Monday 30 October 2017

పోతన రామాయణం -  24

9-304-క.
దశరథసూనుండేసిన
విశిఖము హృదయంబుఁదూఱ వివశుం డగుచున్
దశకంధరుండు గూలెను
దశవదనంబులను రక్తధారలు దొరఁగన్.
9-305-వ.
అంతనా రావణుండు దెగుట విని.

భావము:
శ్రీరాముడు వేసిన బాణం హృదయయాన్ని దూసుకుపోగా రావణుడు పది నోళ్లనుండి రక్తం కారుతుండగా నేలకూలాడు. అంతట ఆ రావణుడు మరణించడం విని....

http://telugubhagavatam.org/?tebha&Skanda=9&Ghatta=22&padyam=304

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...