Tuesday 1 January 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 85

10.1-587-వ.
ఆ సమయంబున.
10.1-588-క.
పెనుఁబాము దమ్ము మ్రింగిన
మన నందసుతుండు పాము మర్దించి మమున్
మనిచె నరణ్యములోపల
నని ఘోషించిరి కుమారు లా ఘోషములోన్.
10.1-589-వ.
అనిన విని నరేంద్రుం డిట్లనియె


భావము:
అప్పుడు ఆ బాలకులు గోకులంలో అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్లు కేకలు వేస్తూ “మన నందగోపకుమారుడు అడవిలో ఒక పెద్ద పాముని చంపి మమ్మల్ని అందరిని రక్షించాడు” అని చాటి చెప్పారు.” శుకయోగి అలా చెప్పగానే పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=75&padyam=588


// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...