Monday 28 January 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 100

10.1-613-వ.
ఆ ధేనుకాసురుండు మహాశూరుండును, ఖరాకారుండును నై సమాన సత్వసమేతులైన జ్ఞాతులుం దానును మనుష్యులం బట్టి భక్షించుచుండు; నయ్యెడఁ బరిమళోపేతంబులైన నూతన ఫల వ్రాతంబు లసంఖ్యాకంబులు గలవు; వినుఁడు.
10.1-614-క.
ఫలగంధము నాసాపుట
ముల జొచ్చి కలంచి చిత్తములఁ గొనిపోయెన్
ఫలముల నమలింపుఁడు మము; 
బలియురకును మీకు దైత్యభటు లడ్డంబే?

భావము:
ఆ ధేనుకుడు మహాబలవంతుడు వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువుల తోపాటు తాను మనుష్యులను పట్టుకుని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో కొత్త కొత్త పండ్లు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా. ఆ పండ్ల సువాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటు లాగివేస్తున్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండయ్యా. మీరు మహాబలవంతులు మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా ఏమిటి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=79&padyam=614

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...