రాగం: ఆనందభైరవి.
తాళం: ఆది
రచన: శ్రీ త్యాగరాజు
పల్లవి:
రామ రామ నీవారము గామా రామ సీతా
రామ రామ సాధు జన ప్రేమ రారా ।। రామ ।।
చరణములు:
1 - మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ
కరగు బంగారు సొమ్ములు కదల రారా ।। రామ ।।
2 - వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మరుగు జేసుకొనునట్టి మహిమ రారా ।। రామ ।।
3 - మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా ।। రామ ।।
4 - చిరు నవ్వు గల మోము జూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా ।। రామ ।।
5 - కందర్ప సుందరానంద కంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా ।। రామ ।।
6 - ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ
వేద్య నే నీవాడనైతి వేగ రారా ।। రామ ।।
7 - సుప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజునేల రారా ।। రామ ।।
No comments:
Post a Comment