Friday, 19 December 2014

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం

శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం, రామేశ్వరం:

తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ పట్టణమైన రామేశ్వరంలో శ్రీ సేతుమాధవ స్వామి ఆలయం ఉన్నది... పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన సేతుమాధవ స్వామి ఆలయం రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి ఆలయ ఆవరణలో ఉంది. అలాగే ఈ ఆలయాన్ని ఆనుకొని ఒక కోనేరు కూడా ఉంది. లక్ష్మీ కటాక్ష ప్రాప్తికై భక్తులు ఈ కోనేరు స్నానాలు చేస్తారు...

ఇక్కడి శ్రీ సేతుమాధవ స్వామి శ్రీ లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటాడు. ఈ సేతుమాధవ స్వామిని "శ్వేత మాధవ స్వామి" అని కూడా పిలుస్తుంటారు... ఎందుకంటే స్వామి విగ్రహం పాలరాతితో చేయబడింది కాబట్టి....

జై సేతు మాధవ.... జై శ్రీ రామ...

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...