Monday 5 March 2018

నీలకంఠ వైభవం - 20

8-239-మ.
అమరన్ లోకహితార్థమంచు నభవుం "డౌఁగాక" యం చాడెఁ బో
యమరుల్ భీతిని "మ్రింగవే" యనిరి వో యంభోజగర్భాదులుం
దముఁ గావన్ హర! "లెమ్ము లెమ్మనిరి" వో తాఁజూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్.
8-240-వ.
అనిన శుకుం డిట్లనియె.

భావము:
“భయం చెంది అమరత్వం కోరుతున్న దేవతలు హాలాహలాన్ని “మ్రింగు” అని కోరారే అనుకో! పద్మం గర్భంలో పుట్టిన బ్రహ్మదేవుడు మున్నగువారు తమను కాపాడటానికి “పూనుకోవయ్యా హరా!” అని వేడుకున్నారే అనుకో! ఆ పరమ శివుడు లోకాలకు మేలు జరుగుతుంది కదా అని “సరే” అన్నాడే అనుకో! తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుడు ఆది అన్నది లేని వాడు కావచ్చు అనుకో, అయనా పార్వతీ దేవి కంటి ఎదురుగా భయంకరమైన అగ్ని జ్వాలలతో కూడిన హాలాహలాన్ని చూస్తూ, “మ్రింగు” అని ఎలా చెప్పిందయ్యా?”. ఇలా అడిగిన పరీక్షిత్తుతో శుకముని ఇలా అన్నాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=31&padyam=239

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...