Thursday 2 November 2017

పోతన రామాయణం - 29

9-313-వ.
కని రామచంద్రుండును దాపంబు నొంది, భార్యవలన దోషంబు లేకుంట వహ్నిముఖంబునం బ్రకటంబుజేసి, దేవతల పంపున దేవిం జేకొని.
9-314-ఉ.
శోషితదానవుండు నృపసోముఁడు రాముఁడు రాక్షసేంద్రతా
శేషవిభూతిఁ గల్పసమజీవివి గమ్మని నిల్పె నర్థి సం
తోషణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా
భాషణు నార్యపోషణుఁ గృపాగుణభూషణు నవ్విభీషణున్.


భావము:
చూసి, శ్రీరాముడుకూడ బాధ పడ్డాడు. భార్య వలన తప్పేమీ లేదని తెలిసినా, ఆ విషయాన్ని, ఆమె మహత్వం అగ్నిముఖంగా వెల్లడి చేసాడు, దేవతల అనుజ్ఞ ప్రకారము భార్యను స్వీకరించాడు. రాక్షసులను నాశనం చేసిన శ్రీరామచంద్రుడు పాప రహితుడు, అర్థులను తృప్తిపరచువాడు, మృదుభాషి, మితభాషి, శాంతస్వభావి, పెద్దలను గౌరవించువాడు, దయాగుణశాలి అయిన విభీషణుని రాక్షసరాజ్యానికి పట్టంకట్టాడు. అంతులేని వైభవంతో కల్పాంతంవరకు చక్కగా జీవించు అని అనుగ్రహించాడు.



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...