Wednesday 31 December 2014

వైకుంఠ ఏకాదశి...

వైకుంఠ ఏకాదశి: (01-01-2015)

రేపే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.

పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటిఏకాదశి అంటారు. వైష్ణవాలయాలలో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన,పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్నదానం చేస్తారు. ఒక రోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండడం చాలా శ్రేష్ఠం. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే!వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటి నుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు...

Tuesday 30 December 2014

మహావాక్యాలు - 2:

1) प्रज्ञानम् ब्रह्मम् - ప్రజ్ఞానం బ్రహ్మ
చతుర్విధ మహావాక్యాలలో మొదటి మహావాక్యం "ప్రజ్ఞానం బ్రహ్మ". ఈ మహావాక్యం ఋగ్వేదం నుండి గ్రహించబడింది. ఋగ్వేదం లోని ఐతరేయోపనిషత్తు లోనిది ఈ మహావాక్యం.ఈ వాక్యన్ని మనం విడదీసి అర్థాన్ని చేసినట్లయితే ఈ మహావాక్య అర్థం "విశేషమైన జ్ఞానమే బ్రహ్మం " అది ఎలాగంటే प्रज्ञानम् ब्रह्मम् - ప్రజ్ఞానం బ్రహ్మం లో (प्र+ज्ञानम्+ब्रह्मम् - ప్ర+జ్ఞానమ్+బ్రహ్మమ్ ) అంటే ప్ర = విశేషమైనది, జ్ఞానం = జ్ఞానము, బ్రహ్మం = బ్రహ్మము.

ఐతరేయోపనిషత్తులో నుండి తీసుకోబడిన ఈ వాక్య విశిష్టత ఏమిటంటే ఇది "లక్షణ వాక్యం". ఈ వాక్యం లక్షణ వాక్యం ఎందుకయిందంటే ఈ వాక్యం బ్రహ్మం యొక్క లక్షణాన్ని తెలుపుతున్నాది కాబట్టి.

ఇప్పడు ప్రజ్ఞానం అంటే ఏమిటో విపులంగా తెలుసుకుందాం... ప్రజ్ఞానం అంటే చూడడం, వినడం, వాసన చూడడం అంటే గ్రహించడం,వ్యాప్తి చేయడం అంటే విపులీకరించడం అంటే విశదంగా తెలిసుకొనడం జరుగుతుందో అదే ప్రజ్ఞానం అంటే " విశిష్టమైన జ్ఞానం " లేదా " విశేషమైన జ్ఞానం ". ప్రజ్ఞానం అంటే పరీపూర్ణమైన జ్ఞానం.

ప్రజ్ఞానం అంటే మహోన్నతమైన జ్ఞానం. ఇది అంతఃకరణములో లేదా మనసులో ఉండే చైతన్యం. ప్రజ్ఞానం అనేది ఎప్పుడూ దాగి ఉంటుంది. ఎప్పడైతే మన మనసు నిజమైన భక్తి ఆవరిస్తుందో అప్పుడే మన అంతఃకరణ #చైతన్యం మేల్కొంటుంది. ఒకసారి ప్రజ్ఞానం అనేది బయపడితే తిరిగి మళ్ళీ అది దాగదు... ప్రజ్ఞానాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం... "ఒకసారి ఒక మానవుడు ఒక దేవాలయానికి వెళ్ళాడు... ఆయన భగవద్దర్శనంలో భాగంగా ఆ గుడిలోని మూలవిరాట్టును తాకాడు... తాకగానే ఆయన యొక్క శరీరం అంతా ఆ భగవంతుని యొక్క శక్తి ప్రవహించి అంతఃకరణములోని చైతన్యం జాగృతమైంది లేదా మేల్కొన్నది...ఎందుకంటే ఆ విగ్రహములోని శక్తిపుంజాలు ఆయన యొక్క చైతన్యాన్ని మేల్కొల్పాయి..."
      ప్రజ్ఞానం జాగృతమవాలంటే అంతఃకరణ శుద్ధి అతి అవసరం. ప్రజ్ఞానం అనేది ఒక అనభవం కాదు. అది కష్టపడడం వల్ల కూడా రాదు. ప్రజ్ఞానం అనేది 'స్వయం ప్రకాశం', అది మన అంతఃకరణములోనే జాగృతమవాలి. ప్రజ్ఞానాన్ని బయటపడకుండా ప్రపంచంలోని ఏ వస్తువూ ఆపలేదు.  అది సాధకుడి సాధనను బట్టి సరియైన సమయంలో మాత్రమే బయపడుతుంది ఎందుకంటే ఒక్కొక్కరి సాధన ఒక్కొలాగా ఉంటుంది....

(ఇంకా వుంది........)

Monday 29 December 2014

మహావాక్యాలు - 1:

వేదాలన్నిటికీ సారాలు ఉపనిషత్తులే. ఉపనిషత్తులనే వేదాంతలు అని కూడా అంటారు. ఉపనిషత్తులలోని "చతుర్విధ మహావాక్యాలు" జీవ బ్రహ్మైక్య సారాలుగా చెప్పబడుతున్నాయి. మనకు నాలుగు మహా వేదాల నుండి అతిముఖ్య వాక్యాలుగా నాలుగు మహా వాక్యాలను తీసుకోవడం జరిగింది... అవి

1)प्रज्ञानम् ब्रह्मम् - ప్రఙ్ఞానం బ్రహ్మం
(ఋగ్వేదం లోనిది)

2)अहम् ब्रह्मास्मि - అహం బ్రహ్మస్మి
(యజుర్వేదం లోనిది)

3)तत्त्वमसि - తత్త్వమసి
( సామవేదం లోనిది)

4)अयमात्मा ब्रह्म - అయమాత్యా బ్రహ్మ
(అధర్వణవేదం లోనిది)

అయితే ఈ నాలుగు మహావాక్యాల్లో కెల్లా... ఆతిముఖ్యమైన మహావాక్యంగా సామవేదంలోని "తత్త్వమసి" మహావాక్యాన్ని చెబుతారు...

ఈ వాక్యాలను గురించి నా #శక్తి కొద్ది మీకు అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను... కానీ ఈ పోస్టులను కాస్త జాగ్రత్తగా చదువవలసినదిగా ప్రార్థన... ఎందుకంటే ఇవి మహా వాక్యాలు కాబట్టి.... రేపటి నుండి ఈ మహావాక్యాలను అర్థ సహితంగా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం... ఉంటాను మరి...
జై శ్రీ రామ...

Tuesday 23 December 2014

భో! శంభో! శివశంభో స్వయంభో!

కీర్తన : శ్రీ స్వామి దయానంద సరస్వతి
రాగం : రేవతి
తాళం : ఆది

పల్లవి:
భో! శంభో! శివశంభో స్వయంభో!   ।। భో శంభో ।।

అనుపల్లవి:
గంగాధర శంకర కరుణాకర
మామవ భవసాగర తారక   ।। భో శంభో ।।

చరణాలు:
నిర్గుణ పరబ్రహ్మ స్వరూప
గమగమ భూత ప్రపంచ రహిత
నిజపుర నిహిత నితాంత అనంత
ఆనంద అతిశయ అక్షయలింగ    ।। భో శంభో ।।

ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకతోం 
తోం తోం తిమికిట తరికిట తకతోం
మతంగ మునివర వందిత ఈశా
సర్వ దిగంబర వేష్టితవేష
నిత్య నిరంజన నిత్యనటేశ
ఈశ సభేశ సర్వేశ      ।। భో శంభో ।।

Monday 22 December 2014

శ్రీ శివ సహస్రనామ స్తోత్రము:

~~~ ప్రార్థన ~~~


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే - 1

గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గరవే నమః  - 2

యాకుందేందు తుషారహారధవళా యాశుభ్ర వస్త్రావృతా
యా వీణావరదండమండితకరా  యా శ్వేత పద్మాసనా - 3

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా - 4

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం  - 5

వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్  - 6

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః  - 7

~~~ శివ సహస్రనామ ప్రారంభ ~~~

ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః

సర్వాత్మా సర్వవిఖ్యాత స్సర్వ స్సర్వకరో భవః
జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ స్సర్వభవనః - 1

హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః
ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతశ్శాశ్వతో ధ్రువః - 2

శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దనః
అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః - 3

ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః
మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః - 4

మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః
లోకపాలోంతర్హితాత్మా ప్రసాదో నీలలోహితః - 5

పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః
సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః - 6

సహస్రక్షో విశాలాక్ష స్సోమో నక్షత్రసాధకః
చంద్రస్సూర్యశ్శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః - 7

ఆద్యంతలయకర్తాచ మృగబాణార్పణోనఘః
మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః - 8

సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః
యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః - 9

సువర్ణరేతా సర్వజ్ఞ స్సుబీజో బీజవాహనః
దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః - 10

విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో బలో గణః
గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవచ  - 11

మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః
కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ - 12

అశనిః శతఘ్నీ ఖడ్గీ పట్టసీ చాయుధీ మహాన్
స్సువహస్త స్సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః - 13

ఉష్ణీషీచ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా
దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవచ - 14

సృగాలరూపస్సిద్ధార్థో మృడస్సర్వశుభంకరః
అజశ్చ బహురూపశ్చ గంగాధారీ కపర్ద్యపి - 15

ఊర్ధ్వరేతా ఉర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్థలః
త్రిజటశ్చీరవాసాశ్చ రుద్రస్సేనాపతిర్విభుః - 16

నక్తంచరో హశ్చరశ్చ తిగ్మమన్యుస్సువర్చసః
గజహా దైత్యహా కాలో లోకధాతాగుణాకరః - 17

సింహశార్ధూలరూపశ్చ వ్యాఘ్రచర్మాంబరావృతః
కాలయోగీ మహానాథ స్సర్వకామశ్చతుష్పథః - 18

నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః
బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః - 19

నృత్యప్రియో నిత్యనర్తో నర్తక స్సర్వలాలసః
మహాఘోరతపాశ్శూరో నిత్యో నీహో నిరాలయః - 20

సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః
అమర్షణో మర్షణాత్మా యజ్ఞహా కామనాశకః - 21

దక్షయాగాపహారీచ సుసహో మధ్యమస్తథా
తేజో పహారీ బలహా ముదితో ర్థో జితో వరః - 22

గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః
న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితి ర్విభుః - 23

సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః
విశ్వక్సేనో హరిర్యజ్ఞ స్సంయుగాపీడవాహనః - 24

తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్
విష్ణుప్రసాదితో యజ్ఞ స్సముద్రో బడబాముఖః - 25

హుతాశన సహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః
ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ - 26

జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవచ
శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ - 27

వైష్ణవః ప్రజవీ తాళీ ఖేలీకాల త్రికంటకః
నక్షత్రవిగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమః  - 28

ప్రజాపతిర్విశ్వబాహు ర్విభాగ స్సర్వతోముఖః
విమోచన స్సుసరణో హిరణ్యకవచోర్భవః - 29

మేఘజో బలచారీ చ మహీచారీ స్తుతస్తథా
సర్వతూర్యవినోదీచ సర్వవాద్యపరిగ్రహః - 30

వ్యాళరూపో గుహావాసీ గ్రహమాలీ తరంగవిత్
త్రిదశః కాలదృక్సర్వకర్మబంధవిమోచనః - 31

బంధనస్త్వసురేంద్రాణాం యుధిశత్రువినాశనః
సాంఖ్యప్రసాదో దుర్వాసా స్సర్వసాధునిషేవితః - 32

ప్రస్కందనొ విభాగజ్ఞోహ్యతుల్యో యజ్ఞభాగవిత్
సర్వవాస స్సర్వచారీ దుర్వాసావాసవో మరః - 33

హైమో హేమకరో యజ్ఞ స్సర్వధారీ ధరోత్తమః
లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః - 34

సంగ్రహో నిగ్రహః కర్తా సర్వచీరనివాసనః
ముఖ్యోముఖ్యశ్చ దేహశ్చ కాహళి స్సర్వకామదః -35

సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపభ్రుత్
సర్వకామప్రదశ్చైవ సర్వద స్సర్వతోముఖః - 36

ఆకాశనిర్విరూపశ్చ నిపాతోహ్యవశః ఖగః
రౌద్రరూపోంశురాదిత్యో బహురశ్మిస్సువర్చసీ - 37

వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః
సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరో కరః  - 38

మునిరాత్మా నిరాలోక స్సంభగ్నశ్చ సహస్రదః
ప్లక్షీచ ప్లక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః  - 39

ఉన్మాదో మదనః కామోహ్యశ్వత్థోర్థకరోయశః
వాహదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణ ఉదజ్ఞుఖః - 40

సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్ధ స్సిద్ధ సాధకః
భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః -  41

మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః
వజ్రహస్తశ్చ విస్రంభో చమూస్తంభన ఏవచ - 42

వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః
వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రితపూజితః - 43

బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్
ఈశాన ఈశ్వరః కాలో నిశాచరీ పినాకభ్రుత్  - 44

నిమిత్తస్థో నిమిత్తంచ నందిర్నాందీకరో హరిః
నందీశ్వరశ్చ నందీచ నందనో నందివర్ధనః  - 45

భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః
చరుత్ముఖో మహాలింగ శ్చారులింగ స్తథైవ చ  - 46

లింగాధ్యక్ష స్సురాధ్యక్షో యోగాధ్యక్షో యుగావహః
బీజాధ్యక్షో బీజకర్తా అధ్యాత్మానుగతో బలః -  47

ఇతిహాస స్సకల్పశ్చ గౌతమో థ నిశాకరః
దంభోహ్యందభో వైదంభో వశ్యో వశకరః కలిః  - 48

లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః
అక్షరం పరమం బ్రహ్మబలవాన్ శక్త ఏవచ  - 49

నీతిర్హ్యనీతి శ్శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః
బహుప్రసాద స్సుస్వప్నో దర్పణో థ త్వమిత్రజిత్  - 50

వేదకారో మంత్రకారో విద్వాన్సమరమర్దనః
మహామేఘ నివాసీచ మహాఘోరో వశీకరః  - 51

అగ్నిజ్వాలో మహాజ్వాలో హ్యతిధూమ్రో హుతో హవిః
వృషభ శ్శంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః  - 52

నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః
స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః  - 53

ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః
కృష్ణవర్ణ స్సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినామ్  - 54

మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః
మహామూర్ధా మహామాత్రో మహానేత్రో నిశాలయః  - 55

మహాంతకో మహా కర్ణో మహోష్ఠశ్చ మహాహనుః
మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానభాక్  - 56

మహావక్షా మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః
లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః -  57

మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః
మహానఖో మహారోమా మహాకేశో మహాజటః  -  58

ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః
స్నేహనో స్నేహనశ్చైవ అజిరశ్చ మహామునిః -  59

వృక్షాకారో వృక్షకేతు రనలో వాయువాహనః
గండలో మేరుధామాచ దేవాధిపతిరేవచ  - 60

అధర్వ శీర్ష స్సామాస్య ఋక్సహస్రామితేక్షణః
యజుః పాదభుజో గుహ్యః ప్రకాశోజంగమస్తథా -  61

అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్య స్సుదర్శనః
ఉపకారప్రియ స్సర్వః కనకః కాంచనచ్ఛవిః -  62

నాభిర్నంది కరోభావః పుష్కరః స్థపతిః స్థిరః
ద్వాదశస్త్రాసన శ్చాద్యోయజ్ఞో యజ్ఞసమాహితః -  63

నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః
సగణోగణకారశ్చ భూతవాహనసఅరథిః - 64

భస్మాశయో భస్మగోప్తా భస్మభూతస్తరుర్గుణః
లోకపాలస్తథా లోకోమహాత్మా సర్వపూజితః -  65

శుక్ల స్త్రిశుక్లసంపన్న శ్శుచిర్భూత నిషేవితః
ఆశ్రమస్థః క్రియావస్థో విశ్వకర్మమతిర్వరః -  66

విశాల శాఖస్తమ్రోష్ఠోహ్యాంబుజాల స్సునిశ్చలః
కపిలః కపిశ శ్శుక్ల ఆయుశ్చైవ పరో పరః  - 67

గంధర్వో హ్యదితి స్తార్ క్ష్య స్సువిజ్ఞేయ స్సుశారదః
పరశ్వధాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః  - 68

తుంబవీణోమహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః
ఉగ్రో వంశకరో వంశో వంశనాదోహ్య నిందితః - 69

సర్వాంగ రూపో మాయావీ సుహృదోహ్యనిలో నలః
బంధనో బంధ కర్తాచ సుబంధన విమోచనః -  70

సయాజ్ఞారిస్స కామారి ర్మహా దంష్ట్రో మహాయుధః
బహుధా నిందితస్సర్వ శంకర శ్చంద్రశేఖరః -  71

అమరేశో మహాదేవో విశ్వదేవ స్సురారిహా
అహిర్భుధ్న్యో నిలాభశ్చ చేకితానో హరిస్తథా -  72

అజైకపాశ్చ కాపాలీ త్రిశంకురజిత శ్శివః
ధన్వంతరి ర్ధూమకేతు స్స్కందో వైశ్రవణ స్తథా -  73

ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్ర స్త్వష్టా ధ్రువోధరః
ప్రభావస్సర్వగో వాయు రర్యమా సవితా రవిః  - 74

ఉషంగుశ్చ విధాతాచ మాంధాతా భూతభావనః
విభుర్వర్ణ విభావీచ సర్వకామ గుణావహః  - 75

పద్మనాభో మహార్భశ్చంద్ర వక్త్రో నిలో నలః
భలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ  - 76

కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః
సర్వాశయో గర్భాచారీ సర్వేషాం ప్రాణినాం పతిః -  77

దేవదేవస్సుఖాసక్త స్సదసత్సర్వ రత్నవిత్
కైలాసగిరి వాసీ చ హిమవద్గిరి సంశ్రయః -  78

కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః
వణిజో వర్ధకీ వృక్షో వకుళ శ్శందనచ్ఛదః -  79

సారగ్రీవోమహాశత్రు రలోలశ్చ మహౌషధః
సిద్ధార్థకారీ సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరః -  80

సింహనాద స్సింహదంష్ట్ర స్సింహగ స్సింహవాహనః
ప్రభావాత్మా జగత్కాలః కాలో లోకహితస్తరుః -  81

సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః
భూతాలయో భూతపతి రహోరాత్ర మనిందితః -  82

వర్ధిత స్సర్వభూతానాం నిలయశ్చ విభూర్భవః
అమోఘస్సంయతో హ్యశ్వోభోజనః ప్రాణధారణః -  83

ధ్రుతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః
గోపాలీ గోపతిర్గ్రామో గోచర్మవసనోహరిః  - 84

హిరణ్య బాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశకః
ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః  - 85

గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః
మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణ సేవితః -  86

మహాకేతుర్మహాధాతుర్నైక సానుచరశ్చలః
ఆవేదనీయ ఆవేశః సర్వగంధ సుఖావహః  - 87

తోరణ స్తారణో వాతః పరిధీపతి ఖేచరః
సంయోగో వర్ధనో వృద్ధో హ్యతివృద్ధో గుణాధికః -  88

నిత్య ఆత్మా సహాయశ్చ దేవాసురపతిః పతిః
యుక్తశ్చ యుక్త బాహుశ్చ దేవోదివి సుపర్వణః  - 89

ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువో థ హరిణోహరః
వపు రావర్త మానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః -  90

శిరోహారీ విమర్శశ్చ సర్వలక్షణ లక్షితః
అక్షశ్చ రథయోగీచ సర్వయోగీ మహాబలః  - 91

సమామ్నాయో సమామ్నాయః సీరదేవో మహారథః
నిర్జీవో జీవనో మంత్రశ్శుభాక్షో బహుకర్కశః -  92

రత్నప్రభూతో రక్తాంగో మహార్ణవనిపానవిత్
మూలం విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపోనిధిః  - 93

ఆరోహణో ధిరోహశ్చ శీలధారీ మహాయశాః
సేనాకల్పో మహాకల్పో యోగో యోగకరో హరిః  - 94

యుగ రూపో మహారూపో మహానాగహనో వథః
న్యాయ నిర్వహణః పాదః పండితోహ్యచలోపమః  - 95

బహుమాలో మహామాల శ్శశీహరిసులోచనః
విస్తారోలవణః కూపస్త్రియుగ స్సఫలోదయః  - 96

త్రినేత్రశ్చోవిషణ్ణాంగో మణివిద్ధో జటాధరః
విందుర్విసర్గ స్సుముఖః శరస్సర్వాయుధస్సహః - 97

నివేదన స్సుఖాజాతః సుగంధారో మహాధనుః
గంధపాలీ చ భగవానుత్థాన స్సర్వకర్మణామ్ -  98

మంథానో బహుళో వాయుః సకలస్సర్వలోచనః
తలస్తాలః కరస్థాలీ ఊర్ధ్వ సంహననో మహాన్ -  99

ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతో లోకస్సర్వాశ్రయక్రమః
ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణః - 100

హర్యక్షః కకుభోవజ్రీ శతజిహ్వ స్సహస్రపాత్
సహస్రమూర్ధా దేవేంద్ర స్సర్వ దేవమయో గురుః -  101

సహస్రబాహు స్సర్వాంగః శరణ్యస్సర్వలోకకృత్
పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః -  102

బ్రహ్మదండ వినిర్మాతా శతఘ్నీపాశశక్తిమాన్
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మ గర్భో జలోద్భవః  - 103

గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః
అనంతరూపశ్చైకాత్మా తిగ్మతేజా స్స్వయంభువః -  104

ఊర్ధ్వ గాత్మాపశుపతిర్వాతరంహఅ మనోజవః
చందనీ పద్మనాళాగ్రస్సురభ్యుత్తరణో నరః - 105

కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళిః పినాకభ్రుత్
ఉమాపతి రుమాకాంతో జాహ్నవీభ్రుదుమాధవః - 106

వరో వరాహో వరదో వరేణ్య స్సుమహాస్వనః
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగళః  - 107

ప్రీతాత్మా పరమాత్మాచ ప్రయతాత్మా ప్రధాన ధృత్
సర్వపార్శ్వముఖస్త్ర్యుక్షో ధర్మసాధారణో వరః - 108

చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః
సాధ్యర్షిర్వసు రాదిత్యో వివస్వాన్ సవితా మృతః  - 109

వ్యాస స్సర్గ స్సుసంక్షేపో విస్తరః పర్యయో నరః
ఋతు స్సంవత్సరో మాసః పక్షస్సంఖ్యా సమాపనః - 110

కళాకాష్ఠాలవామాత్రా ముహూర్తహః క్షపాక్షణాః
విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్య స్సునిర్గమః  - 111

సదసద్వ్యక్తమవ్యక్తం పితామాతా పితామహః
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్  - 112

నిర్వాణం హ్లాదనం చైవ బ్రహ్మలోకః పరాగతిః
దేవాసుర వినిర్మాతా దేవాసుర పరాయణః -  113

దేవాసురగురుర్దేవో దేవాసుర నమస్కృతః
దేవాసుర మహామాత్రో దేవాసురగణాశ్రయః  - 114

దేవాసుర గణాధ్యక్షో దేవాసుర గణాగ్రణీః
దేవాదిదేవో దేవర్షిర్దేవాసుర వరప్రదః  - 115

దేవాసురేశ్వరో విశ్వో దేవాసుర మహేశ్వరః
సర్పదేవమయో చింత్యో దేవతాత్మాత్మ సంభవః -  116

ఉత్పత్తి విక్రమో వైద్యో విరజో నీరజో మరః
ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభః -  117

విబుధో గవర స్సూక్ష్మ స్సర్వ దేవస్తపోమయః
సుయుక్త శ్శోభనో వజ్రీ పాపానాం ప్రభవో వ్యయః  - 118

గుహః కాంతో నిజస్సర్గః పవిత్రం సర్వపావనః
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః - 119

అభిరామస్సురగణో విరామస్సర్వ సాధనః
లలాటాక్షో విశ్వదేవోహరిణోబ్రహ్మవర్చసః  - 120

స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః
సిద్ధార్థ సిద్ధభూతార్థో చింత్య స్సత్యవ్రత శ్శుచిః  - 121

వ్రతాధిపః పరంబ్రహ్మ భక్తానుగ్రహ కారకః
విముక్తో ముక్త తేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్  - 122

~~~ ఫలశ్రుతి ~~~

యథా ప్రధానం భగవాన్ ఇతి భక్త్యాస్తుతో మయా
యం న బ్రహ్మాదయో దేవా విదుస్తత్త్వేన నర్షయః - 1

స్తోతవ్య మర్చ్యం వంద్యంచ కస్తోష్యతి జగత్పతిమ్
భక్త్యా త్వేవం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభుః - 2

తతో భ్యనుజ్ఞాం సంప్రాప్య స్తుతో మతిమతాం వరః
శివమేభిః స్తువన్ దేవం నామభిః పుష్టివర్ధనైః - 3

నిత్యయుక్త శ్శుచి ర్భూతః ప్రాప్నోత్యాత్మానమాత్మనా
ఏతద్ధి పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధిగచ్ఛతి - 4

ఋషయశ్చైవ దేవాశ్చ స్తువంత్యేతేన తత్పరాః
స్తుయమానో మహాదేవః స్తూయతే నియతాత్మభిః - 5

భక్తానుకంపీ భగవాన్ ఆత్మసంస్థాకతో విభుః
తథైవ చ మనుష్యేషు యే మనుష్యాః ప్రధానతః - 6

ఆస్తికాః శ్రద్దధానాశ్చ బహుభిర్జన్మభిః స్తవైః
భక్త్యాహ్యనన్యమ్ ఈశానం పరం దేవం సనాతనమ్ - 7

కర్మణా మనసా వాచా భావేనామితతేజసః
శయనా జాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా - 8

ఉన్మిషన్ నిమిషశ్చైవ చింతయంతః పునః పునః
శృణ్వంతశ్శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవమ్ - 9

స్తువంతస్తూయమానాశ్చ తుష్యంతిచ రమింతచ
జన్మకోటిసహస్రేషు నానాసంసారయోనిషు - 10

జంతోర్విగతపాపస్య భవే భక్తిః ప్రజాయతే
ఉత్పన్నచ భవే భక్తిః అనన్యా సర్వభావతః - 11

భావినః కారణాంచాస్య సర్వముక్తస్య సర్వదా
ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు న లక్ష్యతే - 12

నిర్విఘ్నా నిర్మలా రుద్రే భక్తి రవ్యభిచారిణీ
తస్యైవచ ప్రసాదేన భక్తి రుత్పద్యతే నృణామ్ - 13

యేన యాంతి పరాం సిద్ధిం తద్భావగతచేతసః
యే సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరమ్ - 14

ప్రపన్నవత్సలో దేవః సంసారార్తాన్ సముద్ధరేత్
ఏవమన్యే న కుర్వంతి దేవాః స్సంసార మోచనమ్ - 15

మనుష్యాణామ్ ఋతే దేవం నాన్యా శక్తి స్తపోబలమ్
ఇతి దేవేంద్ర కల్పేన భగవాన్ సదసత్పతిః - 16

కృత్తివాసాస్తుతః కృష్ణ తండినా శుభబుద్ధినా
స్తవ మేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ - 17

గీయతే చ న బుధ్యేత బ్రహ్మశంకరసన్నిధౌ
ఇదం పుణ్యం పవిత్రంచ సర్వదా పాపనాశనమ్ - 18

యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా
ఏవమేతత్పఠంతే య ఏవ భక్త్యాతు శంకరే - 19

యా గతిస్సాంఖ్యయోగానాం వ్రజంతే తాం గతిం తథా
స్తవమేనం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ - 20

అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలమ్
ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితమ్ - 21

బ్రహ్మా ప్రోవాచ శక్రాయ శక్రః ప్రోవాచ మృత్యవే
మృత్యుః ప్రోవాచ రుద్రేభ్యో రుద్రేభ్య స్తండిమాగమత్ - 22

మహతా తపసా ప్రాప్తం తండినా బ్రహ్మసద్మని
తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయచ భార్గవః - 23

వైవస్వతాయ మనవే గౌతమః ప్రాహ మాధవ
నారాయణాయ సాధ్యాయ మనురిష్టాయ ధీమతే - 24

యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణో చ్యుతః
నాచికేతాయ భగవానాహ వైవస్తవో యమః - 25

మార్కండేయాయ వార్ ష్ణేయ నాచికేతో భ్యభాషత
మార్కండేయాన్మయా ప్రాప్తో నియమేన జనార్దన - 26

తవాష్యహ మమిత్రఘ్నస్తవం దద్యాం హ్యవిశ్రుతమ్
స్వర్గ్యమరోగ్యమాయుష్యం ధన్యం వేదేన సంమితమ్ - 27

నా స్యవిఘ్నం వికుర్వంతి దానవా యక్షరాక్షసాః
పిశాచా యాతుధానా వా గుహ్యకా భుజపా అపి - 28

యః పఠేత శుచిః ప్రాతః బ్రహ్మచారీ జితేంద్రియః
అభగ్నయోగో వర్షంతు సో శ్వమేధఫలం లభేత్ - 29

ఇతి శ్రీ శివసహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణమ్..

Sunday 21 December 2014

శ్రీ సూర్యాష్టకం....

శ్రీ శంకర ఉవాచ:
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే - 1

సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 2

లోహితం రథమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 3

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 4

బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశ మేవచ
ప్రభుస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం - 5

బంధూక పుష్ప సంకాశం హర కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 6

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 7

శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం - 8

ఫలశ్రుతి:
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ - 1

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా - 2

స్త్రీ తైల మధు మాంసాని ఏత్యజంతి రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛత - 3

ఇతి శ్రీ శివప్రోక్తం సూర్యాష్టకం సంపూర్ణం...

Saturday 20 December 2014

హనుమాన్ చాలీసా...

దోహా:
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చౌపాయి:
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 |
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా |8 |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా
వికట రూప ధరి లంక జరావా |9 |
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సఁవారే |10 |
లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉరలాయే |11 |
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ |12 |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై |13|
సనకాదిక బ్రహ్మది మునీశా
నారదా శారద సహిత అహీశా |14 |
యమ కుబేరా దిగపాల జహాఁతే
కవి కోవిద కహి సకే కహాఁతే |15 |
తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా |16 |
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17|
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో త్యాహి మధుర ఫల జానూ |18 |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ |19 |
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |20 |
రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |21 |
సబ సుఖులహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూకో డరనా |22 |
ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోఁ లోక హాంకతే కాంపై |23|
భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై |24 |
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా |25 |
సంకట తేఁ హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై |26 |
సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా |27 |
ఔర మనోరధ జో కోయి లావై
తాసు అమిత జీవన ఫల పావై |28 |
చారోఁ యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా |29 |
సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే | 30|
అష్టసిద్ది నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా |31|
రామ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా |32 |
తుమ్హారే భజన రామకోపావై
జన్మ జన్మకే దుఃఖ బిసరావై |33 |
అంతకాల రఘువరపుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ |34 |
ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ |35 |
సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా |36 |
జైజైజై హనుమాన్ గోసాయీఁ
కృపాకరో గురుదేవకీ నాయీ |37 |
యహ శతవార పాఠకర్ కోయీ
ఛూటహిబంది మహా సుఖహోయీ |38 |
జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ది సాఖీ గౌరీసా|39|
తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా|40|

దోహ:
పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్...

Friday 19 December 2014

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం, రామేశ్వరం:

తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ పట్టణమైన రామేశ్వరంలో శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం ఉన్నది... పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవ స్వామి ఆలయం రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయ ఆవరణలో ఉంది. అలాగే ఈ ఆలయాన్ని ఆనుకొని ఒక కోనేరు కూడా ఉంది. లక్ష్మీ కటాక్ష ప్రాప్తికై భక్తులు ఈ కోనేరు స్నానాలు చేస్తారు...

ఇక్కడి శ్రీ సేతుమాధవ స్వామి శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఈ సేతుమాధవ స్వామిని "శ్వేత మాధవ స్వామి" అని కూడా పిలుస్తుంటారు... ఎందుకంటే స్వామి విగ్రహం పాలరాతితో చేయబడింది కాబట్టి....

జై సేతు మాధవ.... జై శ్రీ రామ...

Sunday 14 December 2014

కాలభైరవాష్టమి....

కాలభైరవాష్టమి: (మార్గశిర బహుళ అష్టమి)

శ్లో॥ కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి। తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥

శ్రీ కాలభైరవస్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి... కాలభైరవస్వామి ఆవిర్భవానికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన వున్న తన ఐదవ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది.

మహోన్నతకాయముతో... మూడు నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకము వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే - శ్రీకాలభైరవుడు. శివుని  ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన వున్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది.

బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది... అదే బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది...

శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ వుంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ  కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో గల కాలభైరవ ఆలయాల్లో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. లేదంటే శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.

కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశ అందునా శివక్రోధము చేత జన్మించాడు... ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. నాలుగు చేతుల్లో శూలం,కపాలం,గద మరియు ఢమరుకం ఉంటాయి. రౌద్రనేత్రాలు , పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనం శునకం.

శ్రీ శివమహా పురాణం ప్రకారం ప్రధానంగా భైరవుని రూపాలు ఎనిమిది. అవి
1) కాల భైరవ
2) అసితాంగ భైరవ
3) సంహార భైరవ
4) రురు భైరవ
5) క్రోధ భైరవ
6) కపాల భైరవ
7) రుద్ర భైరవ
8 ) ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం.... ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ 'కాలభైరవాష్టకం' కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
               జై కాలభైరవా...

Friday 12 December 2014

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం...

శ్రీ  విష్ణు సహస్రనామ స్రోత్రము:

పూర్వ పీఠికా:
శుక్లాంబరధరం  విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।
వ్యాసం వశిష్ట  నప్తారం శక్తేపౌత్రమ కల్మషం ।
పరాశరాత్మజం వంన్దే  శుకదాతం తపోనిధిం।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే।
నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమ: ।।
అవికారాయ  శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే।। 
                 
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంథనాత్।
విముచ్యతే నమ   స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే।।
ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే....
శ్రీ వైశంపాయన ఉవాచ:
శ్రుత్వాధర్మా నశేషేణ పావనాని చ సర్వశః ।
యుథిష్టరః శాన్తనవం పునరే వాభ్యభాషిత।।

యుధిష్టర ఉవాచ:
కిమేకం  దైవతం లోకే కింవాప్యేకం   పరాయణం।   
స్తువంతః కంకమర్చన్తః ప్రాప్నుయుర్మానవా శ్శుభమ్।।              
కో థర్మ స్సర్వ థర్మాణాం భవత: పరమో మత:।
కింజప న్ముచ్యతే జంతు ర్జన్మ సంసార భంధనాత్।।

శ్రీ భీష్మ ఉవాచ:
జగత్ర్పభుం దేవదేవ మనతం పురుషోత్తమం।      
స్తువన్నామ సహస్రేణ  పురుష స్సతతోత్థిత:।।
తమేవ చా ర్చయన్నిత్యం సర్వ లోక మహేశ్వరం।
లోకధ్యక్షం స్తువన్నిత్యం  సర్వదు:ఖాతి గో భవేత్।।
బ్రహ్మణ్యం సర్వ థర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్।
లోకనాధం  మహద్భూతం సర్వభూత భవోద్భవమ్।।
ఏషమే సర్వథర్మాణాం థర్మోధికతమో మత:।।
యద్భక్తా పుండరీకాక్షం స్తవైరర్చే న్నరస్సదా।।    
పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప:।।
పరమం  యో మహద్భ్రహ్మ పరమం య: పరాయణమ్।।
                       
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ  మంగళం 
దైవతం  దైవతానాంచ  భూతానాం యో వ్యయ: పిత:।।                  
యత  స్సర్వాణి భూతాని భవన్తాది  యుగాగమే।              
యస్మింశ్చ  ప్రళయం  యాంతి పునరేవ  యగక్షయే।।              
తస్య లోక ప్రధానస్య జగన్నాధస్య భూపతే।
విష్ణోర్నామ   సహస్రం   మే శృణు పాప భయా పహమ్।।
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన:।
ఋషిభి: పరి గీతాని తాని వక్ష్యామి భూతయే।।
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదోవ్యాసో మహాముని:।
ఛందో నుష్టు ప్తథా దేవో భగవాన్ దేవకీ సుత:
 
అమృతాం శూద్బవో  బీజం శక్తి ర్దేవకీ నందన:
త్రిసామా హృదయం  తస్య శాంత్యర్ధే వినియుజ్యతే।।
      
విష్ణుం జిష్ణుం మహా విష్ణుం ప్రభు విష్ణుం మహేశ్వరం।
అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్।।
 
అస్య శ్రీ విష్ణోర్థివ్య సహస్ర నామ స్తోత్ర మహామంత్రస్య
శ్రీ వేదో వ్యాసో భగవానృషి:, అనుష్టుప్ ఛంద:, శ్రీ మహావిష్ణు:, పరమాత్మా శ్రీమన్నారాయణోదేవతా,  అమృతాంశూద్బవో, భానురితి భీజమ్, దేవకీ 
నందన స్రష్టేతి శక్తి:,  ఉద్భవ:, క్షోభణో దేవ ఇతి పరమోమంత్ర:,
శంఖబృన్నందకీ చక్రీతి కీలకమ్, శార్ ఙ్గధన్వా గదాదర ఇత్యస్త్రం,
రధాఙ్గపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్,త్రిసామా సామగ స్సామేతీ కవచం,
ఆనందం పరబ్రహ్మేతియోని:, ఋతు సుదర్శన:,కాల ఇతి దిగ్బంధ:,
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్ధే సహస్ర నామ స్తోత్ర జపే  వినియోగ:

ధ్యానం:
క్షీరోదన్వత్ర్పదేశే శుచిమణి  విలశత్ సైకతే మౌక్తికానాం
మాలాక్లప్తసనస్థః స్పటిక మణినిభైర్మౌక్తికై ర్మండితాఙ్గః
శుభ్రై రభ్రైరదభ్రై రుపరి విరచితై ర్ముక్త పీయూషవరైః
ఆనన్దీ నః పునీయాదరినళిన గద శఙ్ఖ పాణి ర్ముకుందః।।
భూః పాదౌ యస్య నాభి ర్యియ దసు రనిల శ్చంద్ర సూర్యౌచ నేత్రే
కర్ణా వాశా శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్దిః
అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణు మీశం నమామి।।
శాన్తాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాఙ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవ భయహరం సర్వ లోకైక నాథం||
మేఘ శ్యామం పీత కౌశే య వాసం  శ్రీవత్సాఙ్గమ్ కౌస్తుభోద్భాసితాంఙ్గమ్ పుణ్యోపేతం పుండరీకాయతాక్షం- విష్ణుం వందే సర్వలోకైక నాథమ్||
సశంఙ్ఖచక్రం సకిరీట కుండలం- సపీత  వస్త్రం సరసీరు హేక్షణమ్
సహార వక్షస్స్థలశోభి కౌస్తుభం-నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్।।
చాయాయం పారిజాతస్య హేమ సింహాస నోపరి
ఆసీనం అంబుద శ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ  సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే।।  

                  ఇతి పూర్వ పీఠికా
           --------------------------

శ్రీ విష్ణు సహస్ర నామ ప్రారంభః
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ర్పభుః।
భూతకృ ద్భూతభృ  ద్భావో  భూతాత్మ భూతభావనః।
పూతాత్మా పరమాత్మ చ ముక్తానాం పరమా గతిః।
అవ్యయః పురుష సాక్షి క్షేత్రఙ్ఞో క్షర ఏవచ।।
యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషోత్తమః।
నారసింహపు శ్ర్శీమాన్ కేశవః పురుషోత్తమహః।।
సర్వ శర్వ శ్శివ స్థాణు  ర్భూతాది ర్నిధి రవ్యయః।
సంభవో భావనో భర్తా ప్రభువః ప్రభు రీశ్వరః।।
స్వయమ్భూః శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహస్వనః।
అనాది నిథనో ధాత విధాత  ధాతు రుత్తమః
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః।
విశ్వకర్మా మను స్త్వష్ఠా స్థవిరో దృవః। 
అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః।
ప్రభూత  స్త్రీక కుభ్ధామ పవిత్రం మంగళం పరమ్।
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ  శ్ర్శేష్ఠః ప్రజాపతిః।।
హిరణ్య గర్భో భూగర్భో మాథవో మధుసూధనః।
ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావీ విక్రమః క్రమః।
అనుత్తమో ధురాధర్షః కృతఙ్ఙః కృతి రాత్మవాన్।।
సురేశ  శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః।
అహ స్సంవత్శరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః।
అజ  సర్వేశ్వర  స్సిధ్ధ సిధ్ధిస్సర్వాధి రచ్యుతః।
వృషాకపి రమేయాత్మా స్సర్వయోగ వినిస్సృతః।।
వసు ర్వసుమనా స్సత్య స్సమాత్మా సమ్మిత స్సమః।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః।।
రుద్రో బహుశిరా బభ్రు రిశ్శయోని శ్శుచిశ్రవః।
అమృత శ్శాశ్వత స్థాణు ర్వరారోహో మహాతపః।।
సర్వగ సర్వ విధ్భను ర్విష్వక్సేనో జనార్ధనః।
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్కవిః।।
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో థర్మాథ్యక్షః కృతాకృతః।
చతురాత్మా చతుర్వూహ శ్చతుర్దంష్ఠ్ర   చతుర్భుజః
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదా దిజః।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః।।
ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘ శ్శుచి రూర్జితః।
అతీంద్రయో మహామాయో మహోత్సాహో మహాబలః।।
మహాబుధ్ధి  ర్మహావీర్యో  మహాశక్తి ర్మహాద్యుతిః।
అనిర్ధేశ్యపు శ్ర్శీమాన్ నమేయాత్మ మహాథ్రిధృత్।।
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః।
అనిరుద్ధ  సురానందో గోవిందో గోవిందాం పతిః ।।
మరీచి ర్ధమనో హంస స్సువర్ణో భుజగోత్తమః।
హిరణ్య నాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః।।
అమృత్యు  స్సర్వదృక్సింహ స్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః।
అజో దుర్మర్సన శ్శాస్థా విశ్రుతాత్మా సురారిహా।।
గురు ర్గురుత్తమో ధామ సత్య స్సత్య పరాక్రమః।
నిమిషో నిమిప స్ర్సగ్వీ  వాచస్పతి రుదారథీః।।
అగ్రనీ ర్గ్రామణీ శ్ర్శీమా న్న్యాయోనేతా సమీరణః
సహస్రమూరాధ  విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్।।
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః।
అహ  స్సంవర్తకో వహ్ని రనిలో ధరణీధరః।।
సుప్రసాదః ప్రసన్నాత్మావిశ్వసృడిశ్వభు గ్విభుః।
సత్కార్తా సత్కృత స్సాధు ర్జహ్ను నారాయనోనరః।।      
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ఠ కృ చ్ఛుచిః।
సిద్ధార్ధ స్సిధ్ధ సంకల్పః సిథ్ధిద స్సిథ్దిసాథనః।।
వృషాహీ వృషభో విష్ణు ర్వృషపర్వా వృషోధరః।
వర్దనో వర్దమానశ్చ వివిక్త శ్వృతిసాగరః।।                
సుభుజో దుర్ధరో వాగ్మీమహేంద్రో వసుధో వసుః।         
నైకరూపో బృహద్రూపః శిపివిష్ఠః ప్రకాశనః।।             
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మ ప్రతాపనః।
బుద్ధ స్పష్ఠాక్షరో మంత్ర శ్ఛంద్రాంశు ర్భాస్కరద్యుతిః।।      
అతుల శ్శరభో భీమ స్సమయఙ్ఞో హవిర్షరిః।
సర్వ లక్షణ లక్షణ్యో  లక్ష్మివాన్  సమితింజయః।।         
విక్షరో రోహితో మార్గో హేతు ర్ధామోదర స్సహః।
మహీదరో మహాభాగో వేగవా నమితాశనః।
ఉద్భవః  క్షోభణో ధేవః శ్రీగర్భః పరమేశ్వరః।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః।।
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ స్థుష్ఠః పుష్ఠ శుభేక్షణః।।
రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః।
వీరశ్శ మతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః।।
వైకుంఠః  పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః।
హిరణ్యగర్భో  శ్శతృఘ్నో వ్యాప్తోవాయు రదోక్షజః।।            
ఋతు సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః।
ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వ దక్షిణః
విస్తార స్థావరో స్థాణుః ప్రమాణం బీజ మవ్యయం।
అర్థోనర్థో మహాకోశో మహాభాగో మహాధనః।
అనిర్వణ్ణ స్థవిష్ణోభూ ర్థర్మ యూపో మహాజనః।
నక్షత్ర నేమి ర్నేమిత్రీ క్షమః క్షామ స్సమీహనః।।
యఙ్ఞ ఇజ్యోమహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాగతిః।
సర్వ దర్శీ విముక్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞాన ముత్తమమ్।।                
సువ్రత స్సుముఖ సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్।
మనోహరో జితక్రోధో వీరభాహు ర్విధారణః।।
స్వాపనో స్సవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో థనేశ్వరః।।                        
ధర్మగు బ్దర్మకృద్దర్మీ సదసత్ క్షరమక్షరమ్।
అవీఙ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః।।                        
గభస్తి నేమి స్సత్త్వస్థ స్సీంహో భూతమహేశ్వరః।
ఆది దేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః।।                            
ఉత్తరో గోపతి ర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః।
శరీర  భూత భృ ద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః।                        
సోమపోమృతప స్సోమః పురుజి త్పురుసత్తమః।
వినయో జయ స్సత్యసంథో దాశార్హ స్సాత్వతాంపతి।                  
జీవో  వినయతా సాక్షి ముకుందో మిత విక్రమః
అంభోనిధి రనంతాత్మ మహోదథి శయోంతకః।।                   
అజో మహార్ష స్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనందో నందనో నంద స్సత్యధర్మా తివిక్రమః।।                     
మహర్షిః కపిలాచార్యః కతఙ్ఞో మేదినీషతిః।
త్ర్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగః కృతాంత కృత్।।                    
మహా వరాహో గోవింన్ద స్సుషేణః కనకాంగదీ।
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చక్రగదాథరః।।                        
వేధాస్స్యాంగో జితః కృష్ణో దృఢ స్సఙ్కర్షణో చ్యుతః।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః।                    
భగవాన్ భగ హా నందీ  వనమాలీ హలాయుధః।
ఆదిత్యో జ్యోతిరాదిత్యో స్సహిష్ణు ర్గతి సత్తమః।।                     
సుధన్వా ఖణ్ణ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః।
దివిస్సృ క్సర్వదృ గ్వ్యాసో వాచస్సతి రయోనిజః।।                 
త్రిసామ సామగ స్సామః నిర్వాణం భేషజో (భేషజం) భిషక్।
సన్న్యాసకృ చ్చమ శ్శాన్తో నిష్ఠా శాంతిః పరాయణః।।                 
శుభాంగ    శ్శాంతిద స్స్రష్ఠా కుముదః కువలేశయః।
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో  వృషప్రియః।।                       
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్చివః।
శ్రీవత్సవక్షా శ్ర్శీవాస  శ్ర్సీపతిః  శ్రీమతాంవరః।                        
శ్రీద శ్రీశ శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః।
శ్రీధర శ్రీకరః శ్రేయ  శ్ర్శీమాన్ లోకత్రయాశ్రయః।                      
స్వక్ష స్స్వఙ్గ శ్శతానందో నంది ర్జోతి ర్గణేశ్వరః।
విజితాత్మ విధేయాత్మా సత్కీర్తి  శ్చిన్నసంశయః।।                  
ఉధీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః।
భూశయో భూషణో భూతి ర్విశోక  శ్శోక నాశనః                         
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మ విశోథనః।
అనిరుద్దో ప్రతిరధః ప్రద్యుమ్నో మితవిక్రమః।।                        
కాలనేమి నిహా వీరా శ్శౌరి శ్శూరజనేశ్వరః।
త్రీలోకాత్మ త్రిలోకేశః కేశవః కేశిహా హరిః।।                            
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః।
అనిర్దేశ్యవపు ర్విష్ణు ర్వీరో నంతో ధనుంజయః।।                    
బ్రహ్మణ్యో బ్రహ్మ కృ  ద్ర్భహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్దనః।
బ్రహ్మవి  ద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణ ప్రియః।।            
మహాక్రమో మహాకర్మా మహాతేజా  మహారగః।
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః।।                
స్తవ్య స్స్తవ్య ప్రియ స్తోత్రం స్తుత స్త్సోతా  రణప్రియః।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్య కీర్తి రనామయః।।                 
మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రియః।
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః।।                     
సద్గతి సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః।
శూరసేనో యదుశ్రేష్ట స్సన్నివాస స్సుయామనః।।                  
భూతవాసో వాసుదేవః సర్వాసునిలయో నలః।।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాప రాజితః।।                      
విశ్వమూర్తి ర్మహామూర్తి ర్ధీపమూర్తి రమూర్తిమాన్।
అనేక మూర్తి రవ్యక్త శ్శతమూర్తి  శ్శతాననః।।                       
ఏకోనైక స్సవః కః కిం యత్త త్పదమనుత్తమమ్।
లోకబంధు లోకనాథో మాథవో భక్త వత్సలః।।                       
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాఙ్గదీ।
వీరహా విషమ  శ్శూన్యో ఘృతాశీ రచల శ్చల।।                      
అమానీ మానదో మాన్యో లోకస్వామీ  త్రిలోకదృత్।
సుమేధో మేధజో థన్య స్సత్యమేథా ధరాధరః।।                      
తేజో వృషో ద్యుతిధర స్సర్వ శస్త్ర భృతాం వరః।
ప్రగ్రహో నిగ్రహో వగ్రో నైకశృంగో గదా గ్రజః।।                       
చతుర్మూర్తి  శ్చతుర్భాహు శ్చతూర్వూహ శ్చతుర్గతిః।
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద వి దేకపాత్।।                   
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతి క్రమః।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా।                      
శుభాంగో లోకసారంగ  స్సుతంతు స్తంతువర్థనః।
ఇంద్ర కర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః।।                     
ఉద్భవ స్సున్దర స్సుందో రత్ననాభ స్సులోచనః।।
అర్కో వాజసన శ్శృంగీ జయంత స్సర్వవిజ్జయీ।।                   
సువర్ణ బిందు రక్షోభ్య స్సర్వ వాగీశ్వరేశ్వరః।
మహాహ్రదో మహాగర్తో మమాభూతో మహానిథిః।।                     
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః।
అమృతాంశో మృతవపు స్సర్వఙ్ఞ స్సర్వతోముఖః।।                    
సులభ స్సువ్రత స్సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః।
న్యగ్రోధో ధుంబరో శ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః।।                      
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః।
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః                           
అణు ర్భృహత్కృవః స్తూలో గుణభృ న్నిర్గుణో మహాన్।
అధృతః స్వథృత స్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః।                       
బారభృ త్కథితోయోగీ యోగీశః సర్వకామదః।
ఆశ్రమః శ్రమణః క్షామః సువర్ణో వాయువాహనః।।                      
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః।
అపరాజిత స్సర్వ సహో నియంతా నియమో యమః
సత్త్వవాన్ సాత్త్విక స్సత్య స్సత్యధర్మ పరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః పియకృ త్ర్పీతి వర్ధనః।।                          
విహాయసగతి ర్జోతి స్సురుచి  ర్హుతభు గ్విభుః।।
రవి ర్విలోచన స్సూర్యః సవితా రవి లోచనః।।                            
అనంతో హుతభు గ్భోక్తా సుఖదో నైకదో గ్రజః।
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః।।                            
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః।
స్వస్తిద స్స్వస్తికృ త్స్వస్తి స్వస్తిభు క్స్వస్తిదక్షిణః।।                          
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమూర్జిత శాసనః।
శభ్ధాతిగ శ్శబ్ధసహ శ్శిశిర శ్శర్వరీకరః।।                                    
అక్రూరః పేశలో దక్షో ధక్షిణః క్షమిణాం వరః।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్ర్శవణ కీర్తనః।।                                
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః।
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్తితః।।                                 
అనంత రూపో నంతశ్రీర్జితమన్యుర్బయాపహః।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః।।                               
అనాది ర్బూర్బువో లక్ష్మి స్సువీరో రుచిరాంగదః
జననో జన జన్మాది ర్బీమో భీమ పరాక్రమః।।                             
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః।
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః।।                               
ప్రమాణం ప్రాణ నిలయః ప్రాణదృ త్ర్పాణజీవనః।
తత్త్వం తత్వవి దేకాత్మా జన్మ మృత్యు జరాగతిః।।                          
భూర్భువస్స్వస్తరు  స్తార స్సవితా ప్రపితా మహః
యఙ్ఞో  యఙ్ఞపతి ర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః।।                        
యజ్ఞభృ ద్యజ్ఙకృ ద్యజ్ఞీ యజ్ఞభు గ్యజ్ఞసాధనః।
యజ్ఞాంతకృ ద్యజ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవచ।।                         
ఆత్మయోని స్వయం జాతో వైఖాన స్సామగాయనః।
దేవకీ నందన స్స్రష్ఠా క్షితిశః పాపనాశనః।।
శఙ్ఖభృ న్నందకీ చక్రీ శార్ ఙ్గధన్వా గదాధరః।।
రథాంగ పాణి రక్షోభ్య  స్సర్వ ప్రహరణా యుధః।।
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి
వనమాలి గదీ శార్ ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ।
శ్రీమన్నారాయణో విష్ణు ర్వాసుదేవో భిరక్షితు।।

ఉత్తర పీఠికా:
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః।
నామ్నాం సహస్రం దివ్యానా మశేషేణ పరికీర్తితమ్।
య ఇదం శృణుయా న్నిత్యం యశ్చాపి పరి కీర్తియేత్।
నా శుభం ప్రాప్నుయాత్కించి త్సో ముత్రేహ చ మానవః
వేదాంతగో భ్రాహ్మణస్యాత్ క్షత్రియో విజయీభవేత్।
వైశ్యో ధన సమృద్దస్స్య చ్చూద్ర సుఖ మ వాప్నుయాత్।।
ధర్మార్ధీ ప్రాప్నుయా ధ్ధర్మ మర్ధార్ధీచార్ధ మాప్నుయాత్
కామానవాప్ను యాత్కామీ ప్రజార్ధీ చాప్నుయా త్ర్పజాః।
భక్తిమాన్ యస్య దోత్థాయ శుచి స్తద్గతమానసః।
సహస్రం వాసుదేవస్య నామ్నామేత త్ప్ర కీర్తయేత్।।
యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్య మేవ చ।।
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నో త్యనుత్తమమ్।।
న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి।
భవ త్య రోగో ద్యుతిమా న్బలరూప గుణాన్వితః।।
రోగార్తో ముచ్యతే రోగాద్భద్దో ముచ్యేత బందనాత్।
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః।।
దుర్గా ణ్య తితిర త్యాసు  పురుషః పురుషోత్తమమ్।
స్తువ న్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః।
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః।
సర్వపాప విశుద్దాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్।।
న వాసుదేవ భక్తాన మశుభం విద్యతే క్వచితే।
జవ్మ మృత్యు జరావ్యాధి భయం నాపుపజాయతే।।
ఇమం స్తవ మధీయాన శ్శ్రధ్ధాభక్తి సమన్వితః
యుజ్యే తాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః।।
న క్రోథో నచ మాత్సర్యం నలోభో నాశుభా మతిః।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే।।
ద్యౌ స్శచంద్రార్క  నక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః।।
ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం।
జగద్వశే వర్తతే దః కృష్ణస్య సచరాచరం।।
ఇంద్రియాణి మనోబుధ్ది సత్త్వం తేజో బలం ధృతిః।।
వాసుదేవాత్మ కాన్యాహుః  క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవ చ।।
సర్వాగమనా మాచారః ప్రథమం పరికల్పితః।
ఆచారః ప్రభవో ధర్మో  ధర్మస్య ప్రభురచ్యుతః।।
ఋషయః పితరో దేవాః మహాభుతాని ధాతవః।
జఙ్గ మా జఙ్గమం చేదం జగ న్నారాయణోదభవమ్।।
యోగో జ్ఙానం తధా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ।
వేదా శ్శాస్తాణి విజ్ఞాన మేతత్సర్వం జనార్ధనాత్।।
ఏకో విష్ణుర్మహద్బూతం పృథగ్భూతా న్యనేకశః।
త్రీన్లోకాన్వ్యాప్య భూతాత్మ భుజ్కై విశ్వభుగవ్యయః।।
ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్।
పఠేద్య ఇచ్చే త్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ।।
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభు మ వ్యయం।
భవంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్।।
న తే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి
అర్జన ఉవాచ:
పద్మ పత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ।
భక్తానా మను రక్తానాం త్రాతా భవ జనార్థన।।

శ్రీ భగవానువాచ:
యోమాం నామ సహస్రేణ స్తోతుమిచ్చవి పాండవ।
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః।।
స్తుత ఏవ న సంశయః ఓమ్ నమ ఇతి.

వ్యాస ఉవాచ:
వాసనా ద్వాసుదేవశ్య వాసితం తే జగత్త్రయమ్।
సర్వభూత నివాసోసి వాసుదేవ నమో స్తుతే।।
శ్రీవాసు దేవ నమోస్తుత ఓమ్నమ ఇతి

పార్వత్యువాచ:
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం।
పఠ్యతే పండితై ర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రబో।।

ఈశ్వర ఉవాచ:
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే।।
శ్రీరామ రామ నామ వరాననే ఓమ్ నమయిత

బ్రహ్మోవాచ:
నమో స్త్వనంతాయ సహస్రమూర్తయే.. సహస్ర పాదాక్షి శిరోరు బాహవే।
సహస్ర నామ్నేపురుషాయ శాశ్వతే.. సహస్ర కోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి

శ్రీ భగవా నువాచ:
అనన్యాశ్చింతయంతో మాం యే జానాః పర్యుపాసతే ।
తేషాం నిత్యా భి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం।
ధర్మ సంస్థాపనార్థయ సమ్భవామి యుగే యుగే ।।
ఆర్తా విషణ్ణా శిథ్ధిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః।
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా స్సుఖినో భవంతి ।।
కాయేన వాచ మనసేన్ధ్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ।।

యదక్షర పదభ్రష్ఠం మాత్రాహీనంతు య ద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ।।

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వణి మోక్ష ధర్మే భీష్మ యుధిష్ఠర సంవాదే శ్రీవిష్ణోర్ధివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం...

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...