రాగం: ఆహిరి
తాళం : ఆది
రచన: శ్రీ త్యాగరాజస్వామి
పల్లవి:
చల్లరే శ్రీ రామచంద్రునిపైన పూల ||చల్లరే||
చరణాలు:
సొంపైన మనసుతో ఇంపైన బంగారు
గంపలతో మంచి చంపకములను ||1||
పామరములు మాని నేమముతో
రామామనోహరునిపైన తామరపూల ||2||
ఈ జగతిని దేవ పూజార్హమౌ పూల
రాజిల్లుమేలైన జాజిసుమముల దెచ్చి ||3||
అమితపరాక్రమ ద్యుమణికులార్ణవ
విమలచంద్రునిపై హృత్కుముదసుమముల ||4||
ఎన్నరాని జనన మరణములు లేకుండ
మనసార త్యాగరాజనుతునిపై ||5||
No comments:
Post a Comment