Tuesday 21 May 2019

కపిల దేవహూతి సంవాదం - 21


3-895-సీ.
అట్టి యహంకార మం దధిష్టించి సా; 
హస్రఫణామండలాభిరాముఁ
డై తనరారు ననంతుఁడు సంకర్ష; 
ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు
మహిత భూతేంద్రియ మానస మయుఁడు నై; 
కర్తృత్వ కార్యత్వ కారణత్వ 
ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది; 
లక్షణ లక్షితోల్లాసి యగుచు
3-895.1-తే.
నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ
ఘనవికారంబుఁ బొందు వైకారికంబు
వలన వినుము మనస్తత్వ మెలమిఁ బుట్టె
మఱియు వైకారికంబును మాత! వినుము. 

భావము:
వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=46&padyam=895

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...