Monday, 29 December 2014

మహావాక్యాలు - 1:

వేదాలన్నిటికీ సారాలు ఉపనిషత్తులే. ఉపనిషత్తులనే వేదాంతలు అని కూడా అంటారు. ఉపనిషత్తులలోని "చతుర్విధ మహావాక్యాలు" జీవ బ్రహ్మైక్య సారాలుగా చెప్పబడుతున్నాయి. మనకు నాలుగు మహా వేదాల నుండి అతిముఖ్య వాక్యాలుగా నాలుగు మహా వాక్యాలను తీసుకోవడం జరిగింది... అవి

1)प्रज्ञानम् ब्रह्मम् - ప్రఙ్ఞానం బ్రహ్మం
(ఋగ్వేదం లోనిది)

2)अहम् ब्रह्मास्मि - అహం బ్రహ్మస్మి
(యజుర్వేదం లోనిది)

3)तत्त्वमसि - తత్త్వమసి
( సామవేదం లోనిది)

4)अयमात्मा ब्रह्म - అయమాత్యా బ్రహ్మ
(అధర్వణవేదం లోనిది)

అయితే ఈ నాలుగు మహావాక్యాల్లో కెల్లా... ఆతిముఖ్యమైన మహావాక్యంగా సామవేదంలోని "తత్త్వమసి" మహావాక్యాన్ని చెబుతారు...

ఈ వాక్యాలను గురించి నా #శక్తి కొద్ది మీకు అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను... కానీ ఈ పోస్టులను కాస్త జాగ్రత్తగా చదువవలసినదిగా ప్రార్థన... ఎందుకంటే ఇవి మహా వాక్యాలు కాబట్టి.... రేపటి నుండి ఈ మహావాక్యాలను అర్థ సహితంగా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం... ఉంటాను మరి...
జై శ్రీ రామ...

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...