Wednesday 18 June 2014

మధురా నగరిలో చల్లనమ్మబోదు...

రచన: శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై.
రాగం: ఆనంద భైరవి.
తాళం: ఆది.

పల్లవి:
మధురా నగరిలో చల్లనమ్మబోదు
దారి విడుము కృష్ణా! కృష్ణా!    ||మధురా||

అనుపల్లవి:
మాపటి  వేళకు తప్పక వచ్చెద
పట్టకు కొంగు గట్టిగాను కృష్ణా!కృష్ణా! ||మధురా||

చరణం-1:
కొసరి కొసరి నాతొ సరసములాడకు
రాజమార్గమిది కృష్ణా!కృష్ణా!  ||మధురా||

చరణం-2:
బ్రజ వనితను నను చేరవద్దురిక
విడు విడు నా చెయి కృష్ణా!కృష్ణా! ||మధురా||

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...