Saturday, 29 June 2019

కపిల దేవహూతి సంవాదం - 49


( విష్ణు సర్వాంగ స్తోత్రం )

3-936-క.
ఘన మందరగిరి పరివ
ర్తన నికషోజ్జ్వలిత కనకరత్నాంగదముల్
దనరార లోకపాలకు
లను గలిగిన బాహు శాఖలను దలఁపఁదగున్.

భావము:
సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మెఱుగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగి లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=50&padyam=936

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...