక భంజక రామ్
సీతార్పిత వర మాలిక రామ్
కృత వైవాహిక కౌతుక రామ్
భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమదయోధ్యా పాలక రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతారామ్

అయోధ్య కాండము:


అగణిత గుణగణ భాషిత రామ్
అవనీ తనయా కామిత రామ్
రాకా చంద్ర సమానన రామ్
పితృ వాక్యాశ్రిత కానన రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతారామ్
ప్రియ గుహ వినివేదిత పద రామ్
ప్రక్షాలిత నిజ మృదుపద రామ్
భరద్వాజ ముఖానందక రామ్
చిత్ర కూటాద్రి నికేతన రామ్
దశరథ సంతత చింతిత రామ్
కైకేయీ తనయార్థిత రామ్
విరచిత నిజ పితృ కర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

అరణ్య కాండము:

దండకావనజన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్
శరభంగ సుతీక్షార్చిత రామ్
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

గృధ్రాధిప సంసేవిత రామ్
పంచవటీ తట సుస్థిత రామ్
శూర్పణఖార్తి విధాయక రామ్
ఖర దూషణ ముఖ సూదక రామ్
సీతా ప్రియ హరిణానుగ రామ్
మారీచార్తి కృదాశుగ రామ్
వినష్ట సీతాన్వేషక రామ్
గృధ్రాధిప గతి దాయక రామ్
శబరీ దత్త ఫలాశన రామ్
కబంధ బాహుచ్ఛేదన రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

కిష్కింధా కాండము:

హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవాభీష్టద రామ్
గర్విత వాలి సంహారక రామ్
వానరదూత ప్రేషక రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

సుందరా కాండము:

కపివర సంతత సంస్మృత రామ్
తద్గతి విఘ్న ధ్వంసక రామ్
సీతా ప్రాణాధారక రామ్
దుష్ట దశానన దూషిత రామ్
శిష్ట హనూమద్భూషిత రామ్
సీతా వేదిత కాకావన రామ్
కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనాశ్వాసిత రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

యుద్ధ కాండము:

రావణ నిధన ప్రస్థిత రామ్
వానరసైన్య సమావృత రామ్
శోషిత సరిదీశార్థిత రామ్
విభీషణాభయ దాయక రామ్
పర్వతసేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్
రాక్షససంఘ విమర్దక రామ్
అహి మహి రావణ చారణ రామ్
సంహృత దశముఖ రావణ రామ్
విధి భవ ముఖ సుర సంస్తుత రామ్
ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీతాదర్శన మోదిత రామ్
అభిషిక్త విభీషణ నత రామ్
పుష్పక యానారోహణ రామ్
భరద్వాజాభినిషేవణ రామ్
భరత ప్రాణ ప్రియకర రామ్
సాకేత పురీ భూషణ రామ్
సకల స్వీయ సమానత రామ్
రత్నలసత్పీఠాస్థిత రామ్
పట్టాభిషేకాలంకృత రామ్
పార్థివకుల సమ్మానిత రామ్
విభీషణార్పిత రంగక రామ్
కీశకులానుగ్రహకర రామ్
సకలజీవ సంరక్షక రామ్
సమస్త లోకాధారక రామ్

ఉత్తరా కాండము:

ఆగత మునిగణ సంస్తుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్
సీతాలింగన నిర్వృత రామ్
నీతి సురక్షిత జనపద రామ్
విపిన త్యాజిత జనకజ రామ్
కారిత లవణాసురవద రామ్
స్వర్గత శంభుక సంస్తుత రామ్
స్వతనయ కుశలవ నందిత రామ్
అశ్వమేధ క్రతు దీక్షిత రామ్
కాలావేదిత సురపద రామ్
అయోధ్యక జన ముక్తిద రామ్
విధిముఖ విభుధానందక రామ్
తేజోమయ నిజరూపక రామ్
సంసృతి బంధ విమోచక రామ్
ధర్మస్థాపన తత్పర రామ్
భక్తిపరాయణ ముక్తిద రామ్
సర్వచరాచర పాలక రామ్
సర్వభయామయ వారక రామ్
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్

రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...