Friday 4 August 2017

శ్రీ కృష్ణ జననం - 10

10.1-45-వ.
అందు.
10.1-46-ఆ.
సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతుని
పుట్టుఁ దడవు కంసభూవరునకుఁ
దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ
డాసపడక సత్యమందు నిలిచి.
10.1-47-క.
పలికిన పలుకులు దిరుగక
సొలయక వంచనము లేక సుతుల రిపునకున్
గలఁగక యిచ్చిన ధీరుం
డిల వసుదేవుండు దక్క నితరుఁడు కలడే?

భావము:
అలా ఉండగా... దేవకీదేవి మొదటి కాన్పులో ప్రసవించిన కొడుకు కీర్తిమంతుడు. ఆమె కన్న ఆ మొదటి కుమారుడిని పుట్టిన వెంటనే వసుదేవుడు దైర్యంగా తీసుకువచ్చి అన్నమాట ప్రకారం కంసుడికి ఇచ్చేసాడు. ఇచ్చినమాట తప్పకుండా తాత్సారం చేయకుండా బెంగ పడకుండా కన్నకొడుకును శత్రువునకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప భూమిమీద ఇంకెవరున్నారు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=47

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...