కూష్మాండ: (ఆశ్వీయుజ శుద్ధ చవితి)
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవచ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే ॥
దుర్గామాత యొక్క నాల్గవ అవతారం కూష్మాండ, అంటే సంస్కృతంలో గుమ్మడికాయ అని అర్థం. చిరునవ్వుతో
సులువుగా బ్రహ్మాండమును సృజించునది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ సృష్టికి ముందు అంతా గాఢాంధకారం వ్యాపించి ఉండేది. అప్పుడీ దేవి కూష్మాండ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈమె శరీరం సూర్యుడితో సమమైన కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఈమే సృష్టికి ఆది శక్తి, సూర్యమండలంలో నివశింపగల విశేషమైన శక్తి సామర్థ్యాలు ఈమెకు ఉన్నాయి. కూష్మాండదేవీ సింహ
వాహనురాలు. ఎనిమిది భుజాలు కలిగి ఉంటుంది కాబట్టి అష్టభుజాదేవి అనే పేరు కూడా ఉంది. ఏడు చేతుల్లో కమండలము, బాణము, ధనస్సు, కమలం, అమృత కలశం, చక్రం, గద, ఎనిమిదో చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే అద్భుతమైన జపమాల ధరించి ఉంటుంది.
కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు. శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని
ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి
తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది.
మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది
రాజమార్గం వంటిది.
Sunday, 28 September 2014
శ్రీ కూష్మాండ మాత...
Subscribe to:
Post Comments (Atom)
శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)
( శ్రీకృష్ణ నిర్యాణంబు) 11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...
-
రచన: శ్రీ ముద్దు బాలంభట్టు గ్రంథం: మంథెన్న శ్రీ శివపురాణము జయభవాని శంకరాయ చంద్రమౌళి యేకృతాంత భయనివారణాయమాం పాహిమంగళం ||జయ జయ|| అష్టమూర్తయే ...
-
"తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ'' అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా మృత్య...
-
( శ్రీకృష్ణ నిర్యాణంబు) 11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...
No comments:
Post a Comment