Sunday 2 April 2017

మత్స్యావతార కథ - 20


8-726-క.
ఇంగలముతోడి సంగతి
బంగారము వన్నె గలుగు భంగిని ద్వత్సే
వాంగీకృతుల యఘంబులు
భంగంబులఁ బొందు ముక్తి ప్రాపించు హరీ!



8-727-క.
హృదయేశ! నీ ప్రసన్నత
పదివేలవపాలి లేశభాగము కతనం
ద్రిదశేంద్రత్వము గలదఁట;
తుది నిను మెప్పింప నేది దొరకదు శ్రీశా!

భావము:
హరీ! విష్ణుమూర్తీ! బంగారం అగ్నితో చేరడం వలన మేలైన మెరుగు పొందుతుంది. ఆ విధంగానే నిన్ను పూజించే భక్తుల పాపాలు నాశనమై మోక్షం లభిస్తుంది. పరమాత్మా! హరీ! నీవు హృదయకుహరంలో ఉండే ఈశ్వరుడవు. నీ అనుగ్రహంలో పదివేలవంతులో ఒక లేశ భాగం వలన దేవేంద్రపదవి కలుగుతుందట. ఇక నీన్ను మెప్పిస్తే, లభించని భాగ్యం ఏముంటుంది?

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=727

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...