Sunday, 9 November 2014

శ్రీ బిందుమాధవ స్వామి ఆలయం

శ్రీ బిందు మాధవస్వామి ఆలయం, వారణాసి.

పౌరాణిక కథ:

శివాఙ్ఞ మేరకు కాశీ రాజైన దివోదాసుణ్ణి కాశీ నుండి పంపించివేయడానికి శ్రీ మహా విష్ణువు కాశీకి వచ్చాడు... అలా శివ కార్యం పూర్తి చేసిన నారాయణుడు.. కాశీ నగర అందాలను చూస్తూ నగరమంతా విహరిస్తూ, అక్కడి గంగా తీరంలోని పంచగంగా ఘాట్ కు చేరుకున్నాడు...అదే సమయంలో ఆ ఘాట్ వద్ద 'అగ్ని బిందు' అనే పేరు గల ఋషి తపస్సు చేసుకుంటున్నాడు... శ్రీ మహా విష్ణువును చూసిన అగ్ని బిందు భక్తి పారవశ్యంలో నారాయణుని పలు విధాలుగా కీర్తించి,స్తోత్రం చేశాడు. అగ్నిబిందు భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ఋషిని ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు... అప్పుడు అగ్నిబిందు "నారాయణా! నీవు బిందుమాధవునిగా ఈ ప్రదేశంలోనే ఉండి భక్తులను అనుగ్రహించు.." అని అన్నాడు. అగ్నిబిందు కోరిన వరాన్ని ఇచ్చిన నారాయణుడు... తాను ఎప్పుడూ ఈ పంచగంగా ఘాట్ లోనే ఉంటానని అగ్నిబిందు ఋషిని అనుగ్రహించాడు...
            తాను కృత యుగంలో ఆదిమాధవునిగా, త్రేతా యుగంలో ఆనందమాధవునిగా, ద్వాపర యుగంలో శ్రీమాధవైనిగా, కలి యుగంలో బిందుమాధవుగా పూజలందుకుంటానని
చెప్పి అంతర్ధానమౌతాడు....

ఆలయ విశేషాలు:
ఈ ఆలయం ఉత్రరప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసిలో ఉంది. ఈ ఆలయం వారణాసిలోని గంగా నది తీరంలోని పంచగంగాఘాట్ లో ఉంది. వారణాసి చేరుకున్న భక్తులు... గంగా నదిలో పడవ ద్వారా ఈ ఘాట్ కు చేరుకొని, ఈ ఆలయానికి చేరుకోవచ్చు లేదా కాలినడకన పంచగంగాఘాట్ కు చేరుకొని,ఆలయానికి చేరుకోవచ్చు..

ఆ బిందుమాధవైని కృప మనందరి పైన ఉండాలని కోరుకుంటూ... జై శ్రీరామ....రేపు ప్రయాగలోని వేణీ మాధవ ఆలయాన్ని దర్శిద్దాం....

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...