Saturday 8 November 2014

పంచ మాధవ క్షేత్రాలు...

పురాణగాథ:

బ్రహ్మ కుమారుడైన ప్రజాపతి త్వష్టకు విశ్వరూపుడనే కుమారుడు జన్మించాడు. విశ్వరూపుడికి మూడు తలలు ఉండేవి మరియు ఇతడు మహాబలశాలి... కానీ ఇంద్రుడు తన పదవికి విశ్వరూపుడి వలన ప్రమాదం పొంచి ఉందని గ్రహించి అతడిని సంహరించాడు... కుమారుని మరణ వార్త విన్న త్వష్ట ఇంద్రుడి పైన పగ తీర్చుకోవడానికి ఓ యాగం నిర్వహించాడు. ఆ యాగం నుండి జన్మించినవాడే "వృత్తాసురుడు". తన అన్నను చంపిన ఇంద్రుడిని ఎలాగైనా చంపడమే వృత్తాసురుని లక్ష్యం... కానీ వృత్తాసురుణ్ణి కూడా ఇంద్రుడు తన వజ్రాయుధంతో సంహరించాడు.

వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు... అవే "పంచ మాధవ క్షేత్రాలు"గా ప్రసిద్ధి చెందాయి... అవే
1)బిందు మాధవ ఆలయం - వారణాసి
2)వేణీ మాధవ ఆలయం - ప్రయాగ
3)కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం
4)సేతు మాధవ ఆలయం - రామేశ్వరం
5)సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.

ఈ ఆలయాల గురించి రేపటి నుండి తెలుసుకుందాం.... రేపు వారణాసిలోని బిందు మాధవ ఆలయం దర్శిద్దాం....

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...