Sunday 13 May 2018

శ్రీకృష్ణ లీలలు - 8

10.1-300-క.
తన యీడు గోపబాలురు
తనుఁ గొలువఁగ రాముఁ గూడి తనువు గలుగుచుం
దను గమనంబులఁ గృష్ణుఁడు
తనుమధ్యలు మెచ్చ నీల తనురుచి మెఱసెన్.
10.1-301-వ.
మఱియు నా కుమారుండు దినదినంబునకు సంచార సంభాషణ దక్షుండై.

భావము:
బాలకృష్ణుడు అన్న బలరామునితో చిన్నచిన్న అడుగులు వేస్తూ ఆడుకుంటు ఉంటే, తన యీడు గల గొల్లపిల్లవాళ్ళు అతని చుట్టూ చేరి ఆడుకునేవారు. అతడే తమ నాయకుడు అన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. చల్లని వర్తనలు చూసి మందలోని మగువలు చూసి మెచ్చుకునే అతని నీల దేహకాంతి మెరుస్తున్నది.ఆ కృష్ణ బాలకుడు రోజురోజు నడవటం, మాట్లాడటం వంటి కొత్త విద్యలు చక్కగా నేర్చుకున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=39&padyam=300

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...