Friday 29 August 2014

వినాయకచవితి శుభాకాంక్షలు

“సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజ కర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః
ధూమ్ర కేతుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్రతుండఃశూర్పకర్ణ: హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నః తస్య నజాయతే.”

అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు...

Thursday 28 August 2014

హరితాళిక గౌరీ వ్రతము

హరితాళిక గౌరీ వ్రతం:

కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు
పరమశివుడిని ఇలా అడిగింది “స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను
భక్తిక శ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదానవ్రతమాచరించడం వల్ల లభించారు” అని అడిగింది.ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా
నేను వారికి వశుడనైతాను. భాద్రపద
శుక్లపక్షంలో హస్తనక్షత్రంతో కూడిన
తదియనాడు వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను. విను!” అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్ పర్వతము కలదు. హిమవంతుడా
ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు.
చిన్నతనం నుంచే శివభక్తురాలవు.
యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరగునా? అని హిమవంతుడు ఆలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులొకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యనెవరికిచ్చి వివాహం చేయదలిచావు? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నానికి
అన్నివిధముల యోగ్యమైనవాడు
బ్రహ్మాదిదేవతలలో విష్ణువు. అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు మునీందరా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నినుపంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడందుకంగీకరించి బయలుదేరాడు.
హిమవంతుడు ఆనందంతో భార్యాపిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి “ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని” తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి చాలా దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు.
నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు
చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను.చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం” అంటారు. ఆరోజు శివరాత్రి వలె
ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా
పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి” అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు.

వ్రత విధానం:
16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని తోరాముగా చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయకచవితి రోజు దంపతులకు భోజన, వస్త్ర, దక్షిణ
తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో
సైకతలింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జనం చేయాలని శివుడు పార్వతికి వివరించాడు.

Sunday 24 August 2014

పొలాల అమావాస్య

పొలాల అమావాస్య కథ:

ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణిదేవి పార్వతీ దేవిని సత్పుత్రులను మరియు సకల శుభాలను కలిగించే ఒక వ్రతం గురించి తెలుపమని వేడుకుంది. అప్పుడు మాత పోలా అమావాస్య వ్రతం గురించి చెప్పింది.

పూర్వం శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు.ఆయన భార్య సుమిత్ర.వారికి  ఎనిమిది మంది పుత్రులు.వారిలో పెద్దవాడి పేరు శంకరుడు,ఆయన భార్య విదేహ. ఈమెకు కలిగిన శిశువులందరూ పుట్టగానే మరణించేవారు. 

ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధము ఆరంభమగుచుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. మామగారి శ్రాద్ధం భంగమగునని కోడలు విదేహను ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అత్త సుమిత్ర బెదిరించింది. భయపడిన విదేహ మృత శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించింది. మృతశిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు విదేహను ఆదేశించగా, భయపడ్డ విదేహ తన దీనగాథను ఆమెకు వివరించింది. దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు విదేహతో ఇలా అన్నది "అమ్మా విదేహ! నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి. శ్రావణ మాసపు అమావాస్య నాడు ఈ ఆలయానికి 64 మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు. ఆ రోజున నీవు వారికి నీ కష్టాలను తెలియజేయి. వారు నీకు తప్పక సాయం చేస్తారు.వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాగుండు" అని తెలిపింది. ఇది విన్న విదేహ అలాగే చేసింది. శ్రావణమాస అమావాస్యనాడు మధ్యరాత్రి 64 యోగినులు ఆ దేవి పూజకు విచ్చేయగా, విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాగి ఉంది.

పూజముగిసిన తర్వాత,అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా, విదేహ బయటకువచ్చి తన కష్టాలను వారికి తెలుపగా, కరుణా సాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ప్రతి సంవత్సరము శ్రావణ మాసపు అమావాస్యనాడు పోలా వ్రతం ఆచరించినచో నీకు తప్పక మంచి జరుగునని చెప్పి అంతర్థానమైయ్యారు.

సజీవులైన కుమారులతో విదేహ ఇంటికి రాగ భర్త, అత్తమామలు చాలా సంతోషించారు. అలా విదేహ ప్రతి యేటా శ్రావణ అమావాస్య నాడు పోలా వ్రతమును ఆచరించి సుఖసంతోషాలను పొందింది. కావున ఈ వ్రతాన్ని భూలోకాన శ్రావణ ఆమావాస్యనాడు ఎవరు ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి, సద్గతులు పొందుతారని పార్వతీ మాత ఇంద్రాణిదేవికి వివరించింది.

Saturday 16 August 2014

శ్రీ కృష్ణాష్టమి

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం|
దేవకీ పరమానందం కృష్ణంవందే జగద్గురుమ్||

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి  సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ
కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది.

శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , వ్యూహకర్త
రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి ,
యోగేశ్వరేశ్వరుడు ,మహానుభావుడు.... అయినా ఆయన గురించి ఏం చెప్పగలం. ఆ గీతాచార్యుని గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన జగదోద్ధారకుడు, లోకరక్షకుడు, కరుణామూర్తి.

మధుర, ద్వారక, బృందావనం, ఉడిపి, పూరీ, గురువాయూరు, తదితర క్షేత్రాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ యదుకుల భూషణుడు అర్థరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్నికృష్ణుడి విగ్రహానికి మంగళస్నానం చేయించి పట్టుదట్టీ కట్టి, సందేట తాయత్తులూ, సరిమువ్వగజ్జెలూ బంగారు మొలతాడుతో ముద్దుకృష్ణుడిగా
అలంకరిస్తారు. అనంతరం ఊయలసేవ,
పవళింపు పూజలు అయిన తరువాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు.

అందుకే మరొక్కసారి చెప్పుకుందాం "కృష్ణం వందే జగద్గురుం". అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.....

వందనము రఘునందన..

రచన:శ్రీ త్యాగరాజు.
రాగం:సహానా.
తాళం:ఆది.

పల్లవి:
వందనము రఘు నందన సేతు
బంధన భక్త చందన రామ     ||వందనము||

చరణాలు:
1. శ్రీ-దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ   ||వందనము||
2. శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ-భారమా రామ   ||వందనము||
3. వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ    ||వందనము||
4. ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ-వాడను రామ       ||వందనము||
5. కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ   ||వందనము||
6. న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ ||వందనము||
7. చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ        ||వందనము||
8. క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ    ||వందనము||
9. వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ   ||వందనము||

Friday 15 August 2014

జై హింద్

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలు...

Saturday 9 August 2014

రాఖీ పౌర్ణమి - హయగ్రీవ జయంతి

రాఖీ పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి:

‘రక్ష' అంటే రక్షించటమని, ‘బంధన్' అంటే బంధం కలిగి ఉండటంగా చెపుతారు. రెండిటిని కలిపి రక్షాబంధన్ గా చెపుతారు. రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున ఒక సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని
రంగాల్లోను విజయం పొందాలని, సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. రాఖీ పండుగ ప్రాధాన్యతను పరిశీలిస్తే

బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి
తన రాజ్యరక్షణాభారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండి పోవలసి వస్తుంది.అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన
కోరిక మేరకు విష్ణువును విడుదల చేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.

శ్రీ కృష్ణుడుకి శిశుపాలుడితో జరిగిన ఒక యుద్ధంలో క్రిష్ణుడు తన చేతి వేలికి గాయం చేసుకుంటాడు. రక్తం బాగా కారుతూంటే, అక్కడే ఉన్నద్రౌపతి తన చీర కొంగు చించి అతని వేలికి కడుతుంది. అపుడు శ్రీ క్రిష్ణుడు ఆమెను సోదరి సమానురాలిగా భావించి
ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి ఆమెను తదుపరి రోజులలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు.


శ్రీ హయగ్రీవ జయంతి:

శ్రావణ శుద్ధ పౌర్ణమి ... 'హయగ్రీవ జయంతి'గా కూడా చెప్పబడుతోంది. గుర్రం శిరస్సు భాగాన్ని కలిగివాడిగా కనిపించే ఈ దేవతామూర్తి సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. లోక కల్యాణం కోసం శ్రీమహా విష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటిగా చెప్పబడుతోంది. హిరణ్య కశిపుడిని సంహరించడానికి నరసింహస్వామి అవతారమెత్తిన నారాయణుడు, ఇక్కడ కూడా అసురసంహారం కోసమే హయగ్రీవుడుగా అవతరించాడు. హయము అంటే గుర్రం అని మరియు గ్రీవము అంటే కంఠము అని అర్థం.

పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు, తన రూపంలోవున్నవారి చేతిలోనే తప్ప మరెవరి చేతిలో మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరగర్వంతో అటు దేవతలను ... ఇటు సాధు సత్పురుషులను నానారకాలుగా హింసించడమే కాకుండా వేదాలను సైతం దొంగిలిస్తాడు. దాంతో దేవతలంతా కలిసి వైకుంఠానికి చేరుకొని, అక్కడే హయగ్రీవోత్పత్తి జరిగేలా చేస్తారు.గుర్రం శిరస్సును పొందిన నారాయణుడుకి సమస్త దేవతలు తమ జ్ఞాన శక్తిని ధారపోస్తారు. దాంతో హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడతాడు. అసుర సంహారం అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేస్తుంది. నారాయణుడు ... హయగ్రీవుడిగా అవతరించిన ఈ రోజున ఎవరైతే లక్ష్మీ సమేతుడైన హయగ్రీవుడిని ఆరాధిస్తారో, వాళ్లకి జ్ఞానసిద్ధి కలిగి విద్యయందు రాణిస్తారనీ ... విజయంతో పాటుగా సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవి పలుకుతుంది.

అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Friday 8 August 2014

శ్రీ మహాలక్ష్మి అష్టకమ్

నమస్తేస్తు మహామాయే - శ్రీ పీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే   ||1||

నమస్తే గరుడారూషఢే - డోలాసురభయంకరి
సర్వపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమోస్తుతే  ||2||

సర్వజ్ఞే సర్వవరదే - సర్వదుష్టభయంకరి
సర్వదుఃకహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే  ||3||

సిద్ధిబుద్ధిప్రదే దేవి - భుక్తిముక్తిప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే  ||4||

ఆద్యంతరహితే దేవి - ఆదిశక్తే మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే - మహాలక్ష్మీ ర్నమో స్తుతే  ||5||

స్థూలసూక్ష్మే మహారౌద్రే - మహాశక్తే మహోదరే
మహాపాపహరే దేవి - మహాలక్ష్మీ ర్నమో స్తుతే  ||6||

పద్మాసనస్థితే దేవి - పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే  ||7||

శ్వేతాంబరధరే దేవి - నానాలంకారభూషితే
జగత్థ్సితే జగన్మాతర్ - మహాలక్ష్మీ ర్నమో స్తుతే   ||8||

ఫలశృతి:
మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం - యః పఠే ద్భక్తిమా న్నరః
సర్వసిద్ధి మావాప్నోతి - రాజ్యం ప్రాప్నోతి సర్వదా   ||1||

తేకకాలే పఠే న్నిత్యం - మహాపపావినాశనమ్
ద్వికాలం యః పఠే న్నిత్యం - ధనధాన్యసమన్వితః  || 2||

త్రికాలం యః పఠే న్నిత్యం - మహాశత్రువినాశనం
మహాలక్ష్మీ ర్భవే న్నిత్యం - ప్రసన్నా వరదా శుభా ||3||

ఇతి శ్రీ ఇంద్రకృతం మహాలక్ష్మిఅష్టకం సంపూర్ణం..

Thursday 7 August 2014

శ్రీ హరి స్తోత్రం

జగజ్జాలపాలం కన:కంఠమాలం
శరత్చంద్రఫాలం మహదైత్యకాలం
నభో నీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేహం భజేహం   ||1||

సదాంభోధి వాసం గళత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసం
గధాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హస:చారు వక్త్రం భజేహం భజేహం     ||2||

రమాకంఠహారం శృతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారం
చిదానందరూపం మనోజ్ఞ్న స్వరూపం
ధృతానేక రూపం భజేహం భజేహం    ||3||

జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనం
జగజ్జన్మహేతుం సురానీక కేతుం
త్రిలొకైక సేతుం భజేహం భజేహం    ||4||

కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిధానం హరారాధిమానం
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్థార్ధసూలం భజేహం భజేహం    ||5||

సమస్థామరేసం ద్విరేఫాభ క్లేశం
జగత్బింబలేశం హృదాకాశవేశం
సదాదివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేహం భజేహం   ||6||

సురాళీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూనాంగరిష్ఠం స్వరూపైకనిష్టం
సదా యుధ్ధధీరం మహవీరవీరం
భవాంభోదితీరం భజేహం భజేహం   ||7||

రమావామభాగం తలానగ్ననాగం
కృతాధీనయాగం గతారాగరాగం
మునీంద్రై:సుగీతం సురైసంపరీహం
గుణౌగైరతీతం భజేహం భజేహం     ||8||

ఫలశృతి:
ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్తకం కష్టహరం మురారే
సవిష్ణోర్విశోకం ధ్రువం యతిలోకం
జరాజన్మశోకం పునర్విందతే నో.

ఇతి శ్రీ పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం హరి స్తోత్రం సంపూర్ణం.

Tuesday 5 August 2014

శ్రీ కృష్ణాష్టకం...

భజే వ్రజైక మండనం సమస్త పాపఖండనం
స్వభక్త చిత్త రంజనం సదైవ నందనందనం
సుపిచ్చ గుచ్చ మస్తకం సునాదవేణు హస్తకం
అనంగరంగ సాగరం నమామి కృష్ణ నాగరం  ||1||

మనోజగర్వ మోచనం విశాలలోల లోచనం
విధూత గోపశోచనం నమామి పద్మలోచనం
కరారవింద భూధరం స్మితావలోకసుందరం
మహేంద్ర మానదారణం నమామి కృష్ణవారణం ||2||

కదంబ సూనకుండలం సుచారుగండమండలం
వ్రజంగనైక వల్లభం నమామి క్రిష్ణ దుర్లభం
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైక దాయకం నమామి గోపనాయకం  ||3||

సదైవ పాదపంకజం మదీయ మానసేనిజం
దధాన ఉత్తమాలకం నమామి నందబాలకం
సమస్త దోష శోషణం సమస్తలోక పోషణం
సమస్త గోప మానసం నమామి నందలాలసం  ||4||

ధృవోభరావతారకం భవాబ్ధి కర్ణధారకం
యశోమతే కిశోరకం నమామి చిత్తచోరకం
ధృగంత కాంత భంగినం సదా సదా లసంగినం
దినేదినే నవంనవం నమామి నంద సంభవం    ||5||

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషణ్ణి కందనం నమామి గోపనందనం
నవీన గోపనాగరం నవీన కేళి లంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం   ||6||

సమస్త గోపనందనం హ్రిదంభుజైక మోదనం
నమామి కుంజ మధ్యగం ప్రసన్న భానుశోభనం
నికామ కామదాయకం ధృగంత చారుసాయకం
రసాలవేణు వేణుగాయకం నమామి కుంజనాయకం  ||7||

విదగ్ధ గోపికా మనో మనోఙ్ఞతల్పశాయినం
నమామి కుంజ కాననే ప్రవ్రద్ద వహ్నిపాయినం
కిశోరకాంతి రంజితం ధృగంజనం సుశోభితం
గజేంద్రమోక్ష కారిణం నమామి శ్రీవిహారిణం    ||8||

ఇతి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కృష్ణాష్టకమిదం సంపూర్ణం...

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...