Wednesday 5 April 2017

దశరథ రామ గోవింద.......

రచన: శ్రీ భద్రాచల రామదాసు
రాగం: శంకరాభరణం (లేక) కాపీ
తాళం: ఆది

పల్లవి:
దశరథ రామ గోవింద నను
దయ జూడు పాహి ముకుంద ॥ దశరథ ॥

అనుపల్లవి:
దశ ముఖ సం హార దరణీజాపతి
రామ శశిధర పూజిత శంఖ చక్రధర ॥ దశరథ ॥

చరణములు:
మీ పాదములే గతి మాకు మమ్మేలుకో  స్వామి పరాకు మాపాల
గలిగిన శ్రీపతి ఈ ప్రొద్దు కాపాడి  రక్షించు కనకాంబరధర ॥ 1 ॥

నారాయణ వాసుదేవ నిను  నమ్మితి మహానుభావ గరుడ
గమన హరి గజ రాజ రక్షక పరమ  పురుష భక్త పాప సం హరణ ॥ 2 ॥

తారకనామ మంత్రము రామ  మాధవులకెల్ల స్వతంత్రము ఇరవుగ
కృపనేలుమిపుడు భద్రాద్రిని స్థిరముగ  నెలకొన్న సీతా మనోహర ॥ 3 ॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...