Saturday 16 December 2017

ద్వారక అస్తమయం - 2

11-5-క.
మునివరులు సంతసిల్లిరి
యనయము నందాదులకును హర్షం బయ్యెం; 
దన నిజభక్తులు యాదవ
ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్‌.
11-6-మ.
విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్పి, దు
ర్మద సంయుక్త వసుంధరాధిపతులన్‌ మర్దించి, కంసాదులం 
దుదిముట్టన్‌ వధియించి, కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో 
యదుసైన్యంబులు భూమి మోవఁగ నసహ్యంబయ్యె నత్యుగ్రమై.


భావము:
మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు. దుర్మదాందులైన రాజులను మర్దించి, కంసుడు మొదలైనవారిని సంహరించి భూమికి బరువును తగ్గించి నందనందనుడు దేవతలందరూ తనను కొలుస్తుండగా ప్రసిద్ధుడు అయ్యాడు. అలా శ్రీకృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదుసైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్థితి వచ్చింది



:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...