Sunday 24 February 2019

శ్రీకృష్ణ లీలలు - 1

10.1-611-వ.
అ య్యవసరంబున శ్రీదామ నామధేయుం డయిన గోపాలకుండు రామకేశవులం జూచి యిట్లనియె.
10.1-612-క.
దూరంబునఁ దాలతరు
స్ఫారం బగు వనము గలదు; పతితానుపత
ద్భూరిఫలసహిత మది యే
ధీరులుఁ జొర వెఱతు రందు ధేనుకుఁ డుంటన్.

భావము:
అలా విహారాలు చేసేటప్పుడు ఒకసారి, శ్రీరాముడు అనే పేరు గల గోపబాలుడు బలరామ కృష్ణులను చూసి ఇలా అన్నాడు.  “ఇక్కడ నుంచి చాలా దూరంలో తాడిచెట్లతో నిండిన వనము ఒకటి ఉంది. అక్కడ ఎన్నో పెద్ద పెద్ద తాటిపండ్లు ఒకదాని వెంట మరొకటి పండి రాలుతూ ఉంటాయి. కానీ అందులో ధేనుకుడు అనే రాక్షసుడు ఉండడం వలన, ఎంత ధైర్యం కలవారు అయినా ఆవనంలో ప్రవేశించడానికి జంకుతుంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=612

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...