Thursday 30 April 2015

శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం...

స్తోత్ర ప్రారంభః :

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్ ॥ 2 ॥

సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥

సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 4 ॥

సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 5 ॥

సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 6 ॥

సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 7 ॥

సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 8 ॥

సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 9 ॥

సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 10 ॥

సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 11 ॥

సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 12 ॥

సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 13 ॥

బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 14 ॥

అంధస్యమే హృతవెవేకమహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 15 ॥

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 16 ॥

ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 17 ॥

ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 18 ॥

ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 19 ॥

వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 20 ॥

మతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ: ॥ 21 ॥

ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ॥ 22 ॥

ఫలశ్రుతి:

శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా ॥ 1 ॥

యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ॥ 2 ॥

Thursday 23 April 2015

శంకర జయంతి శుభాకాంక్షలు....

ఆదిశంకర జయంతి: (వైశాఖ శుద్ధ పంచమి; 23-04-2015)

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ।
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం॥

భావం:
వేద వేదాంత పురాణజ్ఞానమునకు ఆలయమైన వాడు, కరుణామూర్తి, లోకమునకు శుభము చేకూర్చువాడు, భగవంతుని పాదముల యొక్క రూపమైనవాడు అగు శంకరులకు నమస్కరిస్తాను.

ఈ రోజు వైశాఖ శుక్ల పంచమి పర్వదినం. ఆది
శంకరుల పవిత్ర జన్మ దినం. సనాతన వేద ధర్మం దాదాపు డెభ్బై రెండు శాఖలుగా విడిపోయి, గందరగోళంలో మునిగి, విపరీత వాదనలు మరియు విపరీత చేష్టలతో కునారిల్లుతూ, మహత్తరమైన వేదజ్ఞానాన్ని మరిచి ఎవరికి తోచిన సిద్ధాంతాలు వారు అనుసరిస్తూ, ఇదే సరియైన మతం అని భావిస్తూ భారతదేశమంతా రకరకాలైన మతాలతో నిండి, సత్యం మరుగున పడి, వేదధర్మం కొడిగట్టిన సమయంలో, పదహారేళ్ళు శ్రమించి ఒక్క చేతితో ఆ పరిస్థితినంతా చక్కదిద్ది, భారతదేశాన్నంతా ఒక్కత్రాటిపైన నిలిపి, వేదానికి ఉపనిషత్తులకు అసలైన భాష్యం చెప్పి, తన జీవితాన్ని ధర్మ రక్షణకు ధారపోసి, ఘోర తమస్సులో నిద్రిస్తున్న భారతజాతికి వెలుగు బాటతో దిశానిర్దేశం చేసిన మహాపురుషుడు ఆది శంకరులు జన్మించిన మహత్తరమైన రోజు ఇది.

అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు....

Wednesday 22 April 2015

శ్రీ రామాష్టకం....

భజే విశేష సుందరం సమస్త పాప ఖండనం
స్వభక్తి చత్త రంజనం సదైవ రామ మద్వయమ్ ॥ 1  ॥

జటా కలాప శోభితం సమస్త పాప నాశకమ్
స్వభక్తి భీతి భంజనం భజేహ రామ మద్వయమ్ ॥ 2 ॥

నిజ స్వరూప బోధకం కృపాకరం భావాపహం
సమం శివం నిరంజనం భజేహ రామ మద్వయమ్ ॥ 3 ॥

సదా ప్రపంచ కల్పితం హ్యనామ రూప వాస్తవం
నరాకృతిం నిరామయం భజేహ రామ మద్వయమ్ ॥ 4 ॥

నిష్ప్రపంచ నిర్వి కల్ప నిర్మలం నిరామయం
చిదేక రూప సంతతం భజేహ రామ మద్వయమ్ ॥ 5 ॥

భవాబ్ది పోత రూపకం హ్యశే షదేహ కల్పితమ్
గుణాకరం కృపాకరం భజేహ రామ మద్వయమ్ ॥ 6 ॥

మహా సువాక్య బోధ కైర్వి రాజమాన వాకృదై:
పరంచ బ్రహ్మ వ్యాపకం భజేహ రామ మద్వయమ్॥ 7 ॥

శివ ప్రదం సుఖ ప్రదం భవచ్చిదం భ్రమాపహం
విరాజ మాన దైశికం భజేహ రామ మద్వయమ్ ॥ 8 ॥

ఫలశ్రుతి:
రామాష్టకం పరతి యస్సుకరం సుపుణ్యం
వ్యాసేన భాషిత మిదం శృణుతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్య మనంత కీర్తిం
సంప్రాప్య దేవి లయే లభతేచ మోక్షమ్

ఇతి శ్రీ వ్యాసేన విరచితం శ్రీ రామాష్టకం సంపూర్ణం....

రంగాపుర విహార....!!!!!

రచన: శ్రీ ముత్తుస్వామి దీక్షితార్
రాగం: బృందావన సారంగ
తాళం: రూపకం

పల్లవి:
రంగాపుర విహార జయ కోదండ
రామావతార రఘువీర శ్రీ ॥ రంగాపుర ॥

అనుపల్లవి:
అంగజ జనక దేవ బృందావన 
సారంగేంద్ర వరద రమాంతరంగా  
శ్యామలాంగ విహంగ తురంగ 
సదయాపాంగ సత్సంగ ॥ రంగాపుర ॥

చరణం:
పంకజాప్త కుల జల నిధి సోమ 
వర పంకజ ముఖ పట్టాభిరామ 
పద పంకజ జిత కామ రఘురామ 
వామాంక గత సీత వర వేష 
శేషాంక శయన భక్త సంతోష 
ఏణాంక రవి నయన మృదుతర భాష 
అకళంక దర్పణ కపోల విశేష ముని
సంకట హరణ గోవింద 
వేంకటరమణ  ముకుంద 
సంకర్షణ మూల కంద
శంకర గురు గుహానంద ॥ రంగాపుర ॥

Sunday 19 April 2015

బ్రహ్మ కడిగిన పాదము....!!!

రచన: శ్రీ అన్నమాచార్యులు
రాగం: ముఖారి
తాళం: ఆది

పల్లవి:
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము ॥ బ్రహ్మ ॥

చరణములు:
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలఁకక గగనము దన్నిన పాదము
బలరిపుఁ గాచిన పాదము ॥ 1 ॥

కామిని పాపము గడిగిన పాదము
పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపుఁ పాదము ॥ 2 ॥

పరమ యోగులకు బరిపరి విధముల
వరమొసఁగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము ॥ 3 ॥

అంతయు నీవే హరి.....!!!!

రచన: శ్రీ అన్నమాచార్యులు.
రాగం: పాడి
తాళం: ఆది

పల్లవి:
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామ ॥ అంతయు ॥

చరణములు:
కులమును నీవే గోవిందుడా నా
కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా
నెలవును నీవే నీరజనాభ ॥ 1 ॥

తనువును నీవే దామోదర నా
మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా నా
వెనకముందు నీవే విష్ణు దేవుడా ॥ 2 ॥

పుట్టుగు నీవే పురుషోత్తమ
కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి ఇంక నీవే నీవే ॥ 3 ॥

Saturday 18 April 2015

సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మా తండ్రి!!!

రచన: శ్రీ త్యాగరాజు.
రాగం: లలిత
తాళం: రూపకం

పల్లవి:
సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి ॥  సీతమ్మ ॥

అనుపల్లవి:
వాతాత్మజ సౌమిత్రి, వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు, ఓ మనస! ॥  సీతమ్మ ॥

చరణము:
పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రేసరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనస!  ॥ సీతమ్మ ॥

రామ నన్ను బ్రోవరా...!!!

రచన: శ్రీ త్యాగరాజు
రాగం: కాంభోజి
తాళం: రూపక

పల్లవి:
రామ నన్ను బ్రోవరా , వేమొకో ? లోకాభి ॥ రామ ॥

అనుపల్లవి:
చీమలో బ్రహ్మలో , శివ కేశవాదులలో,
ప్రేమమీర వెలుగుచుండు - బిరుదు వహించిన సీతా ॥ రామ ॥

చరణము:
మెప్పులకై కన్న తావు, నప్పు బడక విఱ్ఱవీగి
తప్పు పనులు లేక యుండు , త్యాగరాజ వినుత సీతా ॥ రామ ॥

Thursday 16 April 2015

శ్రీ రామచంద్ర కృపాలు భజమన్....

రచన: శ్రీ తులసీదాసు.
రాగం:
తాళం:
భాష: సంస్కృతం.

श्रीरामचन्द्र कृपालु भजु मन हरण भवभय दारुणम् ।
नवकञ्ज लोचन कञ्ज मुख कर कञ्ज पद कञ्जारुणम् ॥ 1 ॥

कंदर्प अगणित अमित छबि नव नील नीरज सुन्दरम् ।
पटपीत मानहुं तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम् ॥ 2 ॥

भजु दीन बन्धु दिनेश दानव दैत्यवंशनिकन्दनम् ।
रघुनन्द आनंदकंद कोशल चन्द दशरथ नन्दनम् ॥ 3 ॥

सिर मुकुट कुण्डल तिलक चारु उदार अङ्ग विभूषणम् ।
आजानुभुज सर चापधर सङ्ग्राम जित खरदूषणम् ॥ 4 ॥

इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनम् ।
मम हृदयकञ्ज निवास कुरु कामादिखलदलमञ्जनम् ॥ 5 ॥

తెలుగులో.....

శ్రీ రామచంద్ర  కృపాలు భజ మన హరణ భవభయ దారూణమ్‌ ।
నవకంజ లోచన కంజముఖ కరకంజ పద కంజారుణామ్ ॥ 1 ॥ 

కందర్ప అగణిత అమిత ఛబి నవనీత నీరద సున్దరమ్‌ ।
పటపీత మానహు తడిత రూచి శుచి నౌమి జనక సుతావరమ్ ॥ 2 ॥

శిర ముకుట కుండల తిలక చారూ ఉదార అంగ విభూషణమ్‌ ।
ఆజానుభుజ శర చాప ఘర సంగ్రామజిత స్వరదూషణమ్‌ ॥ 3 ॥

భజు దీన బన్ధు దినేశ దానవ దలన దుష్ట నికన్దనమ్‌ ।
రఘునంద ఆనంద కంద చంద దశరథ నందనమ్ ॥  4 ॥‌

ఇతి వదీత తులసీదాస శంకర శేష ముని మనరంజనమ్‌ ।
మమ హృదయకుంజ నివాస కురకామాది ఖలదల గంజనమ్‌ ॥ 5 ॥

Wednesday 8 April 2015

సంకటనాశన గణేశ స్తోత్రం....

శ్రీ నారద ఉవాచ ।

ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్టసిద్ధయే ॥

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ ॥

లంబోదరం పంచమం చ, షష్టం వికటమేవ చ ।
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ ॥

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరం ।
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధి కరం ప్రభో ॥

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనమ్ ।
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్ ॥

జపేత్ గణపతిస్తోత్రమ్, షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః ॥

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః ॥

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశ స్త్రోత్రం సంపూర్ణమ్.

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...