Friday 28 November 2014

సుబ్రహ్మణ్య షష్ఠి:

(కుమార షష్ఠి, స్కంద షష్ఠి... :  28-11-2014)
(నేడే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి)

బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే  మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు... వాడి మరణానికై ఎన్నో వ్యయప్రయాలు కూర్చి శివపార్వతులకు వివాహం జరిపించారు దేవతలు... అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో ఒక వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గుడుపుతున్నారు.. కానీ సమస్త లోకాలన్నీ కూడా తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు...శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అప్పుడే శివుని నుండి మహా తెజస్సు వెలువడింది...

అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుద్ధషష్ఠినాడు, అనగా ఈ రోజే, ఒక దివ్య తెజోమయుడైన బాలుడు ఉద్భవించాడు. ఆయనే శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనికే కుమారషష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పేరు...

ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది.

తండ్రి యైన పరమశివుని వద్ద సమస్త విద్యలూ నేర్చుకొన్న స్వామి దేవతల సేనాధిపతిగా నియుక్తుడయ్యాడు... అటు తరువాత తారకుని సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు మన స్వామి....తారకుని విజయం అనంతరం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం జరిపిస్తాడు...అటు తరువాత దక్షిణదేశం వచ్చిన స్వామి శ్రీ వల్లి దేవిని కూడా వివాహమాడతాడు... అలా శ్రీ కుమారస్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేతుడై లోకాలను అనుగ్రహిస్తున్నాడు...

ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః... అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు...

Wednesday 26 November 2014

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం...

హే స్వామినాథ! కరుణాకర! దీనబంధో!
శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో!
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ ||1||

దేవాధిదేవసుత! దేవగణాధినాథ!
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద!
దేవర్షి నారదమునీంద్ర సుగీతకీర్తే!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 2 ||

నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్‌!
భాగ్యప్రదాన పరిపూరితభక్తకామ!
శ్రుత్యాగమప్రణవ వాచ్య నిజస్వరూప!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల!
చాపాది శస్త్రపరిమండిత దివ్య పాణే!
శ్రీ కుండలీశ ధృత తుండ శిఖీంద్రవాహ!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 4 ||

దేవాధిదేవ! రథమండలమధ్యమేద్య!
దేవేంద్ర పీఠ నగరాధృత చాపహస్త!
శూరం నిహత్య అసురకోటిభి రీడ్యమాన!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 5 ||

హారాదిరత్న నవయుక్త కిరీటహార!
కేయూర కుండల లసత్కవచాభిరామ!
హే వీర! తారక జయామర బృందవంద్య!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 6 ||

పంచాక్షరాది మను మంత్రిత గాఙ్గతోయైః|
పంచామృతైః ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రైః|
పట్టాభిషిక్త! హరియుక్త! వరాసనస్థా!
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 7 ||

శ్రీకార్తికేయ! కరుణామృత పూర్ణదృష్ట్యా!
కామాదిరోగ కలుషీకృత దృష్టచిత్తమ్‌!
సిక్త్వా తు మా మవ కళానిధి కాంతికాన్త్యా
వల్లీసనాథ! మమ దేహి కరావలంబమ్‌ || 8 ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం - యే పఠన్తి ద్విజోత్తమాః!
తే సర్వే ముక్తి మాయా న్తి - సుబ్రహ్మణ్యప్రసాదతః.
సుబ్రహ్మణ్యష్టక మిదం - ప్రాత రుత్థాయ యః పఠేత్‌|
కోటిజనమకృతం పాపం - తత్‌క్షణా దేవ నశ్యతి || 9||

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకం సంపూర్ణమ్

Monday 24 November 2014

నాద తనుమనిశం: ( కీర్తన)

రచన: శ్రీ కాకర్ల త్యాగబ్రహ్మం.
రాగం: చిత్తరంజని
తాళం: ఆది

పల్లవి:
నాద తనుమనిశం శంకరం!
నమామిమే మనసా శిరసా

అనుపల్లవి:
మోదకరా నిగమోత్తమ సామ
వేదసారం వారం వారం

చరణం:
సద్యోజాతాది పంచ వక్త్రజ
సరిగమపదనీ వర సప్తస్వర
విద్యాలోలం! విగళిత కాలం!
విమల హృదయ త్యాగరాజ పాలం...

ఎందరో మహానుభావులు: (పంచరత్న కృతులు)

రాగం - శ్రీ
తాళం - ఆది

పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము
॥ఎందరో॥

అనుపల్లవి:
చందురు వర్ణుని యందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
॥రెందరో॥

చరణాలు:
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు
॥లెందరో॥

మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా
॥రెందరో॥

సరగున బాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥

పతితపావనుడనే పరాత్పరుని గురించి బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును, సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥

హరి గుణమణులగు సరములు గళమున శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥

హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా గనుల జూచుచును, పులకశరీరులయి ఆనంద పయోధి
నిమగ్నులయి ముదంబునను యశముగలవా
॥రెందరో॥

పరమభాగవత మౌనివరశశివిభాకర సనక సనందన దిగీశ సురకింపురుష కనక కశిపుసుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర శుకసరోజభవ భూసురవరులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమలభవసుఖము సదానుభవులుగాక
॥రెందరో॥

నీ మేను నామ వైభవమ్ములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మా నసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెఱింగి సతతంబునను గుణభజనానంద కీర్తనము జేయువా
॥రెందరో॥

భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢముల ముప్పదిముక్కోటి సురాంత రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే జిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవా
॥రెందరో॥

ప్రేమ ముప్పిరిగొను వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజ నుతుని నిజదాసులైనవా
॥రెందరో॥

Saturday 22 November 2014

కనకన రుచిరా: (పంచరత్న కృతులు)

రాగం: వరాళి.
తాళం: ఆది

పల్లవి:
కనకన రుచిరా కనకవసన! నిన్ను ॥కనకన॥

అనుపల్లవి:
దినదినమును మనసున చదువున నిన్ను
॥కనకన॥

చరణాలు:
పాలుగారు మోమున శ్రీ యపార మహిమ దనరు నిన్ను ॥కనకన॥

కలకలమను ముఖకళగలిగిన సీత
కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను ॥కనకన॥

బాలార్కాభ! సుచేల! మణిమయ మాలాలంకృత కంధర! సరసిజాక్ష! వరక పోల సురుచిర కిరీటధర! సతతంబు మనసారగ ॥కనకన॥

సాపత్నీ మాతయౌ సురుచివే కర్ణశూల మైనమాట వీనుల చురుక్కున తాళక శ్రీహరిని ధ్యానించి సుఖింపగలేదా యటు ॥కనకన॥

మృగమదలామ శుభనిటల వరజటాయు మోక్షఫలద
పవమానసుతుడు నీదు మహిమదెల్ప సీత
తెలిసి వలచి సొక్క లేదా రీతి నిన్ను ॥కనకన॥

సుఖాస్పధ విముఖాంబుధర పవన విదేహమానస
విహారాప్త సురభూజ మానితగుణాంక! చిదానంద!
ఖగతురంగ ధృతరథాంగ! పరమదయాకర!
కరుణారస వరుణాలయ! భయాపహర! శ్రీరఘుపతే!
॥కనకన॥

ప్రేమమీఱు కరముల నీదుపాదకమలము
బట్టుకొనువాడు సాక్షి రామనామ రసికుడు కైలాస
సదనుడు సాక్షి మఱియు నారద పరాశర శుకశౌనక
పురందర నగజాధరజ ముఖ్యులు సాక్షి గాద!
సుందరేశ! సుఖకలశాంబుధివాసా! శ్రితులకే
॥కనకన॥

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత! ముఖజిత కుముద! హిత! వరద! నిన్ను ॥కనకన॥

Friday 21 November 2014

శివ కేశవుల మధ్య లేని భేదం మనకెందుకు???

శివ,కేశవుల మధ్య భేదం లేదని పురాణాలు చెబుతున్నా, ఆధునిక సమాజంలో మనుషులు తమ ఆధిప త్యాన్ని నిలుపుకునేందుకు దేవుళ్ళ మధ్య విభేదాలను సృష్టిస్తుంటారు.దేవతలంతా ఒక్కటేనని వేదశాస్త్రాలు చెబుతున్నాయి, పండితులుచెబుతున్నారు.

అయినప్పటికీ, భక్తులు మాత్రం విభేదాలున్నాయని ఎలా నమ్ముతున్నారు.దీనికి కారణం మిడిమిడి జ్ఞానం కలిగిన వారేనని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. భోళా శంకరుడైన శివుణ్ణి ఎన్నో సార్లు ఆపదల నుంచి కాపాడినవాడు విష్ణుమూర్తే. భస్మాసురుని బారి నుంచి శివుణ్ణి రక్షించేందుకు విష్ణువు మోహినీ అవతారం ఎత్తిన కథను మనం చదువుకున్నాం. అలాగే, ఈశ్వరానుగ్రహం వల్ల శ్రీకృష్ణునికి సంతాన ప్రాప్తి కలిగింది.ఇందుకు సంబంధించిన పౌరాణిక గాథను సూతమహర్షి శౌనకాది మహామునులకు తెలియజేశాడు.

శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలన్న సంగతి మనకు తెలుసు. వారిలో ఏ ఒక్కరికీ సంతాన ప్రాప్తి కలగకపోవడంతొ ఓ రోజున వారంతా తమ పతి చెంతకువచ్చి స్త్రీలకు ఎన్ని భోగభాగ్యాలున్నా సంతానం లేకపోవడం పెద్ద వెలితే,పిల్లలు లేని స్త్రీని గొడ్ర్రాలు అని హేళన చేస్తారు. అష్టైశ్వర్యాలున్నా పిల్లలు లేని స్త్రీలు భాగ్యహీనులే.. వజ్ర వైఢూర్యాలూ, రత్నమాణి క్యాలు, సకల సంపదలు ఇవ్వలేని ఆనందాన్ని స్త్రీకి మాతృత్వం ఇస్తుందని పెద్దలు చెబుతారు. మా మనోవేదనను అర్ధంచేసుకుని పరిష్కారం కోసం ప్రయత్నించండి అని మొరపెట్టుకుంటారు.వారి ఆవేదనను అర్ధం చేసుకున్న శ్రీకృష్ణుడు హిమాలయాల్లో ఉపమన్యు మహర్షి ఆశ్రమా నికి చేరుకుని సంతాన ప్రాప్తి కోసం శివుని గురించి తపస్సు చేసేందు కు వచ్చానని చెబుతాడు. దాంతో ఆ మునీశ్వరుడు ఈ విషయాన్ని తనకు ముందే శివుడు చెప్పాడనీ, పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించమని కూడా చెప్పాడనీ,ఆ బాధ్యత నెరవేర్చేందుకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నానని తెలియజేస్తాడు. పరమాత్మస్వరూపుడవైన నీకు మంత్రోపదేశం చేసే మహాద్భాగ్యం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతం. ఈ శ్వరానుగ్రహం వల్లే నాకు ఈ భాగ్యం దక్కింది. ధర్మ సంస్థాపనాచార్యుడవైన నీవు నన్ను గురువుగా సంభావించడం ఎన్నో యుగాల పుణ్యఫలంగా భావిస్తున్నాను. అని స్తుతించి ఉపమన్య మహార్షి శ్రీకృష్ణునికి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీకృష్ణడు హిమవత్పర్వతంపై నియమనిష్టలతోఘోర తపస్సు చేయగా,శివడు ప్రత్యక్ష మయ్యాడు. శ్రీకృష్ణా ఏ కోరిక నిమిత్తం నీవు ఇంత ఘోరమైన తపస్సుచేస్తున్నావని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణడు తన మనసులోని మాటను చంద్రమౌళీశ్వరునికి తెలిపాడు., దాంతో శివుడు ప్రసన్నుడై కృష్ణా నీ ఎనమండుగురు భార్యలే కాక, పదనారు వేల మంది భామినుల కూడా సంతానవతులు అవుతారని ఆశీర్వదించాడు.

నీ సంతానంలో జాంబవతీ నందనుడు అయిన సాంబుడు మంచి పేరు ప్రఖ్యాతులను సంపా దించుకుంటాడు నిత్య యవ్వనుడవైన నీవు నా మాదిరిగానే విశ్వ మానవ కోటి చే నిరం తరం కీర్తించబడతావు అని ఆశీర్వదిస్తాడు. ఈ వృత్తాంతం వల్ల శివకేశవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవనీ, అవన్నీ మనం సృష్టించుకున్నవేనని రుజువు అవుతోంది. అంతేకాక, కార్తీక మాసంలో శివుణ్ణి ప్రతి రోజూ అభిషేకాలతో సేవించినట్టే, క్షీరాబ్ది ద్వాదశినాడు శ్రీకృష్ణుణ్‌ి పూజిస్తూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టిస్థితి లయకారులుగా త్రిమూర్తులుగా ప్రసి ద్ధులు. వారి మధ్య ఎంతో సామరస్యం ఉండగా,మనమెందుకు కీచులాడుకోవడం....???

(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి సేకరించబడినది....)

సాధించనే ఓ మనసా: (పంచరత్న కృతులు)

కీర్తన: సాధించెనే ఓ మనసా
రాగం: ఆరభి
తాళం: ఆది

పల్లవి:
సాధించెనే ఓ మనసా ॥ సాధించెనే॥

అనుపల్లవి:
బోధించిన సన్మార్గ వచనముల
బొంకుజేసి తాబట్టిన పట్టు ॥సాధించెనే॥

చరణాలు:

సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు ॥సమయానికి॥

రంగేశుడు సద్గంగా జనకుడు, సంగీత సంప్రదాయకుడు, ॥సమయానికి॥

గోపీజన మనోరథ మొసంగలేకనే గేలియు జేసేవాడు ॥సమయానికి॥

సారాసారుడు సనకసనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు  ||సమయానికి||

వనితల సదా సొక్కజేయుచును మ్రొక్క జేసే పరమాత్ము డదియుగాక, యశోదతనయుడంచు ముదంబునను ముద్దుబెట్ట నవ్వుచుండు హరి ॥సమయానికి॥

పరమ భక్తవత్సలుడు సగుణపారావారుండా జన్మ మ
నఘ డీ కలిబాధల దీర్చువా డనుచునే హృదంబుజమున జూచుచుండగ ॥సమయానికి॥

హరే! రామచంద్ర రఘుకులేశ మృదుసుభాష
శేషశయన పరనారీ సోదరాజ విరాజ తురగ రాజ
రాజనుత నిరామయాప ఘన సరసీరుహదళాక్ష
యనుచు వేడుకొన్నను తా బ్రోవకను ॥సమయానికి॥

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జసమానస
నికేతన కనకాంబరధర లసన్మకుట కుండల విరాజిత
హరేయనుచు నే పొగడగా త్యాగరాజగేయుడు
మానవేంద్రుడయిన రామచంద్రుడు ॥సమయానికి॥

సమయానికి తగుమాటలాడెనె సద్భక్తులనడతలిట్లనెనే
అమరికగా నా పూజ కొనెనే అలుగవద్దనెనే
విముఖులతో జేరబోకుమనెనే, వెతగల్గిన తాళుకొమ్మనెనే దమశమాది సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజ సుతుడు చెంతరాకనే ॥సాధించెనే॥

Thursday 20 November 2014

దుడుకుగల నన్నే: (పంచరత్న కృతులు)

కీర్తన - దుడుకుగల నన్నే.
రాగం - గౌళ.
తాళం - ఆది.

పల్లవి:
దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా, ఎంతో..

అనుపల్లవి:
కడు దుర్విషయాకృష్టుడై ఘడియఘడియకు నిండారు

చరణాలు:
శ్రీవనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర ॥1॥

సకలభూతములయందు నీవైయుండగ మదిలేకపోయిన ॥2॥

చిరుతప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన ॥3॥

పరధనములకొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింపదిరిగినట్టి ॥4॥

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమేయనుచు
సదా దినములు గడిపెడి ॥5॥

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌటకుపదశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను ॥6॥

దృష్టికి సారంబగు లలనా సదనార్భకసేనామిత ధనాదులను దేవాధిదేవ నెరనమ్మితినిగాకను పదాబ్జభజనంబు మరచిన ॥7॥

చక్కని ముఖకమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచేదగిలి నొగిలి  దుర్విషయ దురాశలను రోయలేక సతతమపరాధినై చపలచిత్తుడైన ॥8॥

మానవతను దుర్లభమనుచునెంచి పరమానందమొందలేక మదమత్సరకామ లోభమోహములకు దాసుడై మోసబోతిగాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక నరాధములనురోయ సారహీనమతములను సాధింప తారుమారు ॥9॥

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధనతతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి ॥10॥

Tuesday 18 November 2014

కమలాక్షు నర్చించు...

కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!

శ్రీ విష్ణు షోడశ నామ స్తోత్రం...

ఔషధే చింతయే ద్విష్ణుం భోజనేచ జనార్దనం 
శయనే పద్మనాభం చ, వివాహేచ ప్రజాపతిమ్

యథా చక్రధరం  – దేవం ప్రవాసేచ త్రివిక్రమం
నారాయణం చ త్యాగేచ శ్రీధరం ప్రియ సంగమే

దుస్స్వప్నే స్మర గోవిందం, సంకటే మధుసూదనం
కాననే నారసింహంచ పావకే జలశయనం

జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం
గమనే వామనంచైవ, సర్వ కాలేషు మాధవం

 షోడశైతాని నామాని, ప్రాతరుత్థాయ యః పఠేత్ 
సర్వపాప వినిర్ముక్తో విష్ణు లోకే మహీయతే

Monday 17 November 2014

శ్రీ రామరక్షా స్తోత్రము...

ఓం శ్రీ గణేశాయ నమః

అస్య శ్రీ రామరక్షాస్తోత్ర మంత్రస్య, బుధ కౌశిక ఋషి:, శ్రీ సీతారామచంద్రో దేవతా, అనుష్టప్ ఛందః, సీతాశక్తి:, శ్రీమాన్ హనుమాన్ కీలకం, శ్రీరామచంద్ర ప్రీత్యర్దే రామరక్షా స్తోత్ర జపే వినియోగః రాం రామాయ నమః

ధ్యానం:

ధ్యాయే దాజానుబాహుం ధృతశరథనుషం బద్ధ పద్మాసనస్థమ్ |
పీతం వాసోవసానం, నవ కమల దళ స్పర్ది నేత్రం ప్రసన్నమ్ ||
వామాంకారూడ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభమ్ |
నానాలంకార  దీప్తం దధత మురుజటామండలం రామచంద్రమ్ ||

అథ స్తోత్రమ్:

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్ ||
ధ్యాత్వానీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితమ్ ||
సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్ |
స్వలీలయా జగత్రాతు మావిర్భూత మజం విభుమ్ ||    
రామరక్షాం పటేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ||
కౌసల్యే యో దృశౌ పాతు విశ్వామిత్రః ప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రి వత్సలః ||
జిహ్వం విద్యానిధి: కంటం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః
కరౌ సీతాపతి: పాతు హృదయం జామదగ్న్య జిత్
మద్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః
సుగ్రీవేశః  కటీపాతు సక్తినీ హనుమత్ప్రభు:
ఊరూర ఘూత్తమఃపాతు రక్షఃకుల వినాశక్రుత్
జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపు:
ఏతాం రామబలో పేతాం రక్షాయ స్సుక్రుతీ పటేత్
సచిరాయు: స్సుఖీ పుత్రీ విజయీ వినయీభవేత్
పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మ చారిణః
నద్రష్టుమపి శక్తాస్తే రక్షితమ్ రామనామాభి:
రామేతి రామాభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపై ర్భుక్తిం ముక్తిం చ విందతి
జగజ్జై త్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యఃకంటే దారయేత్త స్య కరస్థాః సర్వ సిద్ధయః
వజ్ర పంజర నామేదం యోరామకవచం స్మరేత్
ఆవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం
ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిహం హరః
తథా లిఖిత వాన్ ప్రాతః ప్రబుద్దో బుధ కౌశికః
ఆరామః కల్పవ్రుక్షాణాం విరామ స్సకలాపదామ్
అభిరామస్త్రి లోకానామ్ రామః శ్రీమాన్సనః ప్రభు:
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ
ఫలమూలసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథ స్యైతౌ భ్రాతరౌ రామలక్షణౌ
శరణ్యే సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతామ్
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాంనో రఘూత్తమౌ
ఆత్త సజ్యద నుష్టావిఘస్ప్రుశావక్ష యాశుగ నిసంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్చతామ్
సన్నద్దః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః
రామో దాశరథి స్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్ద్సః పురుషః పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో యజ్నేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశెఅమెథాధి కం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః
రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాసనమ్
స్తువంతినామభిర్ది వ్యైర్నతే సంసారిణో నరాః
రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్
కాకుత్ద్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్య సందం దశరథ తనయం శ్యామలమ్ శాంతమూర్తిమ్
వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్
రామాయ రామ భద్రాయ సీతాయాః పతయే నమః
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీరామ రామ రఘునందన రామరామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ
శ్రీరామరామ రణకర్కశ రామరామ
శ్రీరామరామ శరణం భవ రామరామ
శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళు
ర్నాన్యం జానే నైవ జానే న జానే
దక్షిణే లక్షణో యస్య వామే చ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్
లోకాభిరామం రణరంగ ధీరం
రాజీవనేత్రం రఘువంశ నాథమ్
కారుణ్యరూపం కరుణాకరంతం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్
వాతాత్మజం వానర యూథ ముఖ్యమ్
శ్రీరామదూతం శరణం ప్రపద్యే
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కొకిలం
ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
భర్జనం భవ బీజానా మర్జనం సుఖసంపదామ్
తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనమ్
రామో రాజమణి స్సదా విజయతే రామం రామేశంభజే
రామేణాభి రతి: నిశాచార చమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పారాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయ స్సదా భవతు మేభో రామ మాముద్ధర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
         
ఇతి శ్రీ బుధ కౌశికముని విరచితం శ్రీరామరక్షా స్తోత్రం సంపూర్ణం

Sunday 16 November 2014

శ్రీ వేణీమాధవ స్వామి ఆలయం...

శ్రీ వేణీమాధవ ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగకు దగ్గరలోని దారాగంజ్ లో ఉన్నది. తీర్థరాజమైన  ప్రయాగకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో మనందరికీ తెలుసు... ఈ దారాగంజ్ ప్రాంతం అలహాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. ఈ ఆలయం ప్రయాగలో పవిత్ర యమునా నది తీరంలో  సరస్వతీ ఘట్ కు దగ్గరగా ఉంది..అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించకముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం అన్నమాట...

ఇక్కడి  వేణీమాధవుణ్ణి "వేణీ మాధో భగవాన్" కూడా అంటారు.. ప్రయాగలోని 12 మాధో ఆలయాల్లో ఈ వేణీ మాధవ ఆలయం చాలా ప్రముఖమైనది... తులసీదాసు తన "రామచరితమానసము" లో ఈ వేణీ మాధవుణ్ణి ప్రయాగకు రాజుగా అభివర్ణించాడు... ఇంకా ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసిన భక్తులు ఈ వేణీమాధవుణ్ణి దర్శించకుంటే ఆ స్నాన ఫలం పొందరని కూడా తన రామచరితమానసంలో చెప్పాడు తులసీదాసు..

తమ వనవాసంలో సీతారామలక్ష్మణులు ఈ ఆలయాన్ని దర్శించినట్టు చెప్పబడి వుంది...శ్రీ  చైతన్య మహాప్రభువు కూడా ప్రయాగ వచ్చినప్పుడు ఇక్కడ కొంత కాలం గడిపారు..ఈ ఆలయంలోని రాధాకృష్ణుల మూర్తుల చాలా అందంగా ఉంటాయి.. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు..త్రివేణీ  సంగమ స్థానం నుండి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది....

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గల కుంతీమాధవ ఆలయాన్ని దర్శిద్దాం...

తమసోమా జ్యోతిర్గమయ

"తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ'' అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం అన్నది దీని భావార్థం. అప్పుడే ఈ జీవితానికి అర్థం, పరమార్థం చేకూరినట్లని, అలా అయితేనే, ఈ జీవుడు పరబ్రహ్మలో విలీనమై, మళ్లీ
జన్మకు రావలసిన పనిలేకుండా పోతుంది.

అయితే ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంతా పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు ఈ జన్మపరంపరలోకి ఎందుకు వచ్చినట్లు? ఈ సృష్టి పరిణామానికి అర్థం ఏమిటి? వచ్చిన చోటికి తిరిగి వెళ్లడమే జీవితానికి ఏకైక పరమార్థం అయినప్పుడు అసలు రావడం ఎందుకు? ఎందరో మహనీయులు జీవన్ముక్తిని సాధించారు. భగవంతునిలో ఏకమై
ముక్తస్థితిని పొందారు. అమృతత్వాన్ని సాధించారు.
జీవన్ముక్తిని సాధించాక, ముక్తిధామం చేరుకునే
మధ్యకాలంలో తన చుట్టూ ఉన్న శిష్యకోటికి తమదైన
మార్గనిర్దేశం చేశారు. అది ఆనాటి ధర్మం.
అసలింతకూ ధర్మం అంటే ఏమిటి? సృష్టి పరిణామక్రమాన్ని సత్యపరంగా పట్టి ఉంచేదే ధర్మం. దానికి అడ్డుగా నిలిచేది అధర్మం. ఇది శక్యంకానప్పుడే దైవం అవతరించి ఆ అవరోధాన్ని తొలగిస్తాడు. అలా అవతరించిన వారే అవతారమూర్తులు.

(తెలుగు బాట నుండి...)

శ్రీ అన్నపూర్ణాష్టకం...

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ ||

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...