Thursday, 11 January 2018

ద్వారక అస్తమయం - 19

11-83-క.
సుర గరుడ ఖచర విద్యా
ధర హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌
సరసిజనయనునిఁ గనుఁగొన
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌.
11-84-క.
కని పరమేశుని యాదవ
వనశోభిత పారిజాతు వనరుహనేత్రున్‌
జనకామిత ఫలదాయకు
వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌.


భావము:
“ఓ రాజా! శ్రద్ధగా విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు మునులు పద్మాక్షుడు శ్రీకృష్ణుని చూడడానికి మిక్కిలి సంతోషంగా ద్వారకా పట్టణానికి వచ్చారు. అలా వచ్చి దర్శించుకుని, యాదవవంశం అనే ఉద్యానవనంలో ప్రకాశించే పారిజాతం వంటివాడు, జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు.:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:

Post a Comment

శ్రీకృష్ణ లీలావిలాసం - 93

10.1-600 -సీ. నీ పాదములు సోఁకి నేడు వీరుత్తృణ;  పుంజంబుతో భూమి పుణ్య యయ్యె నీ నఖంబులు దాఁకి నేడు నానాలతా;  తరుసంఘములు గృతార్థంబు లయ్యె ...