Saturday 20 May 2017

దక్ష యాగము - 38:


4-98-వ.
ఇట్లు ధరియించి గతకల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితం బయిన వహ్నిచేఁ దత్క్షణంబ దగ్ధ యయ్యె; అంత.
4-99-క.
అది గనుఁగొని "హాహా"ధ్వని
వొదలఁగ నిట్లనిరి మానవులుఁ ద్రిదశులు "నీ
మదిరాక్షి యకట దేహము
వదలెఁ గదా! దక్షుతోడి వైరము కతనన్."

టీకా:
ఇట్లు = ఈవిధముగ; ధరియించి = ధరించి; గత = పోయిన; కల్మషంబు = మలములు; ఐన = అయినట్టి; దేహంబున్ = శరీరము; కల = కలిగిన; సతీదేవి = సతీదేవి; నిజ = తన; యోగ = యోగముయొక్క; సమాధిన్ = సమాధిలో; జనితంబున్ = పుట్టినది; అయిన = అయిన; వహ్ని = అగ్ని; చేన్ = చేత; తత్ = ఆ; క్షణంబె = క్షణములోనే; దగ్ద = కాలిపోయినది; అయ్యెన్ = అయ్యెను; అంత = అంతట. అది = దానిని; కనుగొని = చూసి; హాహా = హాహాయనెడి; ద్వని = శబ్దములను; ఒదలగన్ = వదుల్తూ; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; మానవులున్ = మానవులును; త్రిదశులున్ = దేవతలును; ఈ = ఈ; మదిరాక్షి = సతీదేవి {మదిరాక్షి - మదము కప్పిన అక్షి (కన్నులు కలది), స్త్రీ}; అకట = అయ్యో; దేహమున్ = శరీరమును; వదలెన్ = విడిచినది; కదా = కదా; దక్షున్ = దక్షుని; తోడి = తోటి; వైరము = శతృత్వము; కతనన్ = వలన.

భావము:
ఈ విధంగా దోషాలను పోగొట్టుకొన్న దేహం కలిగిన ఆ సతీదేవి తన యోగసమాధి నుండి పుట్టిన అగ్నిచేత వెంటనే కాలిపోయింది. అప్పుడు... అది చూచి అక్కడి మానవులు, దేవతలు హాహాకారాలు చేస్తూ “అయ్యో! ఈ సతీదేవి దక్షునిమీది కోపంతో తన శరీరాన్ని విడిచిపెట్టింది కదా!” అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=99

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...