8-488-క.
నీ రమణుని సేవింపుము
నా రూపము మానసించి నళినీ! గర్భా
గారంబు వచ్చి చొచ్చెద
గారామునఁ బెంపవమ్మ కరుణన్ నన్నున్.
టీకా:
నీ = నీ యొక్క; రమణుని = భర్తను; సేవింపుము = కొలువుము; నా = నా యొక్క; రూపమున్ = రూపమును; మానసించి = మనసులో నిలుపుకొని; నళినీ = సుందరి; గర్భాగారంబున్ = గర్భాశయమును; వచ్చి = వచ్చి; చొచ్చెదన్ = ప్రవేశించెదను; గారమునన్ = గారముగా, ప్రేమతో; పెంపవు = పెంచుము; అమ్మ = తల్లి; కరుణన్ = దయతో; నన్నున్ = నన్ను.
భావము:
నా రూపాన్ని స్మరించుకుంటూ నీ భర్తను సేవించు నేను. నీగర్భంలో చేరుతాను మక్కువతోనూ కనికరంతోనూ నన్ను పెంచు తల్లీ!
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=66&Padyam=488
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment