Saturday 22 November 2014

కనకన రుచిరా: (పంచరత్న కృతులు)

రాగం: వరాళి.
తాళం: ఆది

పల్లవి:
కనకన రుచిరా కనకవసన! నిన్ను ॥కనకన॥

అనుపల్లవి:
దినదినమును మనసున చదువున నిన్ను
॥కనకన॥

చరణాలు:
పాలుగారు మోమున శ్రీ యపార మహిమ దనరు నిన్ను ॥కనకన॥

కలకలమను ముఖకళగలిగిన సీత
కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను ॥కనకన॥

బాలార్కాభ! సుచేల! మణిమయ మాలాలంకృత కంధర! సరసిజాక్ష! వరక పోల సురుచిర కిరీటధర! సతతంబు మనసారగ ॥కనకన॥

సాపత్నీ మాతయౌ సురుచివే కర్ణశూల మైనమాట వీనుల చురుక్కున తాళక శ్రీహరిని ధ్యానించి సుఖింపగలేదా యటు ॥కనకన॥

మృగమదలామ శుభనిటల వరజటాయు మోక్షఫలద
పవమానసుతుడు నీదు మహిమదెల్ప సీత
తెలిసి వలచి సొక్క లేదా రీతి నిన్ను ॥కనకన॥

సుఖాస్పధ విముఖాంబుధర పవన విదేహమానస
విహారాప్త సురభూజ మానితగుణాంక! చిదానంద!
ఖగతురంగ ధృతరథాంగ! పరమదయాకర!
కరుణారస వరుణాలయ! భయాపహర! శ్రీరఘుపతే!
॥కనకన॥

ప్రేమమీఱు కరముల నీదుపాదకమలము
బట్టుకొనువాడు సాక్షి రామనామ రసికుడు కైలాస
సదనుడు సాక్షి మఱియు నారద పరాశర శుకశౌనక
పురందర నగజాధరజ ముఖ్యులు సాక్షి గాద!
సుందరేశ! సుఖకలశాంబుధివాసా! శ్రితులకే
॥కనకన॥

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత! ముఖజిత కుముద! హిత! వరద! నిన్ను ॥కనకన॥

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...