Friday, 11 January 2019

శ్రీకృష్ణ లీలావిలాసం - 91

10.1-598-శా.
శాఖాపుష్పఫలప్రభారనతలై చర్చించి యో! దేవ! మా
శాఖిత్వంబు హరింపు; మంచు శుకభాషన్ నీ కెఱింగించుచున్
శాఖాహస్తములం బ్రసూనఫలముల్ జక్కన్ సమర్పించుచున్
శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే.


భావము:
“అన్నా! బలదేవా! ఈ చెట్లు చూసావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూలగుత్తుల బరువుతో, పళ్ళ భారంతో వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ, నమస్కరిస్తూ ఉన్నాయి. తమ మీద వాలిన చిలుకల వాక్కులతో “ఓ దేవా! మా యీ వృక్షజన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించ” మని తమ కోరికను నీకు వివ్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు అనే చేతులతో పూవులు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్లు వరుసలు కట్టి నీ పాదపద్మాలకు చక్కగా మ్రొక్కుతూ ఉన్నాయి// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 38

3-918-సీ. "అధ్యాత్మ తత్పరుం డగు వాఁడు పెక్కు జ;  న్మంబులఁ బెక్కు కాలంబు లందు  బ్రహ్మపదప్రాప్తి పర్యంతమును బుట్టు;  సర్వార్థవైరాగ్య...