Saturday 18 April 2015

సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మా తండ్రి!!!

రచన: శ్రీ త్యాగరాజు.
రాగం: లలిత
తాళం: రూపకం

పల్లవి:
సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి ॥  సీతమ్మ ॥

అనుపల్లవి:
వాతాత్మజ సౌమిత్రి, వైనతేయ రిపు మర్దన
ధాత భరతాదులు సోదరులు మాకు, ఓ మనస! ॥  సీతమ్మ ॥

చరణము:
పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతా గ్రేసరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనస!  ॥ సీతమ్మ ॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...