Sunday 29 March 2015

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం....

కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీ భవ వేంకటశైలపతే - 1

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవత మౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే - 2

అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే - 3

అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధిక దానరతాత్
పరదేవతయా గదితా న్నిగమైః
కమలాదయితా న్న పరం కలయే - 4

కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్ స్మరకోటిసమాత్
ప్రతివల్లవికాభిమతా త్సుఖదాత్
వసుదేవసుతా న్న పరం కలయే - 5

అభిరామగుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే - 6

అవనీతనయా కమనీయకరం
రజనీకరచారు ముఖాంబురుహమ్
రజనీచరరాజ తమోమిహిరం
మహనీయమహం రఘురామమయే - 7

సుముఖం సుదృహం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరమ్
అపహాయ రఘూద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే - 8

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేకటేశ ప్రయచ్చ ప్రయచ్చ - 9

అహం దూరత స్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్చయా గత్య సేవాం కరోమి
సకృత్సేనయా నిత్యసేవాఫలం త్వం
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ - 10

అజ్ఞానినా మ్యా దోషా నశేషా న్విహితాన్ హరే ।
క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే ॥

       ॥  ఓం నమో వేంకటేశాయ ॥

Saturday 28 March 2015

సీతా కళ్యాణ వైభోగమే....

రచన: శ్రీ త్యాగరాజు..
రాగం: శంకరాభరణము
తాళం: ఖండలఘువు

పల్లవి:
సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే ॥ సీతా ॥

అనుపల్లవి:
పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర
రవిసోమ నవనేత్ర రమణీయ గాత్ర ॥ సీతా ॥

చరణములు:
భక్తజన పరిపాల భరిత శరజాల
భుక్తి ముక్తిద లీల భూదేవ పాల ॥ 1 ॥

పామరా సురభీమ పరిపూర్ణ కామ
శ్యామ జగదభిరామ సాకేతధామ ॥ 2 ॥

సర్వలోకాధార సమరైకధీర
గర్వమానసదూర కనకాగధీర ॥ 3 ॥

నిగమాగమ విహార నిరుపమ శరీర
నగధ విఘవిదార నత లోకాధార ॥ 4 ॥

పరమేశనుత గీత భవజలధి పోత
తరణికుల సంజాత త్యాగరాజనుత ॥ 5 ॥

Friday 27 March 2015

శ్రీ రామనవమి....

శ్రీ రామనవమి: (చైత్ర శుద్ధ నవమి ; 28-03-2015)

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఏడవది. ఇది పరమ సాత్విక అవతారం. మనిషనేవాడు భూమ్మీద ఎలా జీవించాలో ధర్మాచారణతో చాటి చెప్పిన ధర్మమూర్తి రామయ్య. అందుకే అన్నారు "రామో విగ్రహవాన్ ధర్మః" అని - ధర్మానికి ఒక విగ్రహ రూపం ఇస్తే అది శ్రీ రామచంద్రుడే అని...

చైత్రమాసం, పునర్వసు నక్షత్రం, నవమి రోజున శ్రీ రామచంద్రుడు జన్మించాడు. నవమి నాడే సీతమ్మతో వివాహము, నవమి నాడే రాజ్య పట్టాభిషేకము జరిగాయని  రామాయణం చేబుతున్నది. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అనగా చైత్ర మాసంలోని శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కూడిన రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు.

రాముడికన్నా గొప్పది రామనామం. శివకేశవ సంగమమే రామనామం... ఎందుకంటే దశరథ మహారాజుకు మొదట కలిగిన బిడ్డడికి వశిష్ఠుడు రామ అని నామకరణం చేశాడు. 'రామ' పదంలో పరమ పావన సప్తాక్షరి మంత్రమైన " నమో నారాయణాయ" లోని రెండవ అక్షరమైన  'రా'ని, పవిత్ర పంచాక్షరి మంత్రమైన "నమః శివాయ" లోని 'మ'ని, ఈ రెండక్షరాలని కలిపి రామ అని నామకరణం చేశాడు. శివకేశవుల అభేదమే రామనామ ఆంతర్యం.

ఒక రోజు పార్వతీదేవి పరమశివున్ని

"కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం ।
పఠ్యతే పండితైర్నిత్యం స్తోతు మిచ్ఛామ్యహం ప్రభో॥"

అని అడిగింది. దీనర్థం ఏమిటంటే విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, " ఉమా! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది రామనామాన్నే!" అని ఈ క్రింది శ్లోకం చేప్పాడు...

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ॥

ఈ శ్లోకం  స్మరిస్తే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం వస్తుందని చెప్పాడు. ఎలాగంటే ప్రసిద్ధ " కటపయాది " సంఖ్యల ప్రకారం రా=2 మరియు మ=5 అలా (రామ = 2×5 = 10; రామ =2×5 = 10; రామ = 2×5 =10; 10×10×10 =1000) విష్ణుసహస్రనామ ఫలితం లభిస్తుంది.

రామనవమి నాడు శ్రీరామునికి వడపప్పు, పప్పుబెల్లం నైవేద్యంగా పెట్టి పంచడం ఆనవాయితి. ఇందులో ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉందండోయ్... వచ్చేది ఎండాకాలం కాబట్టి వడపప్పు చలువ చేస్తుంది, ఎండల నుండి కాపాడుతుంది.. ఇక పానకం వల్ల ఋతుమార్ప వల్ల వచ్చే రోగాల నుండి శరీరాన్ని కాపాడి మనలో రోగనిరోధక శక్తి పెంచుతుంది...

మన తెలుగువారికీ రామయ్యకి అవినాభావ సంబంధమే ఉంది...పరమ రామభక్తులైన భక్తరామదాసు, త్యాగరాజు, తుము నరసింహదాసు వంటి వాగ్గేయకారులు ఎందరో రామున్ని సేవించి, ఆయన సాక్షాత్కారం పొంది ధన్యులైనారు. మన తెలుగు రాష్ట్రాల్లో 'దక్షిణ అయోధ్య'గా పేరు గాంచిన 'భద్రాచలం' లో మరియు ప్రసిద్ధ 'ఒంటిమిట్ట'లో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి.... ఒంటిమిట్టలో రాత్రి పండు వెన్నెలలో కళ్యాణం జరగడం విశేషం....

మరి అందరికీ ఆ రాముడి కృపా కటాక్షాలు కలగాలని కోరుతూ , అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... జై శ్రీ రామ...

Tuesday 24 March 2015

శ్రీమన్నారాయణ...

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య.
రాగం: బౌలి
తాళం: ఆది

పల్లవి:
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీపాద
శ్రీమన్నారాయణ మే శరణు ॥ శ్రీమన్నా॥

చరణములు:
కమలాసతీముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు ॥ 1 ॥

పరమయోగిజన భాగధేయ శ్రీ
పరమపురుష పరాత్పరా
పరమాత్మ పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరి దేవ శరణు ॥ 2 ॥

Friday 20 March 2015

మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

శ్రీ మన్మథ ఉగాది: (21- 03- 2015)

యుగాది శబ్దానికి ప్రతిరూపంగా "ఉగాది"గా వ్యవహారంలోకి వచ్చింది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది "ఉగాది"గా ఆచరించాలని నిర్ణయ సింధులో పేర్కొనడం జరిగింది. మన తెలుగు సంవత్సరాలు అరవై కాగా ఈ సారి వచ్చే సంవత్సరం 'మన్మథ'... ఈ సంవత్సరాలన్నీ కూడా నారద మహాముని సంతానంగా పేర్కొంటారు...

వేదాలను హరించిన సోమకాసురుని వధించి మత్స్యావతారంలో విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణంలో శ్రీ మహా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపబడుతోందని కూడా చెప్పబడుతూన్నది.

ఉగాది పచ్చడి:

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ ।
సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ॥

ఉగాదినాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాదిపచ్చడిని గ్రహించాలి. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ఇవే ఈ షడ్రుచులు. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, వేప పవ్వు , కారం, ఉప్పులను చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. ఈ షడ్రుచుల సమ్మేళనమే జీవితంలో కష్టసుఖాలు ఆనందవిషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారమే...

పంచాంగ శ్రవణం:
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము, రాహుకాల, దుర్ముహూర్త, వర్జ్యాలను, ఆదాయవ్యయాలు, రాజ పూజ్య, రాజ అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. రాబోయే కాలం ఎలా ఉండబోతోంది అని అందరూ సాయంత్రం వేళ ఓ చోట చేరి పంచాంగం వినడం మనం చూస్తూ ఉంటాం.

ఈ 'మన్మథ' ఉగాది అందరికీ సకల శుభాలను కలుగజేయాలని ఆ రాముణ్ణి ప్రార్థిస్తూ... అందరికీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు... జై శ్రీ రామ....

దశరథ రామ గోవింద....

రచన: శ్రీ భద్రాచల రామదాసు
రాగం: శంకరాభరణం (లేక) కాపీ
తాళం: ఆది

పల్లవి:
దశరథ రామ గోవింద నను
దయ జూడు పాహి ముకుంద ॥ దశరథ ॥

అనుపల్లవి:
దశ ముఖ సం హార దరణీజాపతి
రామ శశిధర పూజిత శంఖ చక్రధర ॥ దశరథ ॥

చరణములు:
మీ పాదములే గతి మాకు మమ్మేలుకో
స్వామి పరాకు మాపాల
గలిగిన శ్రీపతి ఈ ప్రొద్దు కాపాడి
రక్షించు కనకాంబరధర ॥ 1 ॥

నారాయణ వాసుదేవ నిను
నమ్మితి మహానుభావ గరుడ
గమన హరి గజ రాజ రక్షక పరమ
పురుష భక్త పాప సం హరణ ॥ 2 ॥

తారకనామ మంత్రము రామ
మాధవులకెల్ల స్వతంత్రము ఇరవుగ
కృపనేలుమిపుడు భద్రాద్రిని స్థిరముగ
నెలకొన్న సీతా మనోహర ॥ 3 ॥

Wednesday 18 March 2015

పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి...

రచన: శ్రీ వైద్యనాథ అయ్యర్
రాగం: జనరంజని
తాళం: ఆది

పల్లవి:
పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి ॥ పాహిమాం ॥

అనుపల్లవి:
ఏహి సుఖం దేహి సింహవాహిని
దయా ప్రవాహిని మోహిని ॥ పాహిమాం ॥

చరణం:
భండ చండ ముండ ఖండని మహిష
భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి
రిపు భీషణి వర భూషణ ॥ 1 ॥

తెలియలేరు రామ......

రచన: శ్రీ త్యాగరాజు
రాగం: ధేనుక
తాళం: దేశాది

పల్లవి 
తెలియలేరు రామ భక్తి మార్గమును ॥ తెలియ ॥

అనుపల్లవి 
ఇలనంతట దిరుగుచును
గలువరించెదరు గాని ॥ తెలియ ॥

చరణము 
వేగ లేచి నీట మునిగి భూతి బూసి
వేళ్ల నెంచి వెలికి శ్లాఘనీయులై
బాగుగపైక మార్జనలోలులై
రేగాని త్యాగరాజనుత ॥ 1 ॥

Tuesday 17 March 2015

ఇందరికీ అభయంబులిచ్చు...

రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య
రాగం: కాంభోజి
తాళం: ఆది

పల్లవి:
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ॥ ఇందరికీ ॥

చరణములు:
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కల్కియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ॥ 1 ॥

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి
మొరసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ॥ 2 ॥

పురసతుల మానముల పొల్లజేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరు వేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ॥ 3 ॥

Monday 16 March 2015

ప్రక్కల నిలబడి..

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
రాగం: ఖరహరప్రియ
తాళం: ఆది

పల్లవి:
ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగా దెల్పగ రాదా ॥ ప్రక్కల నిలబడి ॥

అనుపల్లవి:
చుక్కల రాయని గేరు మోము గల
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు  ॥ ప్రక్కల నిలబడి ॥

చరణం:
తనువుచే వందన మొనరించుచున్నారా
చనవున నామకీర్తన సేయుచున్నారా 
మనసున తలచి మై మఱచి యున్నారా
ననరుంచి త్యాగరాజునితో హరి హరి వీరిరు ॥ ప్రక్కల నిలబడి ॥

Friday 13 March 2015

కామాక్షి అనుదినము...

రచన: శ్యామశాస్త్రి
రాగం: భైరవి
తాళం: మిశ్ర చాపు

పల్లవి:
కామాక్షి అనుదినము మరవకనే నీ
పాదముల దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి॥

చరణములు:
కుందరదనా కువలయనయనా తల్లి రక్షించు
కంబుగళ నీరదచికురా విధువదనా మాయమ్మ॥ 1 ॥

కుంభకుచ మదమత్తగజగమ పద్మభవ హరి శంభు నుతపద
శంకరీ నీవు నా చింతల వేవేగ దీర్చమ్మా వినమ్మ॥ 2  ॥

భక్తజన కల్పలతికా కరుణాలయా సదయా గిరితనయ
కావవే శరణాగతుడుగద తామసము సేయక వరమొసగు॥ 3 ॥

పాతకములను దీర్చి నీ పద భక్తి సంతతమీయవే
పావనిగదా మొరవినదా పరాకేలనమ్మా వినమ్మ॥ 4 ॥

కలుషహారిణి సదా నతఫలదాయకి యని బిరుదు భువి
లో గలిగిన దొరయనుచు వేదము మొరలిడగ విని॥ 5  ॥

నీ పవన నిలయా సురసముదయా కరవిధృత కువలయా మద
దనుజ వారణమృగేంద్రార్చిత కలుషదమనఘనా అప
రిమితవైభవము గల నీ స్మరణ మదిలో దలచిన జనాదులకు
బహు సంపదలనిచ్చేవిపుడు మాకభయమియ్యవే॥ 6  ॥

శ్యామకృష్ణ సహోదరీ శివశంకరీ పరమేశ్వరి
హరిహరాదులకు నీ మహిమలు గణింప
తరమా సుతు డమ్మా అభిమానము లేదా నాపై
దేవీ పరాకేలనే బ్రోవవే ఇపుడు శ్రీ భైరవి॥ 7 ॥

Thursday 12 March 2015

జానకీ రమణ కళ్యాణ....

రచన: శ్రీ భక్త రామదాసు
రాగం: కాపి 
తాళం: త్రిపుట

పల్లవి:
జానకి రమణ కళ్యాణ సజ్జన
నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ ॥జానకి ॥

చరణములు:
ఓనమాలు రాయగానే నీ నామమే తోచు
నీ నామమే తోచు శ్రీరామా ॥ 1 ॥

ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు
అందమె గానవచ్చు శ్రీరామా ॥ 2 ॥

ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి
మునులెల్ల మోహించిరీ శ్రీరామా ॥ 3 ॥

దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో
దృష్టి తాకును ఏమో శ్రీరామా ॥ 4 ॥

ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవె
నిన్నే భజింప నీవే శ్రీరామా ॥ 5 ॥

ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రము చాలు
భక్తిమాత్రము చాలు శ్రీరామా ॥ 6 ॥

రాతి నాతిగజేసె నీ తిరువడిగళె కాదా
నీ తిరువడిగళె కాదా శ్రీరామా ॥ 7 ॥

నారదాది మునులు పరమపద మందిరిగద
పరమపద మందిరిగా శ్రీరామా ॥ 8 ॥

సత్య స్వరూపముగ ప్రత్యక్షమై నావు
ప్రత్యక్షమై నావు శ్రీరామా ॥ 9 ॥

భద్రాచల నివాస పాలిత రామదాస
పాలిత రామదాస శ్రీరామా ॥ 10 ॥

Monday 9 March 2015

హిమగిరి తనయే.....

రచన: శ్రీ హెచ్ ఎన్ ముత్తయ్య భాగవతార్
రాగం: శుద్ధ ధన్యాసి
తాళం: ఆది

పల్లవి:
హిమగిరి తనయే హేమలతే అంబా
ఈశ్వరి శ్రీ లలితే మామవ  ॥ హిమగిరి ॥

అనుపల్లవి:
రమా వాణి సంసేవిత సకలే
రాజరాజేశ్వరి రామ సహోదరి ॥ హిమగిరి ॥

చరణం:
పాశాఙ్కుశేక్షు దండకరే అంబా
పరాత్పరే నిజ భక్తపరే
ఆశాంబరహరికేశవిలాసే
ఆనంద రూపే అమిత ప్రతాపే ॥ హిమగిరి ॥

Sunday 8 March 2015

ఛత్రపతి శివాజీ రాజా....

మొగల్ చక్రవర్తులకు దక్కన్ సుల్తాన్లకు మధ్య ఏర్పడిన శక్తివంతమైన సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య స్థాపకుడిగా శివాజీని చెప్పుకోవచ్చు. శివాజీ తండ్రి షాహాజీ, ఇతడు సుల్తానుల దగ్గర సైన్యాధికారి. తల్లి జిజియాబాయి. ఈ దంపతులకు 1630, ఫిబ్రవరి 19న జున్నార్ సమీపంలోని శివనెరీ కోటలో శివాజీ జన్మించాడు.

జిజియాబాయి తాను పూజించే దేవత శివై (పార్వతి) పేరు శివాజీకి పెట్టింది.జిజియాబాయి కొడుకుకి చిన్ననాటి నుంచి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలను ఉగ్గుపట్టింది. తండ్రి పొందిన
పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహాలు పన్నాడు.

17 ఏళ్ల వయస్సులో శివాజీ మొట్టమొదటిగా యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. శివాజీ బీజాపూర్ సుల్తాన్ నుంచి పురంధర్. రాయఘడ్, సింహఘడ్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత శివాజీ 1664లో సూరత్ నగరాన్ని ముట్టడించాడు. కానీ 1665లో ఔరంగజేబు పంపిన జైసింగ్ పూనాపై దాడి చేసి పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. దీనితో శివాజీ పురంధర్ సంధి కుదుర్చుకున్నాడు. శివాజీ అధీనంలో ఉన్న 35 కోటల్లో 23 కోటలను మొఘలు వశం చేశాడు.

తర్వాత నాలుగు ఏళ్లకే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. క్రీ.శ1674లో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పాలన సుదీర్ఘ కాలం యుద్ధాలతో సాగినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు, పిల్లలు, స్ర్తీలకు సహాయం చేశాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడు. ఒకసారి సైనిక అధికారి చిన్న ముస్లిం రాజును ఓడించి ఆయన కోడల్ని శివాజీ ముందు బందీగా ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ‘‘నా తల్లి నీ
అంత అందమైనది అయితే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని’’ అని, ఆమెను తల్లిగా గౌరవించి కానుకలు పంపిం చాడు. అలాంటి మచ్చలేని వ్యక్తిత్వం శివాజీది.

మహారాష్ట్ర చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని పదిల పర్చుకున్న శివాజీ కర్ణాటక ముట్టడి తర్వాత ఏప్రిల్ 3,  1680లో మరణించాడు. తన సామ్రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా చూసిన ఆయన
అనేక దేవాలయాలతో పాటు మసీదులను కూడా నిర్మించాడు. మతసామరస్యానికి ప్రతీకగా శివాజీ పరిపాలనను ఉదాహరించవచ్చు. శివాజీ మరణం తరువాత ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాపాలన
బాధ్యతలు చేపట్టి తండ్రికి తగ్గ తనయుడిగా మొగల్లను ఎదుర్కొన్నారు. జనరంజకంగా పరిపాలన సాగించాడు.

కమలా వల్లభ గోవింద...

రచన: శ్రీ భద్రాచల రామదాసు
రాగం: కేదారం
తాళం: ఆది

కమలా వల్లభ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 1

కమనీయానన గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 2

కందర్ప జనక గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 3

కంజ విలోచన గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 4

కనకాంబరధర గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 5

కౌస్తుభ భూషణ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 6

కాళీయ మర్దన గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 7

యశోద బాలా గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 8

యదుకుల తిలక గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 9

నిత్యమహోత్సవ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 10

నిత్యానంద గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 11

వేణు విలోల గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 12

విజయ గోపాల గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 13

భక్త వత్సల గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 14

భాగవతప్రియ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 15

భరతానంద గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 16

రాజ గోపాల గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 17

రాధావల్లభ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 18

గోకులోత్సవ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 19

గోపికా రమణ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 20

నారదార్చిత గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 21

వేద సన్నుత గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 22

నంద తనయ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 23

నవనీతచోర గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 24

శ్రీధర కేశవ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 25

అచ్యుతమాధవ గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 26

గోవింద గోవింద గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 27

భద్రాద్రి వాస గోవింద - మాం
పాహి కళ్యాణ కృష్ణ గోవింద - 28

Saturday 7 March 2015

లంబోదర లకుమికర....

రచన: పురందర దాసు
రాగం: మలహరి
తాళం: రూపక

పల్లవి:
లంబోదర లకుమికర
అంబాసుత అమరవినుత  ॥ లంబోదర ॥

చరణాలు:
శ్రీ గణనాథ సిందూర వర్ణ
కరుణ సాగర కరివదన ॥ 1 ॥

సిద్థ చారణ గణ సేవిత
సిద్థి వినాయక తే నమో నమో ॥ 2 ॥

సకల విద్యాది పూజిత
సర్వోత్తమ తే నమో నమో ॥ 3 ॥

Friday 6 March 2015

హోళీ శుభాకాంక్షలు...

హోళీ: (06 - 03 - 2015, ఫాల్గుణ పౌర్ణిమ)

హోళీ అద్భుతమైన రంగుల పండుగ... విశ్వవ్యాప్యంగా హోళీ పండుగను ప్రతీ యేటా ఫాల్గుణ పౌర్ణమి రోజున వైభవంగా జరుపుకుంటారు. వసంతోత్సవము, దులాండి, ధూల్ జాత్రా మొదలైన పేర్లతో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారు...

పురాణ కథనం:
ఈ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. రాధాదేవి తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పూయమని కిట్టయ్యకు ఓ ఉపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు ఆ పరంధాముడు రాధను పట్టుకుని ఆమెమీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయింది.

కాముని దహనం హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. హిరణ్యాకశపుని సోదరి పేరు హోళిక. ఆమె మంటల్లో తన శరీరం కాలకుండా బ్రహ్మ వల్ల వరం సంపాదించింది. పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడిని ఎలాగైనా సంహరించాలన్న అన్న ఆజ్ఞ వలన ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయకుండా, హోళికను మాత్రం దహించి వేస్తాయి. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీ అనే పేరు వచ్చింది.

కాముని దహనానికి ఆ పేరు ఎలా వచ్చింది ?

ఓ సమయంలో ధ్యాన నిష్టలో ఉన్న శివునిపై మన్మథుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మథుడిపై ఆగ్రహించి, తన త్రినేత్రంతో కాముడిని అంటే మన్మథుడిని భస్మం చేస్తాడు. తర్వాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మథుడిని తిరిగి బ్రతికిస్తాడు. దానికి గుర్తుగానే హోళీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు. ఇక్కడ కామం అంటే కోరిక, వాంఛ అనే అర్థాలు కూడా చెప్పుకుంటారు.

ఎందుకు రంగులు చల్లుకోవాలి....?

వసంత కాలంలో వాతవరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయి. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం. సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ మరియు మోదుగలను ఉపయోగించి తయారు చేస్తారు. 

కానీ నేడు సంప్రదాయ రంగులకు బదులుగా రసాయనిక రంగులు చల్లుకోవడం పరిపాటిగా మారింది. దీనివలన అనేక రకాల చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకర రోగాలు వస్తున్నాయి. అందుకోసం ప్రతీ ఒక్కరూ ప్రమాదకర రంగులకు బదులు సంప్రదాయిక రంగులంను వాడి హోళీని మరింత ఆరోగ్యకరంగా జరుపుకునే ప్రయత్నం చేయాలి...

రంగు రంగుల హోళీ మన జీవితాలలో కూడా రంగులు నింపాలని కోరుతూ  అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు.....

Thursday 5 March 2015

బాలముకుందాష్టకమ్....

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ ।
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 1 ॥

సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ ।
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 2 ॥

ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ ।
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 3 ॥

లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ ।
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 4 ॥

శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ ।
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 5 ॥

కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ ।
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 6 ॥

ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ ।
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 7 ॥

ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ ।
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి ॥ 8 ॥

Wednesday 4 March 2015

చంద్రశేఖరాష్టకం....

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ।
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥

రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ ।
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥

పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ ।
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 2 ॥

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచనపుజితాంఘ్రిసరోరుహమ్ ।
దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 3 ॥

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతా పరిష్కృత చారువామకలేబరమ్ ।
క్ష్వేడనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 4 ॥

కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ ।
అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 5 ॥

భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భుక్తిముక్తఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 6 ॥

భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ ।
సోమవారుణ భూహుతాశనసోమపానిఖిలాకృతిం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 7 ॥

విశ్వసృష్టివిధాయినం పునరేవపాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినమ్ ।
క్రిడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 8 ॥

ఫలశ్రుతి:
మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ ।
పూర్ణమాయురరోగితామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥

Tuesday 3 March 2015

శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రం.....

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే ।
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 1 ॥

సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ।
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 2 ॥

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే ।
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 3 ॥

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే ।
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 4 ॥

అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే ।
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 5 ॥

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయికరే
త్రిభువన మస్తకశూలవిరోధి శిరోధికృతామల శూలకరే ।
దుమి దుమి తామర దుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 6 ॥

అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే ।
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 7 ॥

ధనురనుసంగరరక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే
కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హటావటుకే ।
కృత చతురంగబలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 8 ॥

సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే ।
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 9 ॥

జయ జయ జప్య జయేజ్ఞయశబ్దపరస్తుతితత్పర విశ్వనుతే
ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే ।
నటితనటార్ధనటీనటనాయకనాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 10 ॥

అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే ।
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 11 ॥

మహితమహాహవమల్లమతల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే ।
సృతకృతఫుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 12 ॥

అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే ।
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 13 ॥

కమలదళామలకోమలకాంతిబలాకలితాతులఫాలతలే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే ।
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 14 ॥

కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితమిలిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే ।
నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 15 ॥

కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖసాంద్రరుచే ।
జితకనకాచలమౌళిపదోఝితదుర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 16 ॥

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే ।
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 17 ॥

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కథం న భవేత్ ।
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ॥ 18 ॥

కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం ।
తవ చరణం శరణం కరవాణి నతామర వాణి నివాశి శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ॥ 19 ॥

తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే ।
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ॥ 20 ॥

అయి మయి దీన దయాళు తయా కృప యైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే ।
యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురుతాప మపా కురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ॥ 21 ॥

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...