Monday 14 August 2017

శ్రీ కృష్ణ జన్మాష్టమి

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం|
దేవకీ పరమానందం కృష్ణంవందే జగద్గురుమ్||

శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రీ కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి  సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ
కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది.

శ్రీ కృష్ణుడు ఒక గురువు ,నేత , వ్యూహకర్త
రాజకీయవేత్త , మహర్షి , విశ్వసారధి ,
యోగేశ్వరేశ్వరుడు ,మహానుభావుడు.... అయినా ఆయన గురించి ఏం చెప్పగలం. ఆ గీతాచార్యుని గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆయన జగదోద్ధారకుడు, లోకరక్షకుడు, కరుణామూర్తి.

మధుర, ద్వారక, బృందావనం, ఉడిపి, పూరీ, గురువాయూరు, తదితర క్షేత్రాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇస్కాన్ ఆలయాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ యదుకుల భూషణుడు అర్థరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్నికృష్ణుడి విగ్రహానికి మంగళస్నానం చేయించి పట్టుదట్టీ కట్టి, సందేట తాయత్తులూ, సరిమువ్వగజ్జెలూ బంగారు మొలతాడుతో ముద్దుకృష్ణుడిగా
అలంకరిస్తారు. అనంతరం ఊయలసేవ,
పవళింపు పూజలు అయిన తరువాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు.

అందుకే మరొక్కసారి చెప్పుకుందాం "కృష్ణం వందే జగద్గురుం". అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.....

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...