Friday 22 September 2017

శ్రీ బ్రహ్మచారిణి దేవి

( ఆశ్వీయుజ శుద్ధ విదియ, గురువారం, 22 - 09 - 2017 )

దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలః |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

ఆ శక్తిస్వరూపిణి యొక్క  నవశక్తుల్లో రెండవ స్వరూపం బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అనగా తపమాచరించే తల్లి అని అర్థం. బ్రహ్మము నందు చరించునది కాబట్టి బ్రహ్మచారిణీ మాత. కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలమును ధరించే మాత పరమేశ్వరుని పతిగా పొందటానికి  తీవ్రమైన తపమొనర్చి 'ఉమ' అని ప్రసిద్ధి వహించింది.

ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. అత్యంత శుభంకరము. భక్తులకు, సిద్ధులకు అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవల్ల ఉపాసకులకు నిశ్చలమైన దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తిస్తుంది. ఈమెను ఉపాసించిన వారికి తపో,త్యాగ, వైరాగ్య సదాచరములు వృద్ధిచెందుతాయి. జీవన సంఘర్షణలోనూ వారు కర్తవ్యమును మరవరు. బ్రహ్మచారిణీ దేవి కృపవలన వారికి సర్వత్ర విజయము లభింస్తుంది.

ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యందు భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...