Thursday 12 November 2015

ద్వారక అస్తమయం - 12:

అప్పటికి ద్వారకలో ప్రయాణ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రుక్మిణి మొదలైన అష్టభార్యలు, 16 వేల భార్యలు, అంతఃపుర స్త్రీలు, ద్వారకాపుర వాసులు అందరూ పల్లకీలలోను, రధముల, బండ్ల , ఏనుగుల, అశ్వముల మొదలైన వాహనముల మీద ద్వారకను దాటడానికి సిద్ధముగా ఉన్నారు. అర్జునుడు , దారుకుడు రాగానే అందరూ కదిలారు.

అర్జునుడి నాయకత్వములో దారుకుడు అందరినీ ద్వారక నుండి ప్రయాణము చేయించాడు. శ్రీకృష్ణుడి అంతఃపుర స్త్రీలు 16 వేల మంది, 8 మంది భార్యలు, బలరాముని నలుగురు భార్యలు, పల్లకీలలో కుర్చున్నారు. వారివెంట సేవకులు నడుస్తున్నారు. వారివెంట బండ్లలో వారికి కావలసిన సామానులు తీసుకుని వెళుతున్నారు. వారి వెనుక ద్వారకాపురి వాసులు అందరూ తమతమ వాహనములు ఎక్కి వెళుతున్నారు. వారందరికి వెనుకగా అర్జునుడు తన రధము మీద బయలుదేరాడు. వారందరూ ద్వారకను దాటగానే సూర్యోదయము అయింది.

సూర్యుడు రాగానే సముద్రము ఒక్కసారిగా పొంగింది. ద్వారకానగరాన్ని సముద్రపు అలలు ముంచెత్తాయి. అర్జునుడు యాదవులు ఒక్కసారి వెనుతిరిగి చూసారు. సముద్రము ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తడము చూసి గగ్గోలుపెట్టారు. అర్జునుడి నేతృత్వములో వారంతా ఇంద్రప్రస్థము వైపు ప్రయాణము సాగించారు...... ( సమాప్తం )

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥

మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే ।
మధురాపుర నాథాయ మహాధీరాయ మంగళం ॥

ద్వారకా పుర వాసాయ హారనూపుర ధారిణే ।
దేవకీ వసుదేవాభ్యాం సంస్తుతాయాస్తు మంగళం ॥

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః......

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...