Saturday 31 January 2015

కంజదళాయతాక్షి....

రచన: శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
రాగం: కమలమనోహరి
తాళం: ఆది

పల్లవి:
కంజదళాయతాక్షి కామాక్షి
కమలామనోహరి త్రిపురసుందరి ।।కంజ ।।

అనుపల్లవి:
కుంజరగమనే మణిమండిత మంజులచరణే
మామవశివ పంజరశుఖి పంకజముఖి
గురుగుహ రంజని నిరంజని దురితభంజని ।। కంజ ।।

చరణం:
రాకాశశివదనే సురదనే
రక్షితమదనే రత్నసదనే
శ్రీ కంచనవాసనే సురాసనే
శృంగారాశ్రయ మందహాసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందమృతఝరి భాస్వరి
ఏకాగ్రమనోలయకారి శ్రీకరి
ఏకామ్రేశగృహేశ్వరి శంకరి. ।। కంజ ।।

Monday 26 January 2015

నందబాలం భజరే....

రచన: భక్త రామదాసు ( కంచర్ల గోపన్న)
రాగం: మాయమాలవ గౌళ
తాళం: ఏక

పల్లవి:
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవా బృందలోలం ।। నందబాలం ।।

చరణాలు:
జలజ సంభవాది వినుత చరణారవిందం
లలితమోహన రాధావదన నళిన మిళిందం ।। 1 ।।

నిటల లలిత స్ఫటికుటిల నీలాలక బృందం కృష్ణం
ఘటిత శోభిత గోపికా ధర మకరందం ।। 2 ।।

గోదావరీ తీర రాజగోపికా రామ కృష్ణం
ఆదిత్యవంశాబ్ది సోమం భద్రాద్రి రామం ।। 3 ।।

Sunday 18 January 2015

క్షీరసాగర శయన....

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
తాళం: ఆది
రాగం: దేవగాంధారి

పల్లవి:
క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ  ।। క్షీర ।।

అనుపల్లవి:
వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది
విన్నానురా రామ  ।। క్షీర ।।

చరణము:
నారీమణికి జీర లిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది
విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారకనామ త్యాగరాజనుత దయతో నేలుకోర రామ  ।। క్షీర ।।

Saturday 17 January 2015

తులసీ దళములచే....

రచన: శ్రీ త్యాగరాజస్వామి
రాగం: మాయమాలవ గౌళ
తాళం: రూపక

పల్లవి:
తులసీ దళములచే సంతోషముగా
పూజింతు  ।। తులసీ ।।

అనుపల్లవి:
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను  ।। తులసీ ।।

చరణము:
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక
కరవీర మల్లికా సుగంధ రాజ సుమముల్
ధరనివియొక పర్యాయము ధర్మాత్ముని సాకేత
పుర వాసుని శ్రీ రాముని వర త్యాగరాజ నుతుని   ।। తులసీ ।।

Friday 16 January 2015

రఘువంశ సుధాంబుధి చంద్ర.....

రచన: పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్.
రాగం: కదనకుతూహలం
తాళం: ఆది.
కీర్తన: రఘువంశ సుధాంబుధి చంద్ర...

పల్లవి:
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ రామ
రామ రాజేశ్వర  ।। రఘువంశ।।

అనుపల్లవి:
ఆఘమేఘామృత శ్రీకర అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ అసురేశ మృగేంద్ర దారా జగన్నాథ   ।। రఘువంశ।।

చరణములు:
జమదగ్నిజ గర్వ ఖండన
జయ రుద్రాది విస్మిత భందన
కమలాప్తాన్వయ మండన
అగణిత అర్పుత శూర్య శ్రీ వెంకటేశ్వర ।। రఘువంశ ।।

భృగునందనా కవిభంజనా
బృందారకా బృందాహితా
నిగమాంతవ సుబుధావన
నీరజాక్ష శ్రీ వేంకటేశ్వరా  ।।రఘువంశ।।

Thursday 15 January 2015

మకర సంక్రమణం...

అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు... జై శ్రీ రామ...

Wednesday 14 January 2015

శ్రీ రంగనాథాష్టకం....

ఆనందరూపే నిజబోధరూపే బ్రహ్మస్వరూపే శ్రుతిమూర్తిరూపే ।
శశాంకరూపే రమణీయరూపే శ్రీరంగరూపే రమతాం మనోమే ।।1।।

కావేరితీరే కరుణా విలోలే మందారమూలే ధృత చారుకేలే ।
దైత్యాంతకాలేzఖిలలోకలీలే శ్రీరంగలీలే రమతాం మనోమే ।।2।।

లక్ష్మీనివాసే జగతాం నివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే ।
కృపానివాసే గుణవృందవాసే శ్రీరంగవాసే రమతాం మనోమే ।।3।।

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే ముకుందవంద్యే సురనాథవంద్యే ।
వ్యాసాదివంద్యే సనకాదివంద్యే శ్రీరంగవంద్యే రమతాం మనోమే ।।4।।

బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే ।
త్రైలోక్యరాజేzఖిలలోకరాజే శ్రీరంగరాజే రమతాం మనోమే ।।5।।

అమోఘముద్రే పరిపూర్ణనిద్రే శ్రీయోగనిద్రే ససముద్రనిద్రే ।
శ్రితైకభద్రే జగదేకనిద్రే శ్రీరంగభద్రే రమతాం మనోమే ।।6।।

సచిత్రశాయీ భుజగేంద్రశాయీ నందాంగశాయీ కమలాంగశాయీ।
క్షీరాబ్ధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగశాయీ రమతాం మనోమే ।।7।।

ఇదం హి రంగం త్యజతామిహాంగం పునర్నశాంగం యది శాంగమేతి ।
పాణౌ రథాంగం చరణేంబు కాంగం యానే విహంగం శయనే భుజంగమ్ ।।8।।

రంగనాథాష్టకం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
సర్వాన్కామానవాప్నోతి రంగిసాయుజ్యమాప్నుయాత్ ।।

భోగి శుభాకాంక్షలు...

అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు... జై శ్రీ రామ...

Sunday 11 January 2015

చల్లరే శ్రీ రామచంద్రునిపైన....

రాగం: ఆహిరి
తాళం : ఆది
రచన: శ్రీ త్యాగరాజస్వామి

పల్లవి:
చల్లరే శ్రీ రామచంద్రునిపైన పూల  ||చల్లరే||

చరణాలు:
సొంపైన మనసుతో ఇంపైన బంగారు
గంపలతో మంచి చంపకములను ||1||

పామరములు మాని నేమముతో
రామామనోహరునిపైన తామరపూల ||2||

ఈ జగతిని దేవ పూజార్హమౌ పూల
రాజిల్లుమేలైన జాజిసుమముల దెచ్చి ||3||

అమితపరాక్రమ ద్యుమణికులార్ణవ
విమలచంద్రునిపై హృత్కుముదసుమముల ||4||

ఎన్నరాని జనన మరణములు లేకుండ
మనసార త్యాగరాజనుతునిపై ||5||

Monday 5 January 2015

సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు...

(6-1-2015 నుండి 10-1-2015)
తిరువయ్యూరులో రేపటి నుండే ప్రారంభం...

శ్రీ త్యాగరాజ స్వామి నాదోపాసనలో ముక్తి పొంది భక్తుల కందరికి దారి చూపిన మాహా వాగ్గేయకారుడు. పురందరదాసు, కబీరు తులసీదాసు, రామదాసు వంటి వారు కూడా భక్తిలో నాద యోగస్ధితిని పొంది మోక్షం పొందిన వారే. త్యాగరాజు కారణజన్ముడు.

తంజావూరు రాజు శరభోజి ఆస్థానంలో ఉండే కాకర్ల రామబ్రహ్మానికి జన్మించాడు త్యాగరాజు. తల్లి పేరు సీతమ్మ. త్యాగరాజు తాతగారు వీణాకాళహస్తయ్య ఈయన ప్రసిద్ధి కెక్కిన సంగీత విద్వాంసుడు. సంస్కృత, తెలుగు భాషల్లో పాండిత్యం గడించిన త్యాగరాజు శొంఠి వెంకట రమణయ్యగారి వద్ద చేరి సంగీతం అభ్యసించారు. రామకృష్ణానంద స్వామి అనే సన్యాసి ‘నారదోపాస్తి’ మంత్రాన్ని త్యాగరాజుకు ఉపదేశించారు. నారదుడు యతి రూపంలో వచ్చి ‘స్వరార్ణవం’ అనే సంగీత గ్రంధాన్ని అనుగ్రహించారు. త్యాగరాజు తన కృతులలో అనేక విధాలుగా వారిని స్తుతి చేశారు.

త్యాగయ్యకు పద్దెనిమిదవయేటనే పార్వతమ్మతో వివాహము జరిగింది. తదనంతరం రెండేడ్లకు తండ్రి మరణించాడు. పార్వతమ్మ ఐదు సంవత్సరాల తరువాత మరణించగా, ఆమె చెల్లెలు కమలాంబతో తిరిగి వివాహము జరిగింది. తంజావూరు రాజు శరభోజి ఎన్నో కానుకలను ఇచ్చి వారి సంస్ధానానికి ఆహ్వానించారు. కాని త్యాగయ్య తిరస్కరించారు. అప్పుడు ‘‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా’’ అని కళ్యాణి రాగంలో ఆలాపించారు.

దీంతో విసిగిన అన్నయ్య జపేశం త్యాగయ్య పూజించే రామపంచాయతన విగ్రహాలను కావేరీలో పారవేయగా తెల్లవారుజామున ఆ సంగతి తెలిసి ‘‘ ఎందు దాగినావో ’’ అనే కృతికి ఆకృతి నిచ్చారని ప్రతీతి. దుఃఖంతో భార్య కమాలాంబ మరియు కూతురు సీతాలక్ష్మిని వదిలి అనేక తీర్థయాత్రలు చేసి అనేకానేక ప్రసిద్ధ కీర్తనలు రాసారు.ఆయన పరితాపము చూసి రాముడే కలలో కన్పించి తాను కావేరీలో ఉన్నానని తెలియజేశారట. త్యాగరాజు విగ్రహమూర్తిని తెచ్చుకుంటూ ‘‘రారా మాయింటి దాకా’’ అని అసావేరి రాగంలో పాడారట.

వాల్మీకి లాగానే 2,400 కృతులను ఈయన రచించగా నేడు లభ్యం అవుతున్నవి 600 లకు మించి ఉండవని విజ్ఞుల అభిప్రాయం.ఈయన 72 మేళకర్త రాగాలు మరియు ఎన్నో జన్యరాగాలలో కీర్తనలు రచించారు. అయితే అది కూడా వరుస క్రమంగా సులభ లభ్యం కావడంలేదు. వీరి రచనలలో అత్యున్నతమైన "ఘనరాగ పంచరత్న కృతులు" జగత్‌ ప్రసిద్ది కెక్కాయి. త్యాగయ్య ప్రహ్లాద భక్త విజయము, నౌకా చరిత్ర, సీతారామ విజయం అనే సంగీత నాటికలను కూడా రచించారు.

1767సంవత్సరం మే 4న పుట్టిన త్యాగరాజు దాదాపు 80 సంత్సరాలు జీవించి 1847వ సంవత్సరం జనవరి 6న అంటే పుష్య బహుళ పంచమినాడు ఆ రామునిలో ఐక్యం చెందారు. అప్పటి నుండి అశేష సంగీతప్రియులు ఆయన పుణ్యతిథినాడు 'త్యాగరాజ ఆరాధనోత్సవాల' పేరిట ప్రతి యేటా ఐదు రోజుల పాటు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నారు. ఆరాధనోత్సవాలు ఆయన పుణ్యతిథికి ఐదు రోజుల ముందు ప్రారంభమై సరిగ్గా పుణ్యతిథి నాడు ముగుస్తాయి. ఈ సంవత్సరం 6-1-2015 నుండి 10-10-2015 వరకు 168వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరగబోతున్నాయి.... జై శ్రీ రామ...

Sunday 4 January 2015

ఆకాశాత్పతితం తోయం....

శ్లోకం:
ఆకాశాత్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం ।
సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్ఛతి ।।

భావం:
ఎలాగైతే ఆకాశం నుండి వర్షరూపంలో జాలువారిన నీరు చివరికి సముద్రంలో కలుస్తుందో, అలాగే ఏ దేవుడికి నమస్కరించినా అది చివరికి ఆ కేశవునికే చెందుతుంది.....!!!

Saturday 3 January 2015

రామ రామ నీ వారము...

రాగం: ఆనందభైరవి.
తాళం: ఆది
రచన: శ్రీ త్యాగరాజు

పల్లవి:
రామ రామ నీవారము గామా రామ సీతా
రామ రామ సాధు జన ప్రేమ రారా  ।।  రామ ।।

చరణములు:
1 - మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ
కరగు బంగారు సొమ్ములు కదల రారా   ।। రామ ।।

2 - వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగు జేసుకొనునట్టి మహిమ రారా ।। రామ  ।।

3 - మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా ।। రామ ।।

4 - చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా  ।। రామ ।।

5 - కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా  ।। రామ ।।

6 - ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ
వేద్య నే నీవాడనైతి వేగ రారా  ।। రామ ।।

7 -  సుప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల రారా ।। రామ ।।

Friday 2 January 2015

శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి

గమనిక:
ప్రతి నామానికి ముందు 'ఓం'కారాన్ని కలిపి చదువ ప్రార్థన.

నామావళి:
రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమో నమః - 1
హిమాచలమహావంశపావనాయై నమో నమః - 2

శంకరార్ధాంగసౌందర్యలావణ్యాయ నమో నమః - 3
లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః - 4

మహాతిశయసౌందర్యలావణ్యాయై నమో నమః  - 5
శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః - 6

సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః  - 7
వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః  - 8

కస్తూరీతిలకోల్లాసనిటిలాయై నమో నమః - 9
భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమో నమః - 10

వికచాంభోరుహదళలోచనాయై నమో నమః - 11
శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమో నమః - 12

లసత్కాంచనతాటంకయుగళాయై నమో నమః - 13
మణిదర్పణసంకాశకపోలాయై నమో నమః - 14

తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః - 15
సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః - 16

కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమో నమః  - 17
స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః - 18

గిరీశబద్ధమాంగల్యమంగలాయై నమో నమః  - 19
పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః - 20

పద్మకైరవమందారసుమాలిన్యై నమో నమః - 21
సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః - 22

రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమో నమః - 23
కనకాంగదకేయూరభూషితాయై నమో నమః - 24

బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః  - 25
బృహన్నితంబవిలసజ్జఘనాయై నమో నమః - 26

సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమో నమః  - 27
దివ్యభూషణసందోహరంజితాయై నమో నమః - 28

పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః - 29
సుపద్మరాగసంకాశచరణాయై నమో నమః - 30

కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః  - 31
శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః - 32

సచామరరమావాణీవీజితాయై నమో నమః - 33
భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః - 34

భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః - 35
అనంగజనకాపాంగవీక్షణాయై నమో నమః - 36

బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమో నమః - 37
శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః - 38

లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమో నమః - 39
అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః - 40

ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమో నమః - 41
సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః - 42

దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః - 43
కలశోద్భవదుర్వాసఃపూజితాయై నమో నమః - 44

మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః - 45
చక్రరాజమహాయంత్రమధ్యవర్త్యై నమో నమః - 46

చిదగ్నికుండసంభూతసుదేహాయై నమో నమః - 47
శశాంకఖండసంయుక్తమకుటాయై నమో నమః - 48

మత్తహంసవధూమందగమనాయై నమో నమః - 49
వందారుజనసందోహవందితాయై నమో నమః - 50

అంతర్ముఖజనానందఫలదాయై నమో నమః - 51
పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమో నమః -52

అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః - 53
నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమో నమః - 54

సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమో నమః - 55
రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమో నమః - 56

హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః - 57
మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః - 58

జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః - 59
మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః - 60

దుష్టభీతిమహాభీతిభంజనాయై నమో నమః - 61
సమస్తదేవదనుజప్రేరికాయై నమో నమః - 62

సమస్తహృదయాంభోజనిలయాయై నమో నమః - 63
అనాహతమహాపద్మమందిరాయై నమో నమః - 64

సహస్రారసరోజాతవాసితాయై నమో నమః - 65
పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః - 66

వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః - 67
రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః - 68

లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః - 69
సహస్రరతిసౌందర్యశరీరాయై నమో నమః - 70

భావనామాత్రసంతుష్టహృదయాయై నమో నమః - 71
సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః - 72

శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః - 73
శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః - 74

దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః - 75
శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః - 76

చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమో నమః - 77
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమో నమః - 78

నామపారయణాభీష్టఫలదాయై నమో నమః - 79
సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమో నమః - 80

శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమో నమః - 81
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమో నమ - 82

భక్తహంసపరీముఖ్యవియోగాయై నమో నమః - 83
మాతృమండలసంయుక్తలలితాయై నమో నమః - 84

భండదైత్యమహాసత్త్వనాశనాయై నమో నమః - 85
క్రూరభండశిరచ్ఛేదనిపుణాయై నమో నమః - 86

ధాత్రచ్యుతసురాధీశసుఖదాయై నమో నమః - 87
చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః - 88

రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః - 89
మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః - 90

అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః - 91
మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః - 92

నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః - 93
వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః - 94

జన్మమృత్యుజరారోగభంజనాయై నమో నమః - 95
విధేయముక్తవిజ్ఞనసిద్ధిదాయై నమో నమః - 96

కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః - 97
రాజరాజార్చితపదసరోజాయై నమో నమః - 98

సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమో నమః - 99
శ్రీవీరభక్తవిజ్ఞానవిధానాయై నమో నమః - 100

అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః - 101
సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః - 102

హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమో నమః - 103
దక్షప్రజాపతిసుతవేషాఢ్యాయై నమో నమః - 104

సుమబాణేక్షుకోదండమండితాయై నమో నమః - 105
నిత్యయౌవనమాంగల్యమంగళాయై నమో నమః - 106

మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః - 107
చతుర్వింశతితత్త్వైక్యస్వరూపాయై నమో నమః - 108

Thursday 1 January 2015

జయ జయ రామ....

శ్లోకము:
భక్తి ర్ముక్తి విధాయినీ భగవతః
శ్రీరామచంద్రస్య హే
లోకాః కామ దుఘాంఘ్రిపద్మ
యుగళం సేవ ధ్వమత్యుత్సుకాః

భావం:
ఓ జనులారా! శ్రీరామ చంద్ర భగవానుని పట్ల కలిగే
భక్తయే ముక్తి ప్రదాయిని. అందువల్ల అత్యుత్సుకులై , శ్రద్ధాభక్తులతో సర్వాభీష్టాలను ఒసగే స్వామి పాద
యుగ్మాన్ని సేవించండి.....

(శ్రీ ఆధ్యాత్మ రామాయణం, అరణ్య కాండమ్)

అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.....

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...