Friday, 10 August 2018

శ్రీకృష్ణ లీలలు - 61

10.1-398-క.
ముక్తులరై నారాయణ
భక్తులరై పరమసాధుభావ శ్రీ సం
సక్తులరై సురలోక
వ్యక్తుల రయ్యెదరు నాదువాక్యము కతనన్."


భావము:
ఈ నా శాప విమోచన అనుగ్రహం వలన, ఆ యశోదానందనుని పాదారవిందస్పర్శతో విముక్తులు అవుతారు; ఆ విధంగా ముక్తులై, శ్రీమన్నారాయణుని భక్తులై సత్ప్రవర్తన యందు ఆసక్తి కలవారై మళ్ళీ దేవలోకంలో ప్రవేశిస్తారు.": : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:

Post a Comment

శ్రీకృష్ణ లీలావిలాసం - 72

10.1-565 -క. జలచర మృగ భూసుర నర కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్ జెలిమిని సుజనుల మనుపను దలపోయఁగ రాదు నీ విధంబు లనంతా! 10.1-566 -ఆ. ...