Wednesday 24 September 2014

దేవీ శరన్నవరాత్రులు

శ్రీ దేవీ శరన్నవరాత్రులు:

రేపటి నుండే శ్రీ దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి..(25-9-2014 నుండి 4-10-2014 వరకు)

ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వీయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి, శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన
దేవీకవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది.అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.

మొదటి రోజు శ్రీ శైలపుత్రీ దేవి
రెండవనాడు శ్రీ బ్రహ్మచారిణీ దేవి
మూడవనాడు శ్రీ చంద్రఘంటా దేవి
నాల్గవనాడు శ్రీ కూష్మాండ దేవి
ఐదవనాడు శ్రీ స్కందమాత
ఆరవనాడు శ్రీ కాత్యాయినీ దేవీ
ఏడవనాడు శ్రీ కాళ రాత్రి దేవి
ఎనిమిదవ నాడు శ్రీ మహాగౌరీ దేవి
తొమ్మిదవనాడు శ్రీ సిద్ధిధాత్రీ దేవి.


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...