Friday 30 September 2016

బతుకమ్మ పండుగ.....

భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు
( 30 - 09 - 2016 నుండి 09-10-2016 వరకు )

బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం. భాద్రపద అమావాస్య లేదా పితృ( పేతర) అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ అష్టమి వరకు ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ ఇది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గూనుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. గూనుగు పూలను వివిధ రంగులలో ముంచి రకరకాలుగా వాడతారు. ముందు ఒక పెద్ద తాంబాళంలో పెద్దపెద్ద ఆకులను వేసి దాని చుట్టూ ఒక్కో పువ్వును పెట్టుకుంటూ మధ్యలో ఆకులు నింపుకంటూ బతుకమ్మను పెరుస్తారు. పైన ఒక పెద్ద గుమ్మడి పువ్వును పెట్టి దాని పైన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. ఇలా రోజూ తయారుచేస్తారు. బతుకమ్మను సాగనంపే ముందు ఆ గౌరమ్మను తమ మంగళసూత్రాలకు అద్దుకంటారు.

కాకతీయుల కన్నా పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు పాలించేవారు. వారిలో సత్యాశ్రయుడనే రాజు ముఖ్యుడు. వేములవాడ లోని రాజరాజేశ్వస్వామి తెలంగాణ ప్రజల కొంగు బంగారం మరియు ముఖ్య దైవం. వేములవాడలోనే భీమేశ్వరాలయం కూడా ఉండేది. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రాన్ని పరాంతక సుందర చోళుడు పాలించేవాడు. పరాంతక చోళుడు రాష్ట్రకుటుల బారి నుండి తన రాజ్యాన్ని రక్షించకోలేక సతమతమౌతుండేవాడు. కాని శైవుడైన పరాంతక చోళుడు రాజరాజేశ్వరుని భక్తుడై తన కొడుక్కి రాజరాజ చోళుడని నామకరణం చేశాడు.

ఆ తరువాత కొద్ది కాలానికి రాజరాజ చోళుడి కొడుకు రాజేంద్ర చోళుడు వేములవాడపై దండెత్తి సత్యాశ్రయుడిని ఓడించి, భీమేశ్వరాలయంలోని లింగాన్ని తన తండ్రికి కానుకగా తంజావూరుకు తీసుకెళ్ళి అక్కడే ఆ లింగానికి బృహదీశ్వరాలయం పేరున గుడి కట్టించాడు. ఇప్పుడు భీమేశ్వరాలయంలోని లింగానికి, బృహదీశ్వరాలయంలోని లింగానికి సారూప్యత మనం గమనించవచ్చు. ‌

ఆ తరువాత తెలంగాణ ప్రజలు తమ దగ్గరి నుండి వెళ్ళిపోయిన శివుడిని గురించి బాధపడుతూ, పార్వతీదేవిని ఓదారుస్తూ రంగురంగుల పూలతో త్రకోణాకారంగా బతుకమ్మను తయారు చేసి దానిపైన పుసుపుతో చేసిన గరీదేవిని ఉంచి సాయంత్రం వేళలో ఆరుబయట వీధిలోని ఆడపడుచులంతా కలిసి ఒకే దగ్గరకి చేరి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడేవారట. అదే కాలక్రమేణా ఒక పండుగగా రూపాంతరం చెందింది.

ఈ విషయం క్రింది పాటలో మనం గమనించవచ్చు.....

ఒక్కేసి పూవ్వేసి చందమామ
ఒక్క ఝాములయ్యే చందమామ.....
శివుడొచ్చే వేళాయే చందమామ
శివుడు రాకపాయే చందమామ......

ప్రతీ రోజు బతుకమ్మను ఒక్కోపేరుతో పిలస్తూ, ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

1వ రోజు - ఎంగిలి పూవు బతుకమ్మ - నువ్వులు, బియ్యపు పిండి.
2వ రోజు - అటుకుల బతుకమ్మ - చప్పిడి పప్పు, బెల్లం , అటుకులు.
3వ రోజు - ముద్ద పప్పు బతుకమ్మ - ముద్ద పప్పు, పాలు, బెల్లం.
4వ రోజు - నానబియ్యం బతుకమ్మ - నానబెట్టిన బియ్యం, పాలు,బెల్లం.
5వ రోజు - అట్ల బతుకమ్మ - అట్లు
6వ రోజు - అలిగిన బతుకమ్మ - నైవేద్యం ఉండదు.
7వ రోజు - వేపకాయల బతుకమ్మ - బియ్యపు పిండిని వేపకాయలలాగా చేసి నూనెలో వేయించి సమర్పిస్తారు.
8వ రోజు - వెన్నముద్దల బతుకమ్మ - నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం.
9వ రోజు - సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, కొబ్బరన్నం మరియు నువ్వుల అన్నం.

ఈ పండుగలో పరమార్థం ఏమిటంటే బతుకమ్మను తయారు చేయడంలో మనం రకరకాల పూలను వాడతాం, ఎన్ని పూలు వాడిన కానీ అవన్ని పైకి పోతూ చివరకు గౌరమ్మ దగ్గరే కలిసిపోతాయి. అలాగే మనం కూడా మెల్లమల్లగా ఈ ప్రాపంచిక విషయాలను అంటకుండా ఆ ఆదిశక్తినే చేరుకోవాలి.

ప్రతి పాటలోని చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు వాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శసి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైన పాటలు కూడా పాడతారు. అన్నిటికన్నా సద్దుల బతుకమ్మను చాలా వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మకు ముందు చిన్నపిల్ల చేత బొడ్డెమ్మ ఆడించడం ఆనవాయితి.

బతుకమ్మ పాటలు చాలా బాగుంటాయి....
ఉదాహరణకు కొన్ని....

రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో ॥2॥
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరాదు ఉయ్యాలో ॥2॥
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో ॥2॥

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్యాలో ॥2॥
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో
పెత్తారామాస ఉయ్యాలో ॥2॥
బాలలకు వచ్చింది ఉయ్యాలో
బతుకమ్మ పండుగ ఉయ్యాలో ॥2॥

- - - - - - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - -

తీరైన బతుకమ్మ ఉయ్యాలో
పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో ॥2॥
వారిద్దరు ఒత్తురా ఉయ్యాలో
వీరిద్దరు ఒత్తురా ఉయ్యాలో ॥2॥
సంవత్సరానికి ఉయ్యాలో
ఒక్కసారే తల్లే ఉయ్యాలో ॥2॥
తంగేడు పూలనే ఉయ్యాలో
రాశిగా తెచ్చిరి ఉయ్యాలో ॥2॥

పోయిరా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ ఏడాదికి ఉయ్యాలో ॥2॥
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో
మళ్లీ రావమ్మ ఉయ్యాలో ॥2॥

* * * * * * * * * * * * * * * * * *

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 

బంగారు బతుకమ్మ ఉయ్యాలో !

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 

బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!

* * * * * * * * * * * * * * * * * *

చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన

చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ

చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన

బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన

* * * * * * * * * * * * * * * * * * * * 

ఇలా ఇంకా చాలా పాటలున్నాయి.... ఇలా బతుకమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.  


అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.....

Monday 26 September 2016

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

భాగము - 1: సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు - 1

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః
వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ - 2

తవ సుప్రభాతమరవింద లోచనే
భవతు ప్రసన్నముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృశ శైలనాథ దయితే దయానిధే - 3

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 4

పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 5

ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాలికానామ్
ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 6

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః
పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని
భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 7

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదో‌పి
భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 8

భృంగావళీ చ మకరంద రసాను విద్ధ
ఝుంకారగీత నినదైః సహసేవనాయ
నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 9

యోషాగణేన వరదధ్ని విమథ్యమానే
ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 10

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ - 11

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 12

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరనేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 13

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 14

సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 15

ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 16

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 17

తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమా కలనయా‌‌కులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 18

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ -19

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే
దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 20

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 21

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 22

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశరామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 23

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం
దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణమ్
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్ - 24

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీవైష్ణవాః సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్ - 25

బ్రహ్మాదయా స్సురవరా స్సమహర్షయస్తే
సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 26

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో
సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ - 27

ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం
యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం
ప్రఙ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే  - 28

భాగము - 2: వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకుమతో
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే - 1

స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రము ఖాఖిలదైవత మౌళిమణే
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైల పతే - 2

అతి వేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధ శతైః
భరితం త్వరితం వృషశైవ పతే
పరయా కృపయా పరిపాహి హరే - 3

అధి వేంకటశైల ముదారమతే
ర్జన తాభిమ తాధిక దాన రతాత్‌
పర దేవతయా కథితా న్నిగమైః
కమలా దయితా న్న పరం కలయే - 4

కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతా త్స్మరకోటి సమాత్‌
ప్రతిపల్ల వికాభిమతా త్సుఖదాత్‌
వసుదేవసుతాన్న పరం కలయే - 5

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే - 6

అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారు ముఖాంబురుహమ్‌
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామ మయే - 7

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్‌
అసహాయ రఘూధ్వ మహన్య మహం
న కథంచన కంచన జాతు భజే - 8

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ - 9

అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ - 10

అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే - 11

ఈశానం జగతోస్య వేంకటపతే
ర్విష్ణోః పరాం ప్రేయసీ
తద్వక్షస్థ్సల నిత్యవాసర
సికాం తత్‌ క్షాంతి సంవర్థనీమ్‌ - 12

పద్మాలంకృత పాణిపల్లవ యుగాం
పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం
భగవతీం వందే జగన్మాతరమ్‌ - 13

భాగము - 3: ప్రపత్తి

శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌
స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 1

శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌
స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 2

ఆనూపు రార్చిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ
సౌమ్యౌ సదానుభవనే పి నవానుభావ్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 3

సద్యో వికాసి సముదిత్త్వర సాంద్రరాగ
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్‌
సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 4

రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర
వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 5

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 6

స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనేపి సపది క్లమ మాదధానౌ
కాంతావవాఙ్మనసగోచర సౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 7

లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీలాది దివ్య మహిషీ కరపల్లవానామ్‌
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 8

నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః
నీరాజనా విధి ముదార ముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 9

విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వఉత్స ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ
భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 10

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 11

మున్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్‌
చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 12

ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ
శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ
ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 13

ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 14

సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే - 15

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్‌ - 16

భాగము - 4: మంగళాశాసనం

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ - 1

లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌ - 2

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్ - 3

సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్‌ - 4

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ - 5

స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌ - 6

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్‌ - 7

అకాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్‌ - 8

ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ - 9

దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌ - 10

స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌ - 11

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌ - 12

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌ - 13

శ్రీమత్ సుందరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ - 14

మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్‌ - 15

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...