Tuesday 28 February 2017

త్రిపురాసుర సంహారం - 4:

7-392-వ.
ఇట్లు రక్కసులు దన వెనుకఁ జొచ్చిన మాయానిలయుండును దుర్ణయుండును నైన మయుండు దన విద్యాబలంబున నయోరజత సువర్ణమయంబులై యెవ్వరికిని లక్షింపరాని గమనాగమనంబులును వితర్కింపరాని కర్కశపరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి యిచ్చిన, నక్తంచరు లందఱు నందుంబ్రవేశించి కామసంచారులై పూర్వవైరంబుఁ దలంచి సనాయకంబు లయిన లోకంబుల నస్తోకంబయిన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; రక్కసులు = రాక్షసులు; తన = తన యొక్క; వెనుకన్ = ఆశ్రయమునకు; చొచ్చిన = చేరగా; మాయా = మాయలకు; నిలయుండును = నివాసమైనవాడు; దుర్ణయుండునున్ = చెడ్డనీతిగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; తన = తనయొక్క; విద్యా = యోగవిద్య యొక్క; బలంబునన్ = శక్తిచేత; అయస్ = ఇనుము; రజత = వెండి; సువర్ణ = బంగారములచే; మయంబులు = చేయబడినవి; ఐ = అయ్యి; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి యైనను; లక్షింప = ఛేదింప; రాని = శక్యముకాని; గమనాగమనంబులు = రాకపోకలుగలది; వితర్కింప = ఊహించుటకు; రాని = శక్యముకాని; కర్కశ = కఠినములైన; పరిచ్ఛదంబులును = రక్షా కవచములు,పరిజనము; కలిగిన = ఉన్నట్టి; త్రి = మూడు (3); పురంబులన్ = పురములను; నిర్మించి = తయారుచేసి; ఇచ్చినన్ = ఇవ్వగా; నక్తంచరులు = రాక్షసులు {నక్తంచరులు - నక్తన్ (రాత్రులందు) చరులు (తిరుగువారు), రాక్షసులు}; అందఱున్ = అందరు; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; కామసంచారులు = యధేచ్ఛగా తిరుగువారు; ఐ = అయ్యి; పూర్వ = వెనుకటి; వైరంబు = శత్రుత్వము; తలంచి = తలచుకొని; సనాయకంబులు = లోకపాలురతోకూడినవి; అయిన = ఐన; లోకంబులన్ = లోకములను; అస్తోకంబు = అధికము; అయిన = ఐన; నిజ = తమ; బల = బలము యొక్క; అతిరేకంబునన్ = అతిశయముచేత; శోకంబున్ = దుఃఖము; ఒందించినన్ = చెందించగా.

భావము:
అలా రాకాసి మూకలు తన చెంతచేరి, నీవే దిక్కు అనే సరికి ఆ మాయలమారీ, దుర్మార్గుడూ అయిన మయుడు తన యోగబలంతో ఇనుము, వెండి, బంగారాలతో మూడు పురాలను సిద్దం చేశాడు. అవి రాకపోకలు తెలియరా నటువంటివీ; రహస్య మార్గాలూ, రక్షణగృహాలూ కలిగినట్టివి. తనను శరణువేడిన రాత్రించరులైన రక్కసులకు ఆ త్రిపురాలను ఇచ్చాడు. వారందరూ ఆ త్రిపురాలలో ప్రవేశించి యథేచ్ఛగా తిరుగసాగారు. తమ వెనుకటి శత్రుత్వం గుర్తుంచుకుని భయంకరమైన తమ పరాక్రమంతో లోకాలను, లోకనాయకులను దుఃఖాలపాలు చేయసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=392

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 27 February 2017

త్రిపురాసుర సంహారం - 3:

7-391-క.
చక్రాయుధ బలయుతు లగు
శక్రాదుల కోహటించి శ్రమమున నసురుల్
సక్రోధంబున నరిగిర
విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా!

టీకా:
చక్రాయుధ = విష్ణుమూర్తి యొక్క; బల = ప్రాపు, అండ; యుతులు = కలిగినవారు; అగు = అయిన; శక్ర = ఇంద్రుడు {శక్రుడు - దుష్టులను శిక్షించుట యందు శక్తిగలవాడు, ఇంద్రుడు}; ఆదులకున్ = మొదలగువారికి; ఓహటించి = ఓడి; శ్రమమునన్ = కష్టములో; అసురుల్ = రాక్షసులు; సక్రోధంబునన్ = కోపముతోటి; అరిగిరి = వెళ్ళిరి; విక్రమములు = ఎదుర్కొనుటలు; మాని = వదలి; మయుని = మయుని; వెనుక = చాటున, ప్రాపున; కున్ = కు; అధిప = రాజా.

భావము:
ఒకసారి చక్రము ఆయుధముగా కలిగిన శ్రీమహావిష్ణువు అండతో విజృంభిస్తున్న ఇంద్రుడు మొదలైనవారి ఉద్ధృతికి తట్టుకోలేక దానవులు ఓడి భయపడిపోయారు. దానవులకు కోపం వలన మనస్సులు మండిపోయాయి, కానీ దేవతలను ఎదుర్కోలేకపోయారు. వెళ్ళి మయాసురుని వెనుక చేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=391

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 25 February 2017

త్రిపురాసుర సంహారం - 2:

7-389-క.
ఏ కర్మంబున విభుఁడగు 
శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియెన్
వైకుంఠుఁ డెవ్విధంబునఁ
గైకొని తత్కీర్తి చక్కఁగా నొనరించెన్.
7-390-వ.
అనిన నారదుం డిట్లనియె.

టీకా:
ఏ = ఎట్టి; కర్మంబునన్ = కార్యమువలన; విభుడు = ప్రభువు; అగు = అయిన; శ్రీకంఠుని = పరమశివుని {శ్రీకంఠుడు - (క్షీరసాగరమధనమున పుట్టిన హాలాహలమును మింగుటవలన) శోభ కంఠమునగలవాడు, శివుడు}; యశము = కీర్తి; మయుని = మయుడి వలన; సుడివడియెన్ = చలించినది; వైకుంఠుడు = హరి {వైకుంఠుడు - ఒక యవతారమున వికుంఠ యనెడి యామె పుత్రుడు, కుంఠత్వము (మొక్కపోవుట, మౌఢ్యము) లేనివాడు, విష్ణువు}; ఏ = ఏ; విధంబునన్ = విదముగ; కైకొని = చేపట్టి; తత్ = అతని; కీర్తిన్ = యశస్సును; చక్క = ఒప్ప; కాన్ = అగునట్లు; ఒనరించెన్ = చేసెను. అనినన్ = అనగా; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
మయుడి ఏ పని వలన నీలకంఠుడైన శంకరుని యశస్సుకు కళంకం ఎలా కలిగింది. వైకుంఠవాసుడు శ్రీహరి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు. అలా ధర్మరాజు అడుగగా, నారదుడు ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=389




: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

త్రిపురాసుర సంహారం - 1:


7-387-క.
బహుమాయుఁడైన మయుచే
విహతం బగు హరుని యశము విఖ్యాత జయా
వహముగ నీ భగవంతుఁడు
మహితాత్ముఁడు మున్నొనర్చె మనుజవరేణ్యా!
7-388-వ.
అనిన ధర్మనందనుం డిట్లనియె.

టీకా:
బహు = పలు; మాయుడు = మాయలు గలవాడు; ఐన = అయిన; మయు = మయుని; చేన్ = చేత; విహతంబు = భంగపరచబడిన; హరుని = పరమశివుని {హరుడు - ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు}; యశము = కీర్తిని; విఖ్యాత = ప్రసిద్దమైన; జయ = గెలుపు; ఆవహము = నెలవైనది; కన్ = అగునట్లు; ఈ = ఈ; భగవంతుడు = హరి; మహితాత్ముడు = హరి {మహితాత్ముడు - మహిత (మహిమ గల) ఆత్ముడు (స్వరూపము గలవాడు), విష్ణువు}; మున్ను = పూర్వము; ఒనర్చెన్ = చేసెను; మనుజవరేణ్యా = రాజా. అనినన్ = అనగా; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మ నందనుడు - యమధర్మరాజు యొక్క కొడుకు, ధర్మరాజు}; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.

భావము:
“నరోత్తమా! ధర్మరాజా! ఒకసారి మాయలమారి అయిన మయుని వలన మహిమాన్వితమైన శివుని యశస్సుకి మచ్చ కలిగింది. అప్పుడు భగవంతుడు శ్రీమహా విష్ణువు శంకరునికి జయం కలిగించి, ఆయన కీర్తికి వన్నెతెచ్చాడు.” అని నారదుడు చెప్పాడు. అలా నారదుడు చెప్పగా విని ధర్మరాజు ఇలా అడిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=387

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 24 February 2017

వామన వైభవం - 126:



8-681-వ.
ఇ వ్విధంబున వామనుం డయి హరి బలి నడిగి, మహిం బరిగ్రహించి, తనకు నగ్రజుండగు నమరేంద్రునకుం ద్రిదివంబు సదయుం డయి యొసంగె; న త్తరి దక్ష భృగు ప్రముఖ ప్రజాపతులును, భవుండును, గుమారుండును, దేవర్షి, పితృగణంబులును, రాజులును, దానును గూడికొని చతురాననుండు గశ్యపునకు నదితికి సంతోషంబుగా లోకంబులకు లోకపాలురకు "వామనుండు వల్లభుం" డని నియమించి యంత ధర్మంబునకు యశంబునకు లక్ష్మికి శుభంబులకు దేవత లకు వేదంబులకు వ్రతంబులకు స్వర్గాపవర్గంబులకు "నుపేంద్రుండు ప్రధానుం" డని సంకల్పించె నా సమయంబున.
8-682-క.
కమలజుఁడు లోకపాలురు
నమరేంద్రునిఁగూడి దేవయానంబున న
య్యమరావతికిని వామను
నమరం గొనిపోయి రంత నట మీఁద నృపా!

టీకా:
ఈ = ఈ; విధంబునన్ = విధముగ; వామనుండు = పొట్టివాడుగ; అయి = అవతరించి; హరి = విష్ణువు; బలిన్ = బలిని; అడిగి = కోరి; మహిన్ = భూమిని; పరిగ్రహించి = తీసుకొని; తన = తన; కున్ = కు; అగ్రజుడు = అన్న {అగ్రజుడు - అగ్ర (ముందుగా) జుడు (పుట్టినవాడు), అన్న}; అగు = అయిన; అమరేంద్రున్ = దేవేంద్రుని; కున్ = కి; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము - ముల్లోకములు భూఃభువస్సువః లో మూడవది, స్వర్గము}; సదయుండు = దయ కలవాడు; అయి = ఐ; ఒసంగెన్ = ఇచ్చెను; ఆ = ఆ; తరిన్ = సమయమునందు; దక్ష = దక్షుడు; భృగు = భృగువు; ప్రముఖ = మున్నగు; ప్రజాపతులును = ప్రజాపతులు {ప్రజాపతి - ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది, నవబ్రహ్మలు}; భవుండును = పరమశివుడు {భవుడు - భవముతానైన వాడు, శివుడు}; కుమారుండును = కుమారస్వామి; దేవర్షి = దేవఋషులు; పితృగణంబులును = పితృగణములు; రాజులును = రాజులు; తానును = తను; కూడికొని = కలిసి; చతురాననుండు = బ్రహ్మదేవుడు; కశ్యపున్ = కశ్యపున; కును = కు; అదితి = అదితి; కిన్ = కి; సంతోషంబు = సంతోషము; కాన్ = అగునట్లు; లోకంబుల్ = సర్వలోకముల; కున్ = కు; లోకపాలుర = సమస్తలోకపాలకుల; కున్ = కు; వామనుండు = వామనుడు; వల్లభుండు = ప్రభువు; అని = అని; నియమించి = నిర్ణయించెను; అంత = అంతట; ధర్మంబున్ = ధర్మమున; కున్ = కు; యశంబున్ = యశస్సున; కున్ = కు; లక్ష్మి = సంపదల; కిన్ = కు; శుభంబుల్ = శుభముల; కున్ = కు; దేవతల్ = దేవతల; కున్ = కు; వేదంబుల్ = వేదముల; కున్ = కు; వ్రతంబుల్ = వ్రతముల; కున్ = కు; స్వర్గ = స్వర్గము; అపవర్గంబుల్ = మోక్షముల; కును = కు; ఉపేంద్రుండు = వామనుడే {ఉపేంద్రుడు - ఇంద్రుని తమ్ముడు, వామనుడు}; ప్రధానుండు = అధికారి; అని = అని; సంకల్పించెను = నిర్ణయించెను; ఆ = ఆ; సమయంబున = సమయమునందు. కమలజుడు = బ్రహ్మదేవుడు {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మ}; లోకపాలురున్ = లోకపాలకులును; అమరేంద్రుని = దేవేంద్రునితో; కూడి = కలిసి; దేవయానంబునన్ = ఆకాశగమనమున; ఆ = ఆ; అమరావతి = అమరావతి; కిని = కి; వామనున్ = వామనుని; అమరన్ = ఆదరముతో; కొనిపోయిరి = తీసుకెళ్ళిరి; అంతనటమీద = అటుతరువాత; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.

భావము:
ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి, బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్న అయిన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు; శివుడు; కుమారస్వామి; నారదుడు మున్నగు దేవర్షులు; పిత్రుదేవతలు; రాజులుతో పాటు కలిసి బ్రహ్మదేవుడు లోకాలకూ దిక్పాలకులకూ వామనుడు ప్రభువు అని శాసనం చేసాడు. ఈ విషయం కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట, ధర్మానికి కీర్తికీ సంపదలకూ శుభాలకూ దేవతలకూ వేదాలకు స్వర్గానికి మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడే అధికారి అని నిర్ణయించాడు. పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకెళ్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=85&Padyam=682

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

మహాశివరాత్రి....

24 - 02 - 2017 , శుక్రవారం, మాఘ బహుళ చతుర్దశి......

మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది. మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి!

ఒకనాడు పార్వతీదేవి శివుడితో "ప్రాణేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ధ కర్మలతో చాలా బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞ యాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి ముక్తిని కలుగేటట్లు చేయండి" అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రి వ్రతము అనే వ్రతము ఒకటి ఉంది. ఆ ప్రతము సర్వ యఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను విను...

పూర్వము ఒక పర్వత ప్రాంతమున వ్యాధుడనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క మృగము కనపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్పక, చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు సరస్సు వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ సరస్సు వైపు చూస్తూ కూర్చున్నాడు.
మొదటి జామునకు ఒక లేడి నీరు త్రాగటానికి ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయాడు. "వ్యాధుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నా వలన నీ కుటుంబానికి సరిపడే భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు. కాసేపట్లో ఇంకో జింక ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అన్నది.

సరే నన్నాడు వేటగాడు. రెండవ జామునకు ఇంకో జింక కనిపించింది. మొదటి జింకే అనుకున్న వేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ వ్యాధుడా! నా మాట విను. తరువాత నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మాంసములు లేవు. నన్ను చంపినా నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజింక ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు వ్యాధుడు మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు. బలిసిన మగజింక రానే వచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే బాణము విడవబోయేంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలిని కూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ వేటగాడా! రెండు జింకలు ఇక్కడకు వచ్చాయా? అవి ఎటు పోయాయి? వాటిని నువ్వు చంపావా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి లానే ఆశ్చర్యపడి రెండు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపాయి అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. ఇంతలో ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది. ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయం అయింది. వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాధుని ఎదుట మోకరిల్లాయి. జింకల సత్యసంధతకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు.


వ్యాధుడికి తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. ఈ విధంగా మృగాలను వేటాడి బంధించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దయ చూపడం కూడా సత్యఫలమే" అన్నాడు. వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు చక్కని విమానంలో వచ్చి "ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున వలన నీ పాపము నశించింది. నీవెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న స్వయంభూలింగాన్ని పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.

ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి "దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపాడు భోళాశంకరుడు.

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు......

Thursday 23 February 2017

వామన వైభవం - 125:


8-680-సీ.
అఖిల కర్మంబుల కధినాథుఁడవు నీవ;
యజ్ఞేశుఁడవు నీవ యజ్ఞపురుష!
ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందినఁ;
గడ మేలఁ కల్గు నే కర్మములకు?
ధనదేశకాలార్హతంత్రమంత్రంబులఁ;
గొఱఁతలు నిన్నుఁ బేర్కొనిన మాను;
నయినఁ గావింతు నీ యానతి భవదాజ్ఞ;
మెలఁగుట జనులకు మేలుఁ గాదె?
8-680.1-తే.
యింతకంటెను శుభము నా కెచటఁ గలుగు
ననుచు హరిపంపు శిరమున నావహించి
కావ్యుఁ డసురేంద్రు జన్నంబు కడమఁ దీర్చె
మునులు విప్రులు సాహాయ్యమునఁ జరింప.

టీకా:
అఖిల = సమస్తమైన; కర్మంబుల్ = కర్మలకు; అధినాథుడవు = పైఅధికారివి; నీవ = నీవే; యజ్ఞేశుడవు = యజ్ఞపతివి; నీవ = నీవే; యజ్ఞపురుష = యజ్ఞస్వరూప; ప్రత్యక్షమునన్ = ఎదురుగా; నీవున్ = నీవే; పరితుష్టిన్ = సంతృప్తిని; ఒందినన్ = పొందగా; కడమ = కొరతలు; ఏలకల్గున్ = ఎలాకలుగును, కలుగదు; ఏ = ఏ; కర్మముల = కర్మకాండల; కున్ = కైనను; ధన = ధనము; దేశ = ప్రదేశము; కాల = సమయములకు; అర్హ = తగిన; తంత్ర = తంతులు; మంత్రంబులన్ = మంత్రములచేత; కొఱతలు = ప్రాప్తించినదోషములు; నిన్నున్ = నిన్ను; పేర్కొనినన్ = తలచినచో; మానున్ = తొలగిపోవును; అయినన్ = అయినప్పటికిని; కావింతున్ = నిర్వహించెదను; నీ = నీ యొక్క; ఆనతిన్ = ఆజ్ఞమేరకు; భవత్ = నీ యొక్క; అజ్ఞన్ = ఆనతిప్రకారము; మెలగుట = నడచుట; జనుల్ = మానవుల; కున్ = కు; మేలు = ఉత్తమము; కాదే = కదా. ఇంత = దీని; కంటెను = కంటెను; శుభము = భాగ్యము; నా = నా; కున్ = కు; ఎచటన్ = ఎక్కడ; కలుగున్ = దొరకును; అనుచున్ = అనుచు; హరి = నారాయణుని; పంపు = ఆజ్ఞను; శిరముననావహించి = తలదాల్చి; కావ్యుడు = శుక్రుడు {కావ్యుడు - కవియొక్కపుత్రుడు, శుక్రుడు}; అసురేంద్రు = బలియొక్క; జన్నంబున్ = యాగమును; కడమదీర్చె = పూర్తిచేసెను; మునులు = ఋషులు; విప్రులు = బ్రాహ్మణులు; సాహాయ్యమునన్ = తోడ్పడుతూ; చరింప = మెలగగా.

భావము:
“నీవే అన్ని కార్యాలకూ అధినాదుడవు. నీవేయజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏకార్యాలకూ లోపం కలుగదు. నిన్ను ధ్యానంచేస్తే ధనానికీ దేశానికి మంత్రతంత్రాలకూ ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది. నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకు లోబడి మెలగడము మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యం ఏముంది. ” ఇలా అనిన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేసాడు. అతనికి బ్రాహ్మణులూ ఋషులూ తోడ్పడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=85&Padyam=680

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



Wednesday 22 February 2017

వామన వైభవం - 124:


8-678-ఆ.
ఏమిఁ గొఱత పడియె నీతని జన్నంబు
విస్తరింపు కడమ విప్రవర్య!
విషమ మయిన కర్మ విసరంబు బ్రాహ్మణ
జనులు చూచినంత సమతఁ బొందు.
8-679-వ.
అనిన శుక్రుం డి ట్లనియె.

టీకా:
ఏమిన్ = ఏదైతే; కొఱతపడియెన్ = ఇంకామిగిలి ఉన్నదో; ఈతని = ఇతని యొక్క; జన్నంబు = యజ్ఞము; విస్తరింపు = నెరవేర్చుము; కడమ = మిగిలినదంతా; విప్ర = బ్రహ్మణులలో; వర్య = శ్రేష్ఠుడా; విషమము = సరిగాపూర్తికానిది; అయిన = ఐన; కర్మ = కార్యక్రమముల; విసరంబున్ = సమూహమును; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; జనులు = వారు; చూచిన = చూసిన; అంతన్ = అంతమాత్రముచేత; సమతన్ = సఫలతను; పొందున్ = పొందును. అనిన = అనగా; శుక్రుండు = శుక్రుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
“శుక్రాచార్యా! విప్రోత్తమా! బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నెరవేర్చు లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు మీవంటి బ్రహ్మవేత్తలవల్ల సఫలమవుతాయి. ”ఇలా యజ్ఞం సంపూర్తి చేయమనిన విష్ణువు తో శుక్రుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=85&Padyam=678

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

Tuesday 21 February 2017

వామన వైభవం - 123:



8-676-తే.
వత్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు
సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ
బయనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ
జేరి రక్షింప దురితంబు చెంద దచట.
8-677-వ.
అని యిట్లు నియమించినం బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుట ఘటిత నిటల తటుండయి, వీడ్కొని, బలిం దోడ్కొని సక లాసురయూథంబునుం దాను నొక్క మహాబిలద్వారంబు చొచ్చి ప్రహ్లాదుండు సుతల లోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదు లయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునిం జూచి నారాయణుం డి ట్లనియె.

టీకా:
వత్స = కుమారా; ప్రహ్లాదా = ప్రహ్లాదుడా; మేలు = సంతోషము; నీవారు = నీవారు; నీవున్ = నీవు; సొరిదిన్ = క్రమముగా; మనుమనిన్ = మనుమడిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సుతలమున్ = సుతలమున; కున్ = కు; పయనము = బయలుదేరినవాడవు; ఐ = అయ్యి; పొమ్ము = వెళ్ళుము; నేన్ = నేను; గదా = గదాయుధము; పాణిని = చేత ధరించినవానిని; అగుచున్ = అగుచు; చేరి = వచ్చి; రక్షింపన్ = కాపాడుతుండగా; దురితంబు = ఏకష్టము; చెందదు = కలుగదు; అచటన్ = అక్కడ. అని = అని; ఇట్లు = ఈ విధముగ; నియమించినన్ = ఆజ్ఞాపించగా; పరమేశ్వరున్ = విష్ణుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; వలగొని = ప్రదక్షిణచేసి {వలగొను - వలను(దక్షిణమువైపు) కొను, ప్రదక్షిణముచేయు}; కర = చేతులు యనెడి; కమల = పద్మములను; పుటఘటిత = జోడించిపెట్టబడిన; నిటలతటుండు = నుదుటిభాగము కలవాడు; అయి = ఐ; వీడ్కొని = సెలవుతీసుకొని; బలిన్ = బలిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సకల = సర్వ; అసుర = రాక్షస; యూథంబునున్ = సమూహమును; ఒక్క = ఒక; మహా = గొప్ప; బిల = గుహా; ద్వారంబు = ద్వారము; చొచ్చి = ప్రవేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; సుతలలోకంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; బ్రహ్మవాదులు = బ్రహ్మవేత్తలు; అయిన = ఐన; యాజకుల = ఋత్విజుల యొక్క; సభా = సమూహము; మధ్యంబునన్ = నడుమ; కూర్చున్న = కూర్చొని ఉన్న; శుక్రునిన్ = శుక్రుని; చూచి = చూసి; నారాయణుండు = విష్ణువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
“నాయనా! ప్రహ్లాదా! మంచిది. నీవు నీమనుమనితోపాటు నీవారితొపాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏకష్టమూ కలుగదు. ఈ విధంగా సుతలమునకు వెళ్ళమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేసాడు. నొసటిపై చేతులు జోడించి సెలవుతీసుకున్నాడు. ఆ తరువాత, అతడు బలిచక్రవర్తినీ రాక్షసుల సమూహాన్ని వెంటపెట్టుకొని, ఒక గొప్ప గుహ గుండా సుతలలోకానికి వెళ్ళాడు. అటు పిమ్మట, మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చున్న శుక్రాచార్యుని చూసి, ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=676

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 20 February 2017

వామన వైభవం - 122:

8-673-వ.
అదియునుం గాక.
8-674-ఆ.
సర్వగతుఁడ వయ్యు సమదర్శనుఁడ వయ్యు
నొకట విషమవృత్తి నుండు దరయ
నిచ్ఛలేనివారి కీవు భక్తులు గోరు
తలఁపు లిత్తు కల్పతరువు మాడ్కి.
8-675-వ.
అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి పరమ పురుషుం డిట్లనియె.

టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ. సర్వగతుడవు = అన్నిటి యందునుండు వాడవు; సమదర్శనుడవు = సర్వులఎడల సమదృష్టి కలవాడవు; అయ్యున్ = అయినప్పటికిని; ఒకటన్ = ఒక్కొక్కసారి; విషమవృత్తిన్ = పక్షపాతబుద్ధితో; ఉండుదు = ఉండెదవు; అరయ = తరచిచూసినచో; ఇచ్చ = భక్తి; లేని = లేనట్టి; వారి = వారి; కిన్ = కి; ఈవు = వరములీయవు; భక్తులు = భక్తులు; కోరు = కోరెడి; తలపుల్ = కోరికలను; ఇత్తు = ప్రసాదించెదవు; కల్పతరువు = కల్పతరువు; మాడ్కిన్ = వలె. అని = అని; విన్నవించుచున్న = మనవిచేసెడి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; పరమపురుషుండు = నారాయణుడు {పరమపురుషుడు - అత్యున్నతమైనవ్యక్తి, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
అంతేకాకుండా. నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరిని సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్ని చూపుతావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్పవృక్షం వలె భక్తులైనవారి కోర్కెలు నెరవేర్చుతావు. ” ఇలా మనవిచేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=674

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 19 February 2017

వామన వైభవం - 121:

8-672-సీ.
చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు;
శర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ,
డన్యుల కెక్కడి? దసురులకును మాకు;
బ్రహ్మాదిపూజితపదుఁడ వయిన
దుర్లభుండవు నీవు వైతి;
పద్మజాదులు భవత్పాదపద్మ
మకరంద సేవన మహిమ నైశ్వర్యంబు;
లందిరి కాక యే మల్పమతుల
8-672.1-తే.
మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము
నీ కృపాదృష్టిమార్గంబు నెలవు చేర
నేమి తప మాచరించితి మెన్నఁగలమె?
మమ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!

టీకా:
చతురాననుడు = బ్రహదేవుడు {చతురాననడు - నాలుగుమోములవాడు, బ్రహ్మ}; నీ = నీ యొక్క; ప్రసాదంబున్ = అనుగ్రహమును; కానడు = ఇంతగాపొందలేడు; శర్వుడున్ = ఈశ్వరుడు {శర్వుడు - ప్రళయమున భూతలములను హింసించువాడు, శంకరుడు}; ఈ = ఇంతటి; లక్ష్ములన్ = ఐశ్వర్యములను; పొందడు = పొందలేడు; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; ఎక్కడిది = ఏక్కడదొరుకుతుంది; అసురుల = రాక్షసుల; కును = కు; మా = మా; కున్ = కు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగువారిచేత; పూజితుడవు = పూజింపబడువాడవు; అయిన = ఐన; దుర్లభుండవు = దరిచేరసాధ్యంకానివాడవు; నీవు = నీవు; దుర్గ = కోటను; పాలుడవు = కాపాడువాడవు; ఐతి = అయితివి; పద్మజ = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగువారు; భవత్ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; మకరంద = మకరందమును; సేవన = సేవించిన; మహిమన్ = మహిమవలన; ఐశ్వర్యంబులున్ = ఐశ్వర్యములను; అందిరి = అందుకొనిరి; కాక = అలా అయ్యుండగ; ఏము = మేము; అల్పమతులము = అల్పులము; అధిక = మిక్కిలి.  దుర్యోనులము = నీచజన్ములు కలవారము; కుత్సిత = కుత్సితమైన; ఆత్మకులము = బుద్ధికలవారము; నీ = నీ యొక్క; కృపాదృష్టి = కరుణాకటాక్షపు; మార్గంబున్ = దారిలో; నెలవు = ఉండుటను; చేరన్ = చేరుటకు; ఏమి = ఎట్టి; తపమున్ = తపస్సును; ఆచరించితిమి = చేసితిమో; ఎన్నగలమె = తెలియగలమా లేము; మమ్మున్ = మమ్మలను; కాచుట = కాపాడుట; చిత్రంబు = ఆశ్చర్యకరవిషయము; మంగళాత్మా = మంగళస్వరూపా.

భావము:
“ఓ మంగళస్వరూపా బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంక ఇతరులనగా ఎంత. బ్రహ్మాదేవుదు మున్నగువారిచేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాద్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమవల్ల బ్రహ్మాదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ, మేము చాలా అల్పులము. నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడంవల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=672

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 18 February 2017

వామన వైభవం - 120:

8-670-ఉ.
ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
మన్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపదఁ గల్గనేర్చునే?
8-671-వ.
అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందు ధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరి కృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.

టీకా:
ఎన్నడున్ = ఎప్పుడు; లోక = లోకములను; పాలకులన్ = పరిపాలించెడివారినికూడ; ఈ = ఇంత; కృపన్ = దయతో; చూడని = చూడనట్టి; నీవు = నీవు; నేడు = ఇవాళ; నన్నున్ = నన్ను; ఉన్నతున్ = గొప్పవానినిగ; చేసి = చేసి; నా = నా యొక్క; బ్రతుకున్ = జీవితమును; ఓజయున్ = తేజస్సును; ఆనతియిచ్చు = కలుగజేసి; కాచితి = కాపాడితివి; ఈ = ఇట్టి; మన్ననలు = గౌరవించుటలు; ఈ = ఇట్టి; దయారసమున్ = కరుణ; మాటలు = మాటలు; పెద్దఱికంబున్ = మర్యాద; చాలవే = సరిపోవా, సరిపోవును; పన్నగతల్ప = శేషసాయి; నిన్నున్ = నిన్ను; ఎఱిగి = తెలిసి; పట్టినన్ = ఆశ్రయించినచో; ఆపద = కష్షము; కల్గనేర్చునే = కలుగగలవా, కలుగవు. అని = అని; పలికి = పలికి; హరి = విష్ణుని; కిన్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; ప్రణామంబు = నమస్కారము; చేసి = చేసి; ఇందుధరున్ = పరమశివుని; కిన్ = కి; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసి; బంధ = బంధములనుండి; విముక్తుడు = విడుదలైనవాడు; ఐ = అయ్యి; తనవారల = తనవారి; తోన్ = తోటి; చేరికొని = కలిసి; బలి = బలి; సుతలంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; హరి = విష్ణుని; కృపావశంబునన్ = దయవలన; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయ్యి; కుల = వంశమును; ఉద్దారకుండు = ఉద్దరించెడివాడు; అయిన = ఐన; మనుమని = మనుమడిని; కని = చూసి; సంతోషించి = సంతోషించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతున్ = విష్ణుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
శేషశాయి శయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా ఈ మాటల మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు. ఇలా విష్ణమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువుకూ, బ్రహ్మదేవునకూ, చంధ్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=670

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 17 February 2017

వామన వైభవం - 119:



8-668-క.
దానవ దైత్యుల సంగతిఁ
బూనిన నీ యసురభావమును దోడ్తో మ
ద్ధ్యానమునఁ దలఁగి పోవును
మానుగ సుతలమున నుండుమా మా యాజ్ఞన్.
8-669-వ.
అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ పలుకుఁ జెఱకు రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఱెప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుఁ గవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురః ఫలకంబునం బులకంబులు కులకం బులయి తిలకంబు లొత్తఁ, గేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడు పడుచుఁ జిక్కని చిత్తంబునఁ జక్కని మాటల రక్కసుల ఱేఁ డిట్లనియె.

టీకా:
దానవ = దానవుల {దానవులు - కశ్యపునకు దనువు వలన కలిగిన పుత్రులు, రాక్షసులు}; దైత్యుల = దైత్యుల {దైత్యులు - కశ్యపునకు దితి వలన కలిగిన పుత్రులు, రాక్షసులు}; సంగతిన్ = తోకూడుటవలన; పూనిన = కలిగిన; నీ = నీ యొక్క; అసురభావమున్ = రాక్షసత్వమును; తోడ్తోన్ = వెంటనే; మత్ = నా యొక్క; ధ్యానమునన్ = ధ్యానమువలన; తలగిపోవును = తొలగిపోవును; మానుగ = మనోజ్ఞంగా, సంతోషంగా; సుతలమునన్ = సుతలమునందు; ఉండుమా = ఉండుము; మా = మేము; ఆజ్ఞన్ = చెప్పినట్లుగా.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = పలుకుచున్నట్టి; ముమ్మూర్తుల = త్రిమూర్తులందు; ముదుకవేల్పు = వృద్దదేవుని; తియ్యని = తియ్యటి; నెయ్యంపు = స్నేహపూరిత; పలుకున్ = మాటలు యనెడి; చెఱకురసంపు = చెరకురసముయొక్క; సోనలు = జల్లులు; వీనుల = చెవుల; తెరువులన్ = ద్వారా; చొచ్చి = ప్రవేశించి; లోను = లోపల; బయలున్ = బయట; నిండి = నిండిపోయి; ఱెప్పలన్ = కనురెప్పలను; తప్పందోచుకొని = తొలగదోసుకొని; కన్ను = కళ్లు; గవ = రెంటి (2); కొలంకులన్ = కొలకులు యనెడి; అలుగులున్ = కుళాయిలనుండి; వెడలిన = వెలువడిన; చందంబునన్ = విధముగ; సంతసంబునన్ = సంతోషమువలన; కన్నీరు = కన్నీరు; మున్నీరు = ప్రవాహములు; ఐ = అయ్యి; పఱవన్ = ప్రవంహించగా; ఉరఃఫలకంబునన్ = వక్షస్థలమునందు; పులకంబులున్ = పులకరింతలు; కులకంబులు = అంకురించినవి; అయి = అయ్యి; తిలకంబులొత్తన్ = అతిశయించినవికాగా; కేలు = చేతులు; మొగిడ్చి = జోడించి; ఎక్కొన్న = అధికమైన; వేడుకన్ = కుతుకముతో; త్రొక్కుడుపడుచు = తడబడుతు; చిక్కని = దృఢమైన; చిత్తంబునన్ = మనసుతో; చక్కని = చక్కటి; మాటలన్ = మాటలతో; రక్కసుల = రాక్షసుల; ఱేడు = రాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
దైత్యదానవుల కలయికవలన నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడంవలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞప్రకారంగా సంతోషంగా సుతలంలో ఉండు.” ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తియ్యని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరకురసపు జల్లులవలే దూరి, లోపలా బయటా నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటునుండి త్రోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి. వక్షస్ధలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించాడు. స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=668

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 16 February 2017

వామన వైభవం - 118:


8-666-వ.
అని పలికి బలిం జూచి భగవంతుం డి ట్లనియె.
8-667-సీ.
సేమంబు నీ కింద్రసేన మహారాజ! ;
వెఱవకు మేలు నీ వితరణంబు;
వేలుపు లం దుండ వేడుక పడుదురు;
దుఃఖంబు లిడుములు దుర్మరణము
లాతురతలు నొప్పు లందుండు వారికి;
నొందవు సుతల మందుండు నీవు;
నీ పంపు జేయని నిర్జరారాతుల;
నా చక్ర మేతెంచి నఱకుచుండు;
8-667.1-ఆ.
లోకపాలకులకు లోనుగా వక్కడ
నన్యు లెంతవార లచట? నిన్ను
నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ
గరుణతోడ నీకుఁ గానవత్తు.

టీకా:
సేమంబు = మేలుకలుగును; నీ = నీ; కున్ = కు; ఇంద్రసేనమహారాజ = ఇంద్రసేనమహారాజ; వెఱవకు = బెదరిపోకు; మేలు = శ్రేష్ఠమైనది; నీ = నీ యొక్క; వితరణంబు = దాతృత్వము; వేలుపులు = దేవతలు; అందున్ = అక్కడ; ఉండన్ = ఉండుటకు; వేడుక = ఉత్సుకత; పడుదురు = పొందెదరు; దుఃఖంబులు = దుఃఖములు; ఇడుములు = కష్టములు; దుర్మరణము = దుర్మరణములు; ఆతురతలు = ఆతృతలు; నొప్పులు = బాధలు; అందున్ = అక్కడ; ఉండు = ఉండెడి; వారి = వారల; కిన్ = కు; ఒందవు = పొందవు; సుతలము = సుతలము; అందున్ = లో; ఉండు = ఉండుము; నీవు = నీవు; నీ = నీ యొక్క; పంపుజేయని = ఆజ్ఞనులెక్కచేయని; నిర్జరారాతులన్ = రాక్షసులను {నిర్జరారాతులు - నిర్జరుల (దేవతల) ఆరాతులు (శత్రువులు), రాక్షసులు}; నా = నా యొక్క; చక్రము = చక్రము; ఏతెంచి = వచ్చి; నఱుకుచుండున్ = సంహరించును.  లోకపాలకుల = ఏలోకపాలకుల; కున్ = కి; లోనుకావు = లొంగియుండవు; అక్కడ = అక్కడ; అన్యులు = ఇంక ఇతరులు; ఎంతవారలు = ఎంతటివారు; అచటన్ = అక్కడ; నిన్నున్ = నిన్ను; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందు; వచ్చి = వచ్చి; ఏను = నేను; రక్షించెదన్ = కాపాడెదను; కరుణ = దయ; తోడన్ = తోటి; నీ = నీ; కున్ = కు; కానవత్తున్ = కనిపించుతుంటాను.అని = అని; పలికి = పలికి; బలిన్ = బలిని; చూచి = చూసి; భగవంతుండు = విష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.

భావము:
“ఇంద్రసేనమహారాజా! నీకు మేలు కలుగుతుంది. భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైనది. సుతలలోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహల పడతారు. అంత చక్కటి ఆ లోకంలోనివారికి దుఃఖమూ, కష్టమూ, దుర్మరణమూ, రోగబాధలూ, కీడు కలగవు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంక ఇతరులను లెక్కించేది ఏముంది. ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తుంటాను. కనికరంతో కనిపెట్టి ఉంటాను.ఈవిధంగా పలికిన భగవంతుడు అయిన వామనుడు బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=667

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 15 February 2017

వామన వైభవం - 117:


8-664-క.
సావర్ణి మనువు వేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు
ర్భావిత మగు నా చోటికి
రావించెద; నంతమీఁద రక్షింతు దయన్.
టీకా:
సావర్ణి = సావర్ణి; మనువు = మనువు; వేళను = కాలమునందు; దేవేంద్రుండు = దేవేంద్రుడు; అగున్ = అగును; ఇతండు = ఇతను; దేవతల్ = దేవతల; కున్ = కుకూడ; దుర్భావితము = ఊహించసాధ్యంకానిది; అగున్ = అయినట్టి; ఆ = ఆ; చోటి = పదవి; కిన్ = కి; రావించెదన్ = తీసుకొచ్చెదను; అంతమీద = ఆ తరువాత; రక్షింతున్ = కాపాడెదను; దయన్ = దయతో.
భావము:
సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. ఊహించడానికీ వీలుకాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడతాను కూడ.
8-665-క.
వ్యాధులుఁ దప్పులు నొప్పులు
బాధలుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధిత విభవమున నుండు నితఁ డందాకన్.

టీకా:
వ్యాధులు = రోగములు; దప్పులు = కష్టములు; నొప్పులు = నొప్పులు; బాధలు = బాధలు; చెడి = లేకుండపోయి; విశ్వకర్మ = విశ్వకర్మచేత; భావిత = సృష్టింపబడినట్టి; దనుజ = రాక్షసులచే; ఆరాధిత = సేవింపబడెడి; సుతలాలయమునన్ = సుతలలోకమున; ఏధిత = వృద్ధిపొందినట్టి; విభవమునన్ = వైభవముతో; ఉండున్ = ఉండును; ఇతండు = ఇతను; అంత = అప్పటి; దాకన్ = వరకు.

భావము:
రోగాలూ శ్రమలూ ఆపదలూ దుఃఖాలు లేకుండా; విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతలలోకంలో, అంతవరకూ ఇతడు దానవుల సేవలు అందుకుంటూ. ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=665

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 14 February 2017

వామన వైభవం - 116:

8-662-శా.
బద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై
సిద్ధైశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శుద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁ డు
ద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.
8-663-ఆ.
అసురనాథుఁ డనుచు ననఘుని మర్యాద
యేను జూత మనుచు నింత వలుక
నిజము పలికె నితఁడు నిర్మలాచారుండు
మేలుమేలు నాకు మెచ్చువచ్చు.

టీకా:
బద్దుండు = బంధింపబడినవాడు; ఐ = అయ్యి; గురు = గురువు యొక్క; శాప = శాపమువలన; తప్తుడు = తపించువాడు; అయి = ఐ; తాన్ = అతను; బంధు = బంధువుల; వ్రజ = సమూహములచే; త్యక్తుడు = విడువబడినవాడు; ఐ = అయ్యి; సిద్ధ = ప్రాప్తించిన; ఐశ్వర్యమున్ = సంపదలు; కోలుపోయి = నశించి; విభవ = ప్రాభవములు; క్షీణుండున్ = నశించినవాడు; ఐ = అయ్యి; పేద = పేదవాడు; ఐ = అయ్యి; శుద్దత్వంబునన్ = స్వచ్ఛతను; సత్యమున్ = సత్యమును; కరుణయున్ = దయను; సొంపున్ = ప్రసన్నతలను; ఏమియున్ = ఏమాత్రము; తప్పడు = విడువలేదు; ఉద్బుద్ధుండు = జ్ఞాని; ఐ = అయ్యి; యజయాఖ్య = గెలువసాధ్యముకాని; మాయన్ = మాయను; గెలిచెన్ = జయించెను; పుణ్యుడు = పుణ్యాత్ముడు; ఇతడు = ఇతగాడు; అల్పుడే = తక్కువవాడా కాదు.
అసుర = రాక్షసులకు; నాథుడు = రాజు; అనుచున్ = అనుచు; అనఘుని = పుణ్యుని; మర్యాద = మంచినడవడిని; ఏను = నేను; చూతము = పరీక్షించెదము; అనుచున్ = అనుకోనగా; ఇంతవలుక = ఇంతవరకు; నిజమున్ = సత్యమునే; పలికెన్ = పలికెను; ఇతడు = ఇతను; నిర్మల = నిర్మలమైన; ఆచారుండు = నడవడికగలవాడు; మేలుమేలు = చాలామంచిది; నా = నా; కున్ = కు; మెచ్చు = మెప్పుగొలుపుతున్నది;

భావము:
ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపంవలన పరితాపానికి గురయ్యాడు. బంధువులనుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్నీ కోల్పోయి పేదవాడు అయ్యాడు. ఐనా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని దయనూ సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞానియై గెలవడానికి సాధ్యంకాని మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహానీయుడు. ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడిగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకూ ఊరకున్నాను. ఇతడు మంచి నడవడి కలవాడు; సత్యవాది; మేలు మేలు ఈతనిప్రవర్తన నాకు మెప్పుకలుగుచున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=83&Padyam=663

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday 13 February 2017

వామన వైభవం - 115:

8-660-వ.
అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె.
8-661-సీ.
ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని;
యఖిల విత్తంబు నే నపహరింతు
సంసార గురుమద స్తబ్దుఁడై యెవ్వఁడు;
దెగడి లోకము నన్ను ధిక్కరించు
నతఁ డెల్ల కాలంబు నఖిల యోనుల యందుఁ;
బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప
విత్త వయో రూప విద్యా బలైశ్వర్య;
కర్మ జన్మంబుల గర్వ ముడిగి
8-661.1-తే.
యేక విధమున విమలుఁడై యెవ్వఁ డుండు
వాఁడు నా కూర్చి రక్షింపవలయువాఁడు;
స్తంభ లోభాభిమాన సంసార విభవ
మత్తుఁడై చెడ నొల్లఁడు మత్పరుండు.

టీకా:
అని = అని; పలికిన = చెప్పిన; బ్రహ్మ = బ్రహ్మదేవుని; వచనంబులు = మాటలు; విని = విని; భగవంతుండు = విష్ణుమూర్తి {భగవంతుడు - ఐశ్వర్యాదికములు కలుగుటచే పూజ్యుడైనవాడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. ఎవ్వనిన్ = ఎవిరినైతే; కరుణింపన్ = దయచూపవలెనని; నిచ్చయించితిని = అనుకొనెదనో; వానిని = వానిని; అఖిల = సమస్తమైన; విత్తంబున్ = సంపదలను; నేన్ = నేను; అపహరింతున్ = లాగుకొనెదను; సంసార = సంసారసంబంధమైన; గురు = పెద్ద; మద = మదము చేత {మదము - 1కొవ్వు 2గర్వము, అష్టవిధమదములు 1విత్త 2వయో 3రూప 4విద్యా 5బల 6ఐశ్వర్య 7కర్మ 8జన్మల సంబంధించిన మదములు}; స్తబ్దుడు = నిస్తేజుడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవడైతే; లోకమున్ = లోకమును; నన్ను = నన్ను; ధిక్కరించున్ = తిరస్కరించునో; అతడున్ = అతను; ఎల్ల = ఎంత; కాలంబున్ = కాలమైనను; అఖిల = అనేకరకములైన; యోనులన్ = గర్భముల; అందున్ = లో; పుట్టుచున్ = పుడుతూ; దుర్గతిన్ = నరకమును; పొందున్ = పొందును; పిదపన్ = తరవాత; విత్త = ధనము; వయో = యౌవనము; రూప = అందము; విద్యా = విద్యలు; బల = బలము; ఐశ్వర్య = సంపదలు; కర్మ = వృత్తి; జన్మంబులన్ = వంశముల; గర్వమున్ = గర్వములను; ఉడిగి = విడిచిపెట్టి.  ఏకవిధమున = ఏకాగ్రముగా; విమలుడు = నిర్మలుడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవరైతే; ఉండున్ = ఉండునో; వాడు = అతడు; నా = నాచేత; కూర్చి = ఇష్చపడి; రక్షింపన్ = కాపాడబడ; వలయున్ = వలసిన; వాడు = వాడు; స్తంభ = అజ్ఞానము; లోభ = అత్యాశ; అభిమాన = గర్వములతో; సంసార = లౌకిక; విభవ = ప్రాభవములతే; మత్తుడు = మదించినవాడు; ఐ = అయ్యి; చెడన్ = నశించుటకు; ఒల్లడు = అంగీకరించడు; మత్ = నాకు; పరుండు = చెందినవాడు.

భావము:
ఇలా విన్నవించిన బ్రహ్మదేవుడి మాటలు విని భగవంతుడు అగు వామనుడు ఇలా అన్నాడు. “ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో, వాడి సంపద అంతటిని అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కారిస్తుంటాడో, వాడు ఎప్పటికీ నానా యోనులలో పుడుతూ, చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో, వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడు అయినవాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకికసంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=83&Padyam=661

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday 12 February 2017

వామన వైభవం - 114:



8-658-వ.
అని యిట్లు వింధ్యావళియుం బ్రహ్లాదుండును విన్నవించు నవసరంబున హిరణ్యగర్భుండు చనుదెంచి యిట్లనియె.
8-659-సీ.
భూతలోకేశ్వర! భూతభావన! దేవ! ;
దేవ! జగన్నాథ! దేవవంద్య!
తన సొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె;
దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;
గరుణింప నర్హుండు గమలలోచన! నీకు;
విడిపింపు మీతని వెఱపు దీర;
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ;
జేరి నీ పదము లర్చించునట్టి
8-659.1-తే.
భక్తియుక్తుఁడు లోకేశుపదము నందు
నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తన రాజ్య మంతయు నిచ్చి నట్టి
బలికిఁ దగునయ్య! దృఢపాశబంధనంబు?

టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; వింధ్యావళియున్ = వింధ్యావళీదేవి; ప్రహ్లాదుండును = ప్రహ్లాదుడు; విన్నవించు = మనవిచేసెడి; అవసరంబునన్ = సమయమునందు; హిరణ్యగర్భుండు = బ్రహ్మదేవుడు {హిరణ్యగర్భుడు - గర్భమున హిరణ్యము (బంగారము) కలవాడు, బ్రహ్మ}; చనుదెంచి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భూతలోకేశ్వరా = నారాయణ {భూతలోకేశ్వరుడు - భూతలోక (సమస్తమైన ప్రాణులకు) ఈశ్వరుడు, విష్ణువు}; భూతభావన = నారాయణ {భూతభావన - సమస్తప్రాణులచేత ధ్యానించబడువాడు, విష్ణువు}; దేవదేవ = నారాయణ {దేవదేవ - మహాగొప్పదేవుడు, విష్ణువు}; జగన్నాథ = నారాయణ {జగన్నాథ - సర్వ లోకాధిపతి, విష్ణువు}; దేవవంద్య = నారాయణ {దేవవంద్యుడు - దేవతలచే వంద్యుడు (స్తుతింపబడువాడు), విష్ణువు}; తన = తన యొక్క; సొమ్మున్ = సందలను; సకలంబున్ = సమస్తము; తప్పక = వదలక; నీకున్ = నీకు; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; దండ = శిక్షించుటకు; యోగ్యుడు = తగినవాడు; కాడు = కాడు; దానపరుడున్ = దాత; కరుణింపన్ = దయచూచుటకు; అర్హుండు = తగినవాడు; కమలలోచన = పద్మాక్ష; నీ = నీ; కున్ = కు; విడిపింపుము = బంధవిముక్తునిచేయుము; ఈతని = ఇతని యొక్క; వెఱపు = బెదురు; తీరన్ = పోవునట్లు; తోయపూరము = జలములను; చల్లి = చల్లి; దూర్వాంకురములన్ = గరికపోచలతో; చేరి = దగ్గరకొచ్చి; నీ = నీ యొక్క; పదములన్ = పాదములను; అర్చించునట్టి = పూజించెడి.  భక్తి = భక్తి; యుక్తుడు = కలవాడు; లోకేశుపదమునందు = సర్వలోకాధిపతివైన; నీవు = నీవు; ప్రత్యక్షముగ = ఎదురుగ; వచ్చి = వచ్చి; నేడు = ఇవాళ; వేడన్ = అడుగుగ; ఎఱిగి = తెలిసికూడ; తన = తన యొక్క; రాజ్యమున్ = రాజ్యము; అంతయున్ = సమస్తమును; ఇచ్చిన = ఇచ్చివేసిన; అట్టి = అటువంటి; బలి = బలి; కిన = కి; తగున = న్యాయమా; అయ్య = తండ్రి; దృఢ = గట్టిగా; పాశ = తాళ్ళతో; బంధనంబు = కట్టవేయుట.

భావము:
ఇలా ప్రహ్లాదుడూ వింధ్యావళీ విన్నవించిన పిమ్మట బ్రహ్మదేవుడు వచ్చి వామనుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుతో ఇలా అన్నాడు. “ఓ దేవదేవా! దేవవంద్యా! జగన్నాధా! కమాలల వంటి కన్నులుగల శ్రీహరీ! నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడవు, ఆరాధ్యనీయుడవు; బలిచక్రవర్తి గొప్పదాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేసాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాదు. నీచే దయచూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలములతో అభిషేకించిన, గరిక పత్రితో పూజించిన భక్తుడు. లోకాధిపతివి అయిన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేసాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్ళతో కట్టివేయడం న్యాయము కాదయ్యా!”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=83&Padyam=659

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday 11 February 2017

వామన వైభవం - 113:

8-657-క.
కా దనఁడు పొమ్ము లే దీ
రా దనఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా దయితుఁ గట్టనేటికి?
శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా!

టీకా:

కాదు = కాదు; అనడు = అన్నవాడుకాదు; పొమ్ము = వెళ్ళిపో; లేదు = లేదు; ఈరాదు = ఇవ్వలేను; అనడు = అన్నవాడుకాదు; జగత్రయ = ముల్లోకములయొక్క; ఏక = మొత్తము; రాజ్యమున్ = రాజ్యాధికారమును; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; నా = నా యొక్క; దయితున్ = భర్తను; కట్టన్ = బంధించుట; ఏటికి = ఎందుకు; శ్రీదయితాచిత్తచోర = నారాయణ {శ్రీదయితాచిత్తచోరుడు - లక్ష్మీదేవియొక్క చిత్తచోర (మనసు దొంగిలించిన వాడు), విష్ణువు}; శ్రితమందార = నారాయణ {శ్రితమందార - ఆశ్రయించినవారికి కల్పవృక్షము వంటి వాడు, విష్ణువు}.

భావము:
ఆశ్రిత జనుల పాలిటి కల్పవృక్షమా! “ కాదు, లేదు, పో, ఇవ్వను” అన లేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేసాడు కదా! ఇంకెందుకు స్వామీ! లక్ష్మీపతీ! నా పతిని బంధిస్తున్నావు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=657

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday 10 February 2017

వామన వైభవం - 112:

8-655-వ.
వచ్చి యచ్చేడియ తచ్చరణ సమీపంబునం బ్రణతయై నిలువంబడి యిట్లనియె.
8-656-క.
నీకుం గ్రీడార్థము లగు
లోకంబులఁ జూచి పరులు లోకులు కుమతుల్
లోకాధీశుల మందురు
లోకములకు రాజవీవ లోకస్తుత్యా!

టీకా:
వచ్చి = వచ్చి; ఆ = ఆ; చేడియ = వనిత; తత్ = అతని; చరణ = పాదముల; సమీపంబునన్ = వద్ద; ప్రణత = నమస్కరించినది; ఐ = అయ్యి; నిలువంబడి = నిలబడి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. నీ = నీ; కున్ = కు; క్రీడార్థము = సంచరించు విహారస్థలాలు; అగు = అయిన; లోకంబులన్ = లోకములను; చూచి = చూసి; పరులు = ఇతరులు; లోకులు = ప్రజలు; కుమతుల్ = మూర్ఖులు; లోక = లోకములకు; అధీశులము = పాలకులము; అందురు = అనుకొనెదరు; లోకముల్ = సర్వలోకములకు; రాజవు = రాజువు; ఈవ = నీవుమాత్రమే; లోకస్తుత్యా = నారాయణ {లోకస్తుత్య - సర్వలోకముల స్తుతింపబడువాడు, విష్ణువు}.

భావము:
అలా చేర వచ్చిన వింద్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఆఇల్లాలు ఇలా అన్నది.
“ఓ లోకపూజ్యుడా! లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కాని తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకు తామే పాలకులని భావిస్తారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=656

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday 9 February 2017

వామన వైభవం - 111:


8-653-వ.
అని పలికి జగదీశ్వరుండును నిఖిలలోక సాక్షియు నగు నారాయణ దేవునకు నమస్కరించి, ప్రహ్లాదుండు పలుకుచున్న సమయంబున.
8-654-మ.
తతమత్తద్విపయాన యై కుచ నిరుంధచ్ఛోళ సంవ్యానయై
ధృత భాష్పాంబు వితాన యై కరయుగాధీ నాలికస్థానయై
పతిబిక్షాం మమ దేహి కోమలమతే! పద్మాపతే! యంచుఁ ద
త్సతి వింద్యావళి చేరవచ్చెఁ ద్రిజగద్రక్షామనున్ వామనున్.

టీకా:
అని = అని; పలికి = పలికి; జగత్ = లోకములకు; అధీశ్వరుండును = ప్రభువు; నిఖిల = సమస్తమైన; లోక = లోకములకు; సాక్షియున్ = దర్శనుండు; అగు = అయిన; నారాయణ = విష్ణువు యనెడి; దేవున్ = దేవుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; పలుకుచున్న = పలుకుతున్నట్టి; సమయంబునన్ = సమయమునందు; తత్ = ఆ; మత్త = మదించిన; ద్విప = గజమువంటి; యాన = గమనముయామె; ఐ = అయ్యి; కుచ = వక్షస్థలమును; నిరుంధత్ = గట్టిగా; చోళ = పైటచెరగు; సంవ్యాన = చుట్టకొన్నామె; ఐ = అయ్యి; ధృత = కారిన; బాష్పాంబు = కన్నీటి; వితాన = సమూహములుకలామె; ఐ = అయ్యి; కర = చేతులు; యుగా = రెండును; అధీ = జోడించబడిన; అలికస్థాన = నుదుటిప్రదేశము కలామె; ఐ = అయ్యి; పతి = భర్త అను; బిక్షాన్ = బిక్షను; మమ = నాకు; దేహి = పెట్టుము; కోమలమతే = మృదువైనమనసుకలవాడ; పద్మాపతే = లక్ష్మీపతీ; అంచున్ = అనుచు; తత్ = ఆ; సతి = ఇల్లాలు; వింధ్యావళి = వింధ్యావళి; చేరన్ = దగ్గరకు; వచ్చెన్ = వచ్చెను; త్రిజగత్ = ముల్లోకములను; రక్ష = కాపాడుట; ఆమనున్ = సమృద్ధిగా కలవానిని; వామనున్ = వామనుని.

భావము:
లోకనాధుడూ లోకదర్సకుడూ అయిన విష్ణు దేవునకు ఇలా ప్రహ్లాదుడు నమస్కరించి ఇలా అన్నాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరగు బిగించుకుని ఉంది. రెండుచేతులనూ నుదిటిపై జోడించి “దయామయా! లక్ష్మీపతీ! నాకు పతిబిక్షపెట్టు” అంటూ ముల్లోకాలకూ ప్రభువైన వామనమూర్తిని వేడుకున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=654

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday 8 February 2017

వామన వైభవం - 110:

8-652-సీ.
ఇతనికి మున్ను నీ వింద్రపదం బిచ్చి;
నేఁడు త్రిప్పుటయును నెఱయమేలు
మోహనా హంకృతి మూలంబు గర్వాంధ;
తమస వికారంబు దాని మాన్పి
కరుణ రక్షించుటఁగాక బంధించుటే? ;
తత్త్వజ్ఞునకు మహేంద్రత్వమేల?
నీ పాదకమలంబు నియతిఁ గొల్చిన దాని;
బోలునే సురరాజ్య భోగపరత?
8-652.1-తే.
గర్వ మేపారఁ గన్నులు గానరావు;
చెవులు వినరావు; చిత్తంబు చిక్కుపడును;
మఱచు నీ సేవలన్నియు మహిమ మాన్పి
మేలు చేసితి నీ మేటి మేర చూపి.

టీకా:
ఇతను = ఇతను; కిన్ = కి; మున్ను = ఇంతకుముందు; నీవు = నీవు; ఇంద్ర = ఇంద్రుని; పదంబు = పదవిని; ఇచ్చి = ఇచ్చి; నేడు = ఇవాళ; త్రిప్పుటయును = తొలగించుట; నెఱయ = చాలా; మేలు = మంచిది; మోహన = అజ్ఞానమునకు; అహంకృతి = అహంకారమునకు; మూలంబు = కారణమైనది; గర్వ = గర్వము యనెడి; అంధతమస = కారుచీకటి; వికారంబు = కలిగించెడిది; దానిన్ = అట్టిదానిని; మాన్పి = పోగొట్టి; కరుణన్ = దయతో; రక్షించుట = కాపాడుట; కాక = తప్పించి; బంధించుటే = శిక్షించుటా కాదు; తత్త్వజ్ఞున్ = బ్రహ్మజ్ఞానికి; మహేంద్రత్వము = ఇంద్రపదవి; ఏల = ఎందుకు; నీ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; కమలంబున్ = పద్మములను; నియతిన్ = నిష్ఠగా; కొల్చినన్ = సేవించినచో; దానిన్ = దానికి; పోలునే = సాటివచ్చునా రాదు; సురరాజ్య = ఇంద్రత్వమును; భోగపరత = అనుభవించుట. గర్వమున్ = గర్వము; ఏపారన్ = పెరుగుటవలన; కన్నులు = కళ్ళు; కానరావు = కనిపించవు; చెవులు = చెవులు; వినరావు = వినపించవు; చిత్తంబు = మనసు; చిక్కుపడును = సంకటపడును; మఱచున్ = మరచిపోవును; నీ = నిన్ను; సేవలు = సేవించుటలు; అన్నియున్ = అన్నిటిని; మహిమన్ = నీ మహిమతో; మాన్పి = పోగొట్టి; మేలు = మంచిపని; చేసితి = చేసితివి; నీ = నీ యొక్క; మేటి = అధిక్యము యొక్క; మేర = ఎల్ల; చూపి = చూపించి.

భావము:
“స్వామీ నీవు వీనికి మొదట ఇంద్రపదవి ఇచ్చావు. మరల దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలు అయింది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికీ మూలకారణం అయి ఉన్నది; గర్వం అనే కారుచీకటిని కలిగించేది; అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే; అంతేకాని ఈ బంధనం శిక్షించడం కాదు; పరమాత్ముని తెలుసుకున్నవానికి ఇంద్రపదవి ఎందుకూ కొరగానిది; అది నీపాద సేవకు సాటిరాదు; ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు; చెవులు వినిపించవు; మనస్సుకు మైకం కమ్ముతుంది; నిన్ను మరచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేసావు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=652

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday 7 February 2017

వామన వైభవం - 109:

8-651-వ.
ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుఁగొని విరోచన నందనుండు వారుణపాశబద్ధుండుఁ గావునఁ దనకుం దగిన నమస్కారంబు జేయ రామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నత శిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు చెల్లించె; నంతఁ బ్రహ్లాదుఁడు ముఖమండపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిం గని యానంద బాష్పజలంబులుఁ బులకాకుంరంబులున్ నెరయ దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; సమాగతుండు = వచ్చినట్టివాడు; ఐన = అయిన; తమ = వారి యొక్క; తాతన్ = తాతను; కనుగొని = చూసి; విరోచననందనుండు = బలిచక్రవర్తి; వారుణపాశ = వరుణపాశములతో; బద్దుండు = కట్టబడినవాడు; కావునన్ = కనుక; తన = అతని; కున్ = కి; తగిన = తగినట్టి; నమస్కారంబు = నమస్కారములు; చేయరామిన్ = చేయలేకపోవుట; చేసి = వలన; సంకుల = పొర్లిపోవుతున్న; అశ్రు = కన్నీళ్లతో; విలోల = చలించిన; లోచనుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; సిగ్గుపడి = లజ్జితుడై; నత = వంచిన; శిరస్కుండు = తల కలవాడు; ఐ = అయ్యి; నమ్ర = నమ్రతగల; భావంబునన్ = విధముగా; మ్రొక్కుచెల్లించెన్ = నమస్కరించెను; అంతన్ = అంతట; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ముఖమండపంబున = మొగసాల; సునంద = సునందుడు; ఆది = మున్నగు; పరిచర = పరిచరులతో; సమేతుండు = కలిసియున్నవాడు; ఐ = అయ్యి; కూర్చున్న = కూర్చొని యున్న; వామనదేవునిన్ = వామనావతారుని; కని = చూసి; ఆనంద = సంతోషపు; బాష్పజలంబులు = కన్నీళ్ళు; పులకరంబులున్ = పలకింతలు; నెరయన్ = వ్యాపించగా; దండప్రణామంబు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; ఇట్లు = ఇలా; అని = అని; విన్నవించె = మనవిచేసెను.

భావము:
బలి చక్రవర్తి తన తాత రాక గమనించినా, వరుణపాశాలతో కట్టివేయబడి ఉన్నందు వలన, అతడు ప్రహ్లాదుడికి నమస్కారం చేయడానికి వీలుకాలేదు. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్ళు పొంగాయి; అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు; వినయంగా తలవంచి తాతకు మ్రొక్కు చెల్లించాడు. అప్పుడు, ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడూ మొదలైన వారితో కూర్చున్న వామనదేవుని చూసాడు; సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి; ఒడలు పులకరించింది; అతడు స్వామికి సాగిలబడే నమస్కరించి ఇలా మనవి చేసాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=651

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

శ్రీ విష్ణు సహస్రనామ స్రోత్రము:

శ్రీ  విష్ణు సహస్రనామ స్రోత్రము:

పూర్వ పీఠికా:
శుక్లాంబరధరం  విష్ణుం శశివర్ణం చతుర్బుజమ్ ।
ప్రసన్న వనం ద్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ।।


వ్యాసం వశిష్ట  నప్తారం శక్తేపౌత్రమ కల్మషం ।
పరాశరాత్మజం వంన్దే  శుకదాతం తపోనిధిం।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే।
నమోవై బ్రహ్మనిధయే వాశిష్టాయ నమో నమ: ।।
అవికారాయ  శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే।
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే।। 
                 
యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంథనాత్।
విముచ్యతే నమ   స్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే।।
ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే....

శ్రీ వైశంపాయన ఉవాచ:
శ్రుత్వాధర్మా నశేషేణ పావనాని చ సర్వశః ।
యుథిష్టరః శాన్తనవం పునరే వాభ్యభాషిత।।

యుధిష్టర ఉవాచ:
కిమేకం  దైవతం లోకే కింవాప్యేకం   పరాయణం।   
స్తువంతః కంకమర్చన్తః ప్రాప్నుయుర్మానవా శ్శుభమ్।।              
కో థర్మ స్సర్వ థర్మాణాం భవత: పరమో మత:।
కింజప న్ముచ్యతే జంతు ర్జన్మ సంసార భంధనాత్।।

శ్రీ భీష్మ ఉవాచ:
జగత్ర్పభుం దేవదేవ మనతం పురుషోత్తమం।      
స్తువన్నామ సహస్రేణ  పురుష స్సతతోత్థిత:।।
తమేవ చా ర్చయన్నిత్యం సర్వ లోక మహేశ్వరం।
లోకధ్యక్షం స్తువన్నిత్యం  సర్వదు:ఖాతి గో భవేత్।।
బ్రహ్మణ్యం సర్వ థర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనమ్।
లోకనాధం  మహద్భూతం సర్వభూత భవోద్భవమ్।।
ఏషమే సర్వథర్మాణాం థర్మోధికతమో మత:।।
యద్భక్తా పుండరీకాక్షం స్తవైరర్చే న్నరస్సదా।।    
పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప:।।
పరమం  యో మహద్భ్రహ్మ పరమం య: పరాయణమ్।।
                       
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ  మంగళం 
దైవతం  దైవతానాంచ  భూతానాం యో వ్యయ: పిత:।।                  
యత  స్సర్వాణి భూతాని భవన్తాది  యుగాగమే।              
యస్మింశ్చ  ప్రళయం  యాంతి పునరేవ  యగక్షయే।।              
తస్య లోక ప్రధానస్య జగన్నాధస్య భూపతే।
విష్ణోర్నామ   సహస్రం   మే శృణు పాప భయా పహమ్।।
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన:।
ఋషిభి: పరి గీతాని తాని వక్ష్యామి భూతయే।।
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదోవ్యాసో మహాముని:।
ఛందో నుష్టు ప్తథా దేవో భగవాన్ దేవకీ సుత:
 
అమృతాం శూద్బవో  బీజం శక్తి ర్దేవకీ నందన:
త్రిసామా హృదయం  తస్య శాంత్యర్ధే వినియుజ్యతే।।
      
విష్ణుం జిష్ణుం మహా విష్ణుం ప్రభు విష్ణుం మహేశ్వరం।
అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్।।
 
అస్య శ్రీ విష్ణోర్థివ్య సహస్ర నామ స్తోత్ర మహామంత్రస్య
శ్రీ వేదో వ్యాసో భగవానృషి:, అనుష్టుప్ ఛంద:, శ్రీ మహావిష్ణు:, పరమాత్మా శ్రీమన్నారాయణోదేవతా,  అమృతాంశూద్బవో, భానురితి భీజమ్, దేవకీ 
నందన స్రష్టేతి శక్తి:,  ఉద్భవ:, క్షోభణో దేవ ఇతి పరమోమంత్ర:,
శంఖబృన్నందకీ చక్రీతి కీలకమ్, శార్ ఙ్గధన్వా గదాదర ఇత్యస్త్రం,
రధాఙ్గపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్,త్రిసామా సామగ స్సామేతీ కవచం,
ఆనందం పరబ్రహ్మేతియోని:, ఋతు సుదర్శన:,కాల ఇతి దిగ్బంధ:,
శ్రీ మహావిష్ణు ప్రీత్యర్ధే సహస్ర నామ స్తోత్ర జపే  వినియోగ:

ధ్యానం:
క్షీరోదన్వత్ర్పదేశే శుచిమణి  విలశత్ సైకతే మౌక్తికానాం
మాలాక్లప్తసనస్థః స్పటిక మణినిభైర్మౌక్తికై ర్మండితాఙ్గః
శుభ్రై రభ్రైరదభ్రై రుపరి విరచితై ర్ముక్త పీయూషవరైః
ఆనన్దీ నః పునీయాదరినళిన గద శఙ్ఖ పాణి ర్ముకుందః।।
భూః పాదౌ యస్య నాభి ర్యియ దసు రనిల శ్చంద్ర సూర్యౌచ నేత్రే
కర్ణా వాశా శిరో ద్యౌ ర్ముఖమపి దహనో యస్య వాసోయమబ్దిః
అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణు మీశం నమామి।।
శాన్తాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాఙ్గం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవ భయహరం సర్వ లోకైక నాథం||
మేఘ శ్యామం పీత కౌశే య వాసం  శ్రీవత్సాఙ్గమ్ కౌస్తుభోద్భాసితాంఙ్గమ్ పుణ్యోపేతం పుండరీకాయతాక్షం- విష్ణుం వందే సర్వలోకైక నాథమ్||
సశంఙ్ఖచక్రం సకిరీట కుండలం- సపీత  వస్త్రం సరసీరు హేక్షణమ్
సహార వక్షస్స్థలశోభి కౌస్తుభం-నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్।।
చాయాయం పారిజాతస్య హేమ సింహాస నోపరి
ఆసీనం అంబుద శ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం
రుక్మిణీ  సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే।।  

                  ఇతి పూర్వ పీఠికా
           --------------------------

శ్రీ విష్ణు సహస్ర నామ ప్రారంభః
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ర్పభుః।
భూతకృ ద్భూతభృ  ద్భావో  భూతాత్మ భూతభావనః।
పూతాత్మా పరమాత్మ చ ముక్తానాం పరమా గతిః।
అవ్యయః పురుష సాక్షి క్షేత్రఙ్ఞో క్షర ఏవచ।।
యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషోత్తమః।
నారసింహపు శ్ర్శీమాన్ కేశవః పురుషోత్తమహః।।
సర్వ శర్వ శ్శివ స్థాణు  ర్భూతాది ర్నిధి రవ్యయః।
సంభవో భావనో భర్తా ప్రభువః ప్రభు రీశ్వరః।।
స్వయమ్భూః శమ్భు రాదిత్యః పుష్కరాక్షో మహస్వనః।
అనాది నిథనో ధాత విధాత  ధాతు రుత్తమః
అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః।
విశ్వకర్మా మను స్త్వష్ఠా స్థవిరో దృవః। 
అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః।
ప్రభూత  స్త్రీక కుభ్ధామ పవిత్రం మంగళం పరమ్।
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ  శ్ర్శేష్ఠః ప్రజాపతిః।।
హిరణ్య గర్భో భూగర్భో మాథవో మధుసూధనః।
ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావీ విక్రమః క్రమః।
అనుత్తమో ధురాధర్షః కృతఙ్ఙః కృతి రాత్మవాన్।।
సురేశ  శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః।
అహ స్సంవత్శరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః।
అజ  సర్వేశ్వర  స్సిధ్ధ సిధ్ధిస్సర్వాధి రచ్యుతః।
వృషాకపి రమేయాత్మా స్సర్వయోగ వినిస్సృతః।।
వసు ర్వసుమనా స్సత్య స్సమాత్మా సమ్మిత స్సమః।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః।।
రుద్రో బహుశిరా బభ్రు రిశ్శయోని శ్శుచిశ్రవః।
అమృత శ్శాశ్వత స్థాణు ర్వరారోహో మహాతపః।।
సర్వగ సర్వ విధ్భను ర్విష్వక్సేనో జనార్ధనః।
వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్కవిః।।
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో థర్మాథ్యక్షః కృతాకృతః।
చతురాత్మా చతుర్వూహ శ్చతుర్దంష్ఠ్ర   చతుర్భుజః
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదా దిజః।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః।।
ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘ శ్శుచి రూర్జితః।
అతీంద్రయో మహామాయో మహోత్సాహో మహాబలః।।
మహాబుధ్ధి  ర్మహావీర్యో  మహాశక్తి ర్మహాద్యుతిః।
అనిర్ధేశ్యపు శ్ర్శీమాన్ నమేయాత్మ మహాథ్రిధృత్।।
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః।
అనిరుద్ధ  సురానందో గోవిందో గోవిందాం పతిః ।।
మరీచి ర్ధమనో హంస స్సువర్ణో భుజగోత్తమః।
హిరణ్య నాభ స్సుతపాః పద్మనాభః ప్రజాపతిః।।
అమృత్యు  స్సర్వదృక్సింహ స్సన్ధాతా సన్ధిమాన్ స్థిరః।
అజో దుర్మర్సన శ్శాస్థా విశ్రుతాత్మా సురారిహా।।
గురు ర్గురుత్తమో ధామ సత్య స్సత్య పరాక్రమః।
నిమిషో నిమిప స్ర్సగ్వీ  వాచస్పతి రుదారథీః।।
అగ్రనీ ర్గ్రామణీ శ్ర్శీమా న్న్యాయోనేతా సమీరణః
సహస్రమూరాధ  విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్।।
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః।
అహ  స్సంవర్తకో వహ్ని రనిలో ధరణీధరః।।
సుప్రసాదః ప్రసన్నాత్మావిశ్వసృడిశ్వభు గ్విభుః।
సత్కార్తా సత్కృత స్సాధు ర్జహ్ను నారాయనోనరః।।      
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ఠ కృ చ్ఛుచిః।
సిద్ధార్ధ స్సిధ్ధ సంకల్పః సిథ్ధిద స్సిథ్దిసాథనః।।
వృషాహీ వృషభో విష్ణు ర్వృషపర్వా వృషోధరః।
వర్దనో వర్దమానశ్చ వివిక్త శ్వృతిసాగరః।।                
సుభుజో దుర్ధరో వాగ్మీమహేంద్రో వసుధో వసుః।         
నైకరూపో బృహద్రూపః శిపివిష్ఠః ప్రకాశనః।।             
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మ ప్రతాపనః।
బుద్ధ స్పష్ఠాక్షరో మంత్ర శ్ఛంద్రాంశు ర్భాస్కరద్యుతిః।।      
అతుల శ్శరభో భీమ స్సమయఙ్ఞో హవిర్షరిః।
సర్వ లక్షణ లక్షణ్యో  లక్ష్మివాన్  సమితింజయః।।         
విక్షరో రోహితో మార్గో హేతు ర్ధామోదర స్సహః।
మహీదరో మహాభాగో వేగవా నమితాశనః।
ఉద్భవః  క్షోభణో ధేవః శ్రీగర్భః పరమేశ్వరః।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః।।
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః।
పరర్ధిః పరమస్పష్ఠ స్థుష్ఠః పుష్ఠ శుభేక్షణః।।
రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః।
వీరశ్శ మతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః।।
వైకుంఠః  పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః।
హిరణ్యగర్భో  శ్శతృఘ్నో వ్యాప్తోవాయు రదోక్షజః।।            
ఋతు సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః।
ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వ దక్షిణః
విస్తార స్థావరో స్థాణుః ప్రమాణం బీజ మవ్యయం।
అర్థోనర్థో మహాకోశో మహాభాగో మహాధనః।
అనిర్వణ్ణ స్థవిష్ణోభూ ర్థర్మ యూపో మహాజనః।
నక్షత్ర నేమి ర్నేమిత్రీ క్షమః క్షామ స్సమీహనః।।
యఙ్ఞ ఇజ్యోమహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాగతిః।
సర్వ దర్శీ విముక్తాత్మా సర్వఙ్ఞో ఙ్ఞాన ముత్తమమ్।।                
సువ్రత స్సుముఖ సూక్ష్మః సుఘోష స్సుఖద స్సుహృత్।
మనోహరో జితక్రోధో వీరభాహు ర్విధారణః।।
స్వాపనో స్సవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మ కృత్।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో థనేశ్వరః।।                        
ధర్మగు బ్దర్మకృద్దర్మీ సదసత్ క్షరమక్షరమ్।
అవీఙ్ఞాతా సహస్రాంశు ర్విధాతా కృతలక్షణః।।                        
గభస్తి నేమి స్సత్త్వస్థ స్సీంహో భూతమహేశ్వరః।
ఆది దేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః।।                            
ఉత్తరో గోపతి ర్గోప్తా ఙ్ఞానగమ్యః పురాతనః।
శరీర  భూత భృ ద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః।                        
సోమపోమృతప స్సోమః పురుజి త్పురుసత్తమః।
వినయో జయ స్సత్యసంథో దాశార్హ స్సాత్వతాంపతి।                  
జీవో  వినయతా సాక్షి ముకుందో మిత విక్రమః
అంభోనిధి రనంతాత్మ మహోదథి శయోంతకః।।                   
అజో మహార్ష స్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః
ఆనందో నందనో నంద స్సత్యధర్మా తివిక్రమః।।                     
మహర్షిః కపిలాచార్యః కతఙ్ఞో మేదినీషతిః।
త్ర్రిపద స్త్రీదశాధ్యక్షో మహాశృంగః కృతాంత కృత్।।                    
మహా వరాహో గోవింన్ద స్సుషేణః కనకాంగదీ।
గుహ్యో గభీరో గహనో గుప్త శ్చక్రగదాథరః।।                        
వేధాస్స్యాంగో జితః కృష్ణో దృఢ స్సఙ్కర్షణో చ్యుతః।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః।                    
భగవాన్ భగ హా నందీ  వనమాలీ హలాయుధః।
ఆదిత్యో జ్యోతిరాదిత్యో స్సహిష్ణు ర్గతి సత్తమః।।                     
సుధన్వా ఖణ్ణ పరశు ర్దారుణో ద్రవిణ ప్రదః।
దివిస్సృ క్సర్వదృ గ్వ్యాసో వాచస్సతి రయోనిజః।।                 
త్రిసామ సామగ స్సామః నిర్వాణం భేషజో (భేషజం) భిషక్।
సన్న్యాసకృ చ్చమ శ్శాన్తో నిష్ఠా శాంతిః పరాయణః।।                 
శుభాంగ    శ్శాంతిద స్స్రష్ఠా కుముదః కువలేశయః।
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో  వృషప్రియః।।                       
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్చివః।
శ్రీవత్సవక్షా శ్ర్శీవాస  శ్ర్సీపతిః  శ్రీమతాంవరః।                        
శ్రీద శ్రీశ శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః।
శ్రీధర శ్రీకరః శ్రేయ  శ్ర్శీమాన్ లోకత్రయాశ్రయః।                      
స్వక్ష స్స్వఙ్గ శ్శతానందో నంది ర్జోతి ర్గణేశ్వరః।
విజితాత్మ విధేయాత్మా సత్కీర్తి  శ్చిన్నసంశయః।।                  
ఉధీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః।
భూశయో భూషణో భూతి ర్విశోక  శ్శోక నాశనః                         
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మ విశోథనః।
అనిరుద్దో ప్రతిరధః ప్రద్యుమ్నో మితవిక్రమః।।                        
కాలనేమి నిహా వీరా శ్శౌరి శ్శూరజనేశ్వరః।
త్రీలోకాత్మ త్రిలోకేశః కేశవః కేశిహా హరిః।।                            
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః।
అనిర్దేశ్యవపు ర్విష్ణు ర్వీరో నంతో ధనుంజయః।।                    
బ్రహ్మణ్యో బ్రహ్మ కృ  ద్ర్భహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్దనః।
బ్రహ్మవి  ద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మఙ్ఞో బ్రాహ్మణ ప్రియః।।            
మహాక్రమో మహాకర్మా మహాతేజా  మహారగః।
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః।।                
స్తవ్య స్స్తవ్య ప్రియ స్తోత్రం స్తుత స్త్సోతా  రణప్రియః।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్య కీర్తి రనామయః।।                 
మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రియః।
వసుప్రదో వాసుదేవో వసు ర్వసుమనా హవిః।।                     
సద్గతి సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః।
శూరసేనో యదుశ్రేష్ట స్సన్నివాస స్సుయామనః।।                  
భూతవాసో వాసుదేవః సర్వాసునిలయో నలః।।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాప రాజితః।।                      
విశ్వమూర్తి ర్మహామూర్తి ర్ధీపమూర్తి రమూర్తిమాన్।
అనేక మూర్తి రవ్యక్త శ్శతమూర్తి  శ్శతాననః।।                       
ఏకోనైక స్సవః కః కిం యత్త త్పదమనుత్తమమ్।
లోకబంధు లోకనాథో మాథవో భక్త వత్సలః।।                       
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చందనాఙ్గదీ।
వీరహా విషమ  శ్శూన్యో ఘృతాశీ రచల శ్చల।।                      
అమానీ మానదో మాన్యో లోకస్వామీ  త్రిలోకదృత్।
సుమేధో మేధజో థన్య స్సత్యమేథా ధరాధరః।।                      
తేజో వృషో ద్యుతిధర స్సర్వ శస్త్ర భృతాం వరః।
ప్రగ్రహో నిగ్రహో వగ్రో నైకశృంగో గదా గ్రజః।।                       
చతుర్మూర్తి  శ్చతుర్భాహు శ్చతూర్వూహ శ్చతుర్గతిః।
చతురాత్మా చతుర్భావ శ్చతుర్వేద వి దేకపాత్।।                   
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతి క్రమః।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా।                      
శుభాంగో లోకసారంగ  స్సుతంతు స్తంతువర్థనః।
ఇంద్ర కర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః।।                     
ఉద్భవ స్సున్దర స్సుందో రత్ననాభ స్సులోచనః।।
అర్కో వాజసన శ్శృంగీ జయంత స్సర్వవిజ్జయీ।।                   
సువర్ణ బిందు రక్షోభ్య స్సర్వ వాగీశ్వరేశ్వరః।
మహాహ్రదో మహాగర్తో మమాభూతో మహానిథిః।।                     
కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః।
అమృతాంశో మృతవపు స్సర్వఙ్ఞ స్సర్వతోముఖః।।                    
సులభ స్సువ్రత స్సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః।
న్యగ్రోధో ధుంబరో శ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః।।                      
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః।
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః                           
అణు ర్భృహత్కృవః స్తూలో గుణభృ న్నిర్గుణో మహాన్।
అధృతః స్వథృత స్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః।                       
బారభృ త్కథితోయోగీ యోగీశః సర్వకామదః।
ఆశ్రమః శ్రమణః క్షామః సువర్ణో వాయువాహనః।।                      
ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః।
అపరాజిత స్సర్వ సహో నియంతా నియమో యమః
సత్త్వవాన్ సాత్త్విక స్సత్య స్సత్యధర్మ పరాయణః
అభిప్రాయః ప్రియార్హోర్హః పియకృ త్ర్పీతి వర్ధనః।।                          
విహాయసగతి ర్జోతి స్సురుచి  ర్హుతభు గ్విభుః।।
రవి ర్విలోచన స్సూర్యః సవితా రవి లోచనః।।                            
అనంతో హుతభు గ్భోక్తా సుఖదో నైకదో గ్రజః।
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః।।                            
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః।
స్వస్తిద స్స్వస్తికృ త్స్వస్తి స్వస్తిభు క్స్వస్తిదక్షిణః।।                          
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమూర్జిత శాసనః।
శభ్ధాతిగ శ్శబ్ధసహ శ్శిశిర శ్శర్వరీకరః।।                                    
అక్రూరః పేశలో దక్షో ధక్షిణః క్షమిణాం వరః।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్ర్శవణ కీర్తనః।।                                
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః।
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్తితః।।                                 
అనంత రూపో నంతశ్రీర్జితమన్యుర్బయాపహః।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః।।                               
అనాది ర్బూర్బువో లక్ష్మి స్సువీరో రుచిరాంగదః
జననో జన జన్మాది ర్బీమో భీమ పరాక్రమః।।                             
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః।
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః।।                               
ప్రమాణం ప్రాణ నిలయః ప్రాణదృ త్ర్పాణజీవనః।
తత్త్వం తత్వవి దేకాత్మా జన్మ మృత్యు జరాగతిః।।                          
భూర్భువస్స్వస్తరు  స్తార స్సవితా ప్రపితా మహః
యఙ్ఞో  యఙ్ఞపతి ర్యజ్వా యఙ్ఞాంగో యఙ్ఞవాహనః।।                        
యజ్ఞభృ ద్యజ్ఙకృ ద్యజ్ఞీ యజ్ఞభు గ్యజ్ఞసాధనః।
యజ్ఞాంతకృ ద్యజ్ఞ గుహ్య మన్నమన్నాద ఏవచ।।                         
ఆత్మయోని స్వయం జాతో వైఖాన స్సామగాయనః।
దేవకీ నందన స్స్రష్ఠా క్షితిశః పాపనాశనః।।
శఙ్ఖభృ న్నందకీ చక్రీ శార్ ఙ్గధన్వా గదాధరః।।
రథాంగ పాణి రక్షోభ్య  స్సర్వ ప్రహరణా యుధః।।
శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి
వనమాలి గదీ శార్ ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ।
శ్రీమన్నారాయణో విష్ణు ర్వాసుదేవో భిరక్షితు।।

ఉత్తర పీఠికా:
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః।
నామ్నాం సహస్రం దివ్యానా మశేషేణ పరికీర్తితమ్।
య ఇదం శృణుయా న్నిత్యం యశ్చాపి పరి కీర్తియేత్।
నా శుభం ప్రాప్నుయాత్కించి త్సో ముత్రేహ చ మానవః
వేదాంతగో భ్రాహ్మణస్యాత్ క్షత్రియో విజయీభవేత్।
వైశ్యో ధన సమృద్దస్స్య చ్చూద్ర సుఖ మ వాప్నుయాత్।।
ధర్మార్ధీ ప్రాప్నుయా ధ్ధర్మ మర్ధార్ధీచార్ధ మాప్నుయాత్
కామానవాప్ను యాత్కామీ ప్రజార్ధీ చాప్నుయా త్ర్పజాః।
భక్తిమాన్ యస్య దోత్థాయ శుచి స్తద్గతమానసః।
సహస్రం వాసుదేవస్య నామ్నామేత త్ప్ర కీర్తయేత్।।
యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్య మేవ చ।।
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నో త్యనుత్తమమ్।।
న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విందతి।
భవ త్య రోగో ద్యుతిమా న్బలరూప గుణాన్వితః।।
రోగార్తో ముచ్యతే రోగాద్భద్దో ముచ్యేత బందనాత్।
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః।।
దుర్గా ణ్య తితిర త్యాసు  పురుషః పురుషోత్తమమ్।
స్తువ న్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః।
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః।
సర్వపాప విశుద్దాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్।।
న వాసుదేవ భక్తాన మశుభం విద్యతే క్వచితే।
జవ్మ మృత్యు జరావ్యాధి భయం నాపుపజాయతే।।
ఇమం స్తవ మధీయాన శ్శ్రధ్ధాభక్తి సమన్వితః
యుజ్యే తాత్మ సుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః।।
న క్రోథో నచ మాత్సర్యం నలోభో నాశుభా మతిః।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే।।
ద్యౌ స్శచంద్రార్క  నక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః।।
ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం।
జగద్వశే వర్తతే దః కృష్ణస్య సచరాచరం।।
ఇంద్రియాణి మనోబుధ్ది సత్త్వం తేజో బలం ధృతిః।।
వాసుదేవాత్మ కాన్యాహుః  క్షేత్రం క్షేత్రఙ్ఞ ఏవ చ।।
సర్వాగమనా మాచారః ప్రథమం పరికల్పితః।
ఆచారః ప్రభవో ధర్మో  ధర్మస్య ప్రభురచ్యుతః।।
ఋషయః పితరో దేవాః మహాభుతాని ధాతవః।
జఙ్గ మా జఙ్గమం చేదం జగ న్నారాయణోదభవమ్।।
యోగో జ్ఙానం తధా సాంఖ్యం విద్యా శిల్పాదికర్మ చ।
వేదా శ్శాస్తాణి విజ్ఞాన మేతత్సర్వం జనార్ధనాత్।।
ఏకో విష్ణుర్మహద్బూతం పృథగ్భూతా న్యనేకశః।
త్రీన్లోకాన్వ్యాప్య భూతాత్మ భుజ్కై విశ్వభుగవ్యయః।।
ఇమం స్తవం భగవతో విష్ణో ర్వ్యాసేన కీర్తితమ్।
పఠేద్య ఇచ్చే త్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ।।
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభు మ వ్యయం।
భవంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్।।
న తే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి
అర్జన ఉవాచ:
పద్మ పత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ।
భక్తానా మను రక్తానాం త్రాతా భవ జనార్థన।।

శ్రీ భగవానువాచ:
యోమాం నామ సహస్రేణ స్తోతుమిచ్చవి పాండవ।
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః।।
స్తుత ఏవ న సంశయః ఓమ్ నమ ఇతి.

వ్యాస ఉవాచ:
వాసనా ద్వాసుదేవశ్య వాసితం తే జగత్త్రయమ్।
సర్వభూత నివాసోసి వాసుదేవ నమో స్తుతే।।
శ్రీవాసు దేవ నమోస్తుత ఓమ్నమ ఇతి

పార్వత్యువాచ:
కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం।
పఠ్యతే పండితై ర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రబో।।

ఈశ్వర ఉవాచ:
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే।।
శ్రీరామ రామ నామ వరాననే ఓమ్ నమయిత

బ్రహ్మోవాచ:
నమో స్త్వనంతాయ సహస్రమూర్తయే.. సహస్ర పాదాక్షి శిరోరు బాహవే।
సహస్ర నామ్నేపురుషాయ శాశ్వతే.. సహస్ర కోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి

శ్రీ భగవా నువాచ:
అనన్యాశ్చింతయంతో మాం యే జానాః పర్యుపాసతే ।
తేషాం నిత్యా భి యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్।
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం।
ధర్మ సంస్థాపనార్థయ సమ్భవామి యుగే యుగే ।।
ఆర్తా విషణ్ణా శిథ్ధిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః।
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా స్సుఖినో భవంతి ।।
కాయేన వాచ మనసేన్ధ్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ।।

యదక్షర పదభ్రష్ఠం మాత్రాహీనంతు య ద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ।।

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనిక పర్వణి మోక్ష ధర్మే భీష్మ యుధిష్ఠర సంవాదే శ్రీవిష్ణోర్ధివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం...


శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...