Tuesday 8 January 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 89


10.1-595-వ.
అని చెప్పి మఱియు వ్యాసనందనుం డిట్లనియె
10.1-596-క.
రాగంబున బలకృష్ణులు
పౌగండవయస్కు లగుచుఁ బశుపాలకతా
యోగంబున బృందావన
భాగంబునఁ గాఁచి రంతఁ బశువుల నధిపా!


భావము:
ఇలా చెప్పి వ్యాసుని కుమారుడైన శుకయోగి ఇంకా ఇలా అన్నాడు. “బలరామకృష్ణులు ఈవిధంగా పౌగండ వయస్సు గల వారై అనురక్తితో పశువులను మేపుతూ గోపబాలురుతో కలసి బృందావనంలో విహరించారు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...