Monday 7 March 2016

శ్రీ లింగాష్టకం....

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 1

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 2

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 3

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శొభిత లింగం
దక్ష సుయజ్ఞ నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 4

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 5

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 6

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 7

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం - 8

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.

శ్రీ శివతాండవ స్తోత్రం....

జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే
గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకారచండ తాండవం తనోతునశ్శివశ్శివం

జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,
విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;
ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.

ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,
స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,
కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,
క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని .

జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;
మదాంధ సిందురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే,
మనోవినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి.

సహస్రలోచన ప్రభృ త్యశేష లేఖ శేఖరః,
ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకః,
శ్రియైచిరాయజాయతాం చకోరబంధు శేఖరః

లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా,
నిపీత పంచసాయకం నమ న్నిలింపనాయకం;
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం,
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః.

కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,
ద్ధనంజయాహుతికృత ప్రచండపంచసాయకే;
ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ.

నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్,
త్కుహు నిశీధీనీతమః ప్రబంధ బంధకంధరః;
నిలింపనిర్ఝరీధర స్తనోతు కృత్తిసింధురః,
కలానిదానా బంధురః శ్రియం జగద్ధురంధరః.

ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,
విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;
స్మరచ్చిదం, పురచ్చిదం, భవచ్చిదం, మఖచ్చిదం,
గజచ్ఛి దంధ కచ్చిదం తమంత కచ్ఛిదం భజే.

అగర్వ సర్వ మంగళా కలాకదంబ మంజరీ,
రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం,
గజాంత కాంధ కాంతకం తమంతకాంతకం భజే.

జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫుర,
ద్ధగ ద్ధగ ద్వినిర్గ మత్కరాల ఫాల హవ్యవాట్;
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః.

దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తి కస్రజో,
ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;
తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయో,
స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్.

కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవస,
న్విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;
విముక్త లోల లోల లోచనో లలాట ఫాల లగ్నక,
శ్శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్.

ఇమం హి నిత్యమేవ ముత్త మోత్తమం స్తమం,
పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం;
హరే గురౌ సుభక్తి మాశు యాతినాన్యథా గతిం,
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్.

పూజావసాన సమయే దశ వక్త్ర గీతం,
య శ్శంభు పూజన మిదం పఠతి ప్రదోషే;
తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః.

ఇతి శ్రీ రావణ కృతం శివతాండవ స్తోత్రం సంపూర్ణం

మహాశివరాత్రి.....

07 - 03 - 2016 , సోమవారం, మాఘ బహుళ చతుర్దశి

మాఘ మాసంలో పౌర్ణమి తరువాత పద్నాల్గవ రోజున వచ్చే శివరాత్రి ఇది. ఈ రాత్రి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారు ప్రత్యేక సాధనలు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చే పన్నెండు శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఎందుకంటే అది అన్ని శివరాత్రులలో కెల్లా మహత్తరమైనది, శక్తివంతమైనది. మనలోని శక్తులు ఉప్పొంగే రాత్రి మహాశివరాత్రి!

ఒకనాడు పార్వతీదేవి శివుడితో "ప్రాణేశ! పాపం భూలోకములోని మానవులు ప్రారబ్ధ కర్మలతో చాలా బాధలను అనుభవిస్తున్నారు. ఇటువంటివారికి కఠినమయిన నియమనిష్ఠలు లేకుండా యఙ్ఞ యాగాదులు జపతపఫలములు లేని సులభతరమైన ఒక వ్రతమును తెలిపి వారికి ముక్తిని కలుగేటట్లు చేయండి" అని పార్వతి అన్నది. అప్పుడు శివుడు పార్వతితో యిలా అన్నాడు."దేవి! శివరాత్రి వ్రతము అనే వ్రతము ఒకటి ఉంది. ఆ ప్రతము సర్వ యఙ్ఞములకు సమానమయినది. ఉత్తమోత్తమయినది. ముక్తి ప్రదమైనది. దాని కథ చెబుతాను విను...

పూర్వము ఒక పర్వత ప్రాంతమున వ్యాధుడనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తెచ్చేవాడు. దానితో అతని కుటుంబము పొట్టనింపుకుంటూ ఉండేది. ఒకరోజు అతను ఎప్పటిలా అడవికి వెళ్ళాడు. అడవి అంతా తిరిగినా అతనికి ఒక్క మృగము కనపడలేదు. వట్టి చేతులతో యింటికి వెళ్ళటానికి మనసొప్పక, చేసేది లేక యింటికి బయలు దేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు కనబడింది. "ఏ మృగమైన నీరు త్రాగటానికి ఈ తటాకము దగ్గరకు రాకపోతుందా" అనే ఆశతో ఒక చెట్టుపైకి ఎక్కికూర్చున్నాడు సరస్సు వైపు చూస్తూ, అడ్డుగా ఉన్న కొమ్మలను విరిచి, ఆకులను దూసి క్రింద పడవేసి, చలికి ’శివ-శివ’ అనుకుంటూ సరస్సు వైపు చూస్తూ కూర్చున్నాడు.

మొదటి జామునకు ఒక లేడి నీరు త్రాగటానికి ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. వేటగాడు ఆనందముతో బాణము విడువబోయాడు. "వ్యాధుడా! నన్ను చంపకు " అని మానవ గొంతుతో ఆ లేడి యిలా అన్నది. "నేను గర్భిణిని. నా వలన నీ కుటుంబానికి సరిపడే భోజనము లభించదు. కాబట్టి నన్ను వదులు. కాసేపట్లో ఇంకో జింక ఇక్కడకు వస్తుంది. దాన్ని చంపు. లేకపోతే నేను వెళ్ళి బిడ్డను కని దాన్ని బంధువులకి అప్పగించి వస్తాను " అన్నది.

సరే నన్నాడు వేటగాడు. రెండవ జామునకు ఇంకో జింక కనిపించింది. మొదటి జింకే అనుకున్న వేటగాడు బాణము వేయబోగా ఆ జింక భయపడుతూ మానవ కంఠంతో "ఓ వ్యాధుడా! నా మాట విను. తరువాత
నన్ను చంపవచ్చు.నేను విరహముతో కృశించిపోయి ఉన్నాను. నాలో మాంసములు లేవు. నన్ను చంపినా
నీకు నీ కుటుంబానికి సరిపోను. కాసేపటికి బాగా బలిసిన మగజింక ఇక్కడకు వస్తుంది. దానిని చంపు. అలా కాకపోతే నేనే తిరిగి వస్తాను " అన్నది. సరేనన్నాడు వ్యాధుడు

మూడవజాము అయింది. వేటగాడు ఆకలితో జింక కోసము ఆతృతగా చూస్తున్నాడు. బలిసిన మగజింక రానే వచ్చింది. వేటగాడు దాన్ని చూసిన వెంటనే బాణము విడవబోయేంతలో మృగము వేటగాడిని చూసి, తన ప్రియురాలిని కూడా వాడే చంపి ఉంటాడని తలచింది.అయినా అడిగితే సందేహము తీరి పోతుందని " ఓ వేటగాడా! రెండు జింకలు ఇక్కడకు వచ్చాయా? అవి ఎటు పోయాయి? వాటిని నువ్వు చంపావా" అని ప్రశ్నించెను. వేటగాడు దాని మాటలకు మునుపటి లానే ఆశ్చర్యపడి రెండు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపాయి అన్నాడు. "సరే అయితే! నేను ఉదయం నీ యింటికి వస్తాను.నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి, బంధుమిత్రులతో అనుమతి పొంది నేను మళ్ళీ వస్తాను" అని అనేక ప్రమాణాలు చేసి వెళ్ళింది. ఇంతలో ఇంకొక జింక తన పిల్లలతో వచ్చింది. "వ్యాధుడా! నేను పిల్లతో వచ్చాను. దీన్ని యింటి దగ్గర వుంచి త్వరగా వస్తాను అంది. ఈ విధంగా నాలుగు జాములు గదిచిపోయాయి. సూర్యోదయం అయింది. వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూస్తూ దిక్కులు వెతకసాగడు. కొంతసేపటికి నాలుగు జింకలు వచ్చాయి. "’ నేను సిద్దంగా ఉన్నాను నన్ను చంపు’ అంటే ’నన్ను చంపు’ అని నాలుగు జింకలు వ్యాధుని ఎదుట మోకరిల్లాయి. జింకల సత్యసంధతకు వ్యాధుడు ఆశ్చర్యపడ్డాడు. వాటిని చంపుటకు అతని మనసు అంగీకరించలేదు.

వ్యాధుడికి తన హింసావృత్తి మీద తనకే అసహ్యమేసింది. "ఓ మృగములారా ! మీరు మీ నివాసములకు వెళ్ళిపొండి. నాకు మీ మాంసము అక్కర్లేదు. ఈ విధంగా మృగాలను వేటాడి బంధించి చంపి నాకుటుంబాన్ని పోషించుకోవటం పరమ నికృష్టంగా తోస్తోంది. చేసిన పాపము చేశాను. ఇక తిరిగి ఈ పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దయ చూపడం కూడా సత్యఫలమే" అన్నాడు. వ్యాధుని మాటలకు ఆకాశంలో దేవ
దుందుభులు మ్రోగాయి.పూలవాన కురిసింది. దేవదూతలు చక్కని విమానంలో వచ్చి "ఓ మహాసత్త్వుడా! ఉపవాసము , జాగరణ, శివరాత్రి ప్రభావమున వలన నీ పాపము నశించింది. నీవెక్కి కూర్చున్నది బిల్వ వృక్షము. నీకు తెలియకుండానే
జాము జామునకు బిల్వదళాలను త్రుంచి క్రింద ఉన్న స్వయంభూలింగాన్ని పూజించావు." అంటూ వారందరిని సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళారు.

ఈ కథను పరమేశ్వరుడు పార్వతిదేవికి చెప్పి "దేవి! ఆ మృగకుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రము. కనిపించు మిగిలిన మూడు నక్షత్రములలో
ముందున్నవి జింక పిల్లల్లు వెనుకకున్నది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమంటారు. వాటి వెనుక ఉజ్జ్వలంగా ఉన్నది వేటగాని నక్షత్రము. శివరాత్రితో సమానమయిన మరియొక వ్రతము లేదు’ అని తెలిపాడు భోళాశంకరుడు.

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు......

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...