Sunday, 28 April 2019

కపిల దేవహూతి సంవాదం - 11

3-880-మ. కణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా మణిమాద్యష్టవిభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతము నప్రమేయము సమగ్రశ్రీకమున్ సర్వల క్షణయుక్తంబును నైన మోక్షపదవిం గైకొందు రత్యున్నతిన్. 3-881-వ. ఇట్లువొంది. భావము: ఆ విధంగా మోక్షాసక్తి లేనివారై కూడా వారు అణిమాది అష్టసిద్ధి సంసేవితమూ, శాశ్వతానంద సంధాయకమూ, వర్ణనాతీతమూ, మహనీయమూ, సంపూర్ణ వైభవోపేతమూ, సకలలక్షణ సమేతమూ, మహోన్నతమూ అయిన వైకుంఠధామాన్ని పొందుతారు. ఈవిధంగా పొంది... http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=880 // తెలుగులోనే మాట్లాడుకుందాం // : : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...