Wednesday 1 November 2017

పోతన రామాయణం - 27

9-309-ఆ.
ఎండఁ గాయ వెఱచు నినుడు వెన్నెలఁ గాయ
వెఱచు విధుఁడు గాలి వీవ వెఱచు
లంకమీఁద; నిట్టి లంకాపురికి మాకు
నధిప! విధవభావ మడరె నేఁడు.
9-310-క.
దురితముఁ దలపరు గానరు
జరుగుదు రెట కైన నిమిష సౌఖ్యంబుల కై
పరవనితాసక్తులకును
బరధనరక్తులకు నిహముఁ బరముం గలదే?


భావము:
నాథా! ఇప్పటి వరకూ లంక మీద సూర్యుడు గట్టిగా ఎండ కాయానికి; చంద్రుడు వెన్నెల కురిపించడానికి; వాయువు గట్టిగా వీచడానికీ జంకేవారు. అటువంటిది నేడు మాకు ఈ లంకానగరానికి వైధవ్యం కలిగింది కదే. పరభార్యాపేక్షా పరులు, పరధనాపేక్షా పరులు క్షణిక సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు. వాళ్ళు పాపం అని భావించరు. మంచిచెడ్డలు చూడరు. అలాంటి వారికి ఇహపరాలు ఉండవు కదే



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...