Tuesday, 30 December 2014

మహావాక్యాలు - 2:

1) प्रज्ञानम् ब्रह्मम् - ప్రజ్ఞానం బ్రహ్మ
చతుర్విధ మహావాక్యాలలో మొదటి మహావాక్యం "ప్రజ్ఞానం బ్రహ్మ". ఈ మహావాక్యం ఋగ్వేదం నుండి గ్రహించబడింది. ఋగ్వేదం లోని ఐతరేయోపనిషత్తు లోనిది ఈ మహావాక్యం.ఈ వాక్యన్ని మనం విడదీసి అర్థాన్ని చేసినట్లయితే ఈ మహావాక్య అర్థం "విశేషమైన జ్ఞానమే బ్రహ్మం " అది ఎలాగంటే प्रज्ञानम् ब्रह्मम् - ప్రజ్ఞానం బ్రహ్మం లో (प्र+ज्ञानम्+ब्रह्मम् - ప్ర+జ్ఞానమ్+బ్రహ్మమ్ ) అంటే ప్ర = విశేషమైనది, జ్ఞానం = జ్ఞానము, బ్రహ్మం = బ్రహ్మము.

ఐతరేయోపనిషత్తులో నుండి తీసుకోబడిన ఈ వాక్య విశిష్టత ఏమిటంటే ఇది "లక్షణ వాక్యం". ఈ వాక్యం లక్షణ వాక్యం ఎందుకయిందంటే ఈ వాక్యం బ్రహ్మం యొక్క లక్షణాన్ని తెలుపుతున్నాది కాబట్టి.

ఇప్పడు ప్రజ్ఞానం అంటే ఏమిటో విపులంగా తెలుసుకుందాం... ప్రజ్ఞానం అంటే చూడడం, వినడం, వాసన చూడడం అంటే గ్రహించడం,వ్యాప్తి చేయడం అంటే విపులీకరించడం అంటే విశదంగా తెలిసుకొనడం జరుగుతుందో అదే ప్రజ్ఞానం అంటే " విశిష్టమైన జ్ఞానం " లేదా " విశేషమైన జ్ఞానం ". ప్రజ్ఞానం అంటే పరీపూర్ణమైన జ్ఞానం.

ప్రజ్ఞానం అంటే మహోన్నతమైన జ్ఞానం. ఇది అంతఃకరణములో లేదా మనసులో ఉండే చైతన్యం. ప్రజ్ఞానం అనేది ఎప్పుడూ దాగి ఉంటుంది. ఎప్పడైతే మన మనసు నిజమైన భక్తి ఆవరిస్తుందో అప్పుడే మన అంతఃకరణ #చైతన్యం మేల్కొంటుంది. ఒకసారి ప్రజ్ఞానం అనేది బయపడితే తిరిగి మళ్ళీ అది దాగదు... ప్రజ్ఞానాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను చూద్దాం... "ఒకసారి ఒక మానవుడు ఒక దేవాలయానికి వెళ్ళాడు... ఆయన భగవద్దర్శనంలో భాగంగా ఆ గుడిలోని మూలవిరాట్టును తాకాడు... తాకగానే ఆయన యొక్క శరీరం అంతా ఆ భగవంతుని యొక్క శక్తి ప్రవహించి అంతఃకరణములోని చైతన్యం జాగృతమైంది లేదా మేల్కొన్నది...ఎందుకంటే ఆ విగ్రహములోని శక్తిపుంజాలు ఆయన యొక్క చైతన్యాన్ని మేల్కొల్పాయి..."
      ప్రజ్ఞానం జాగృతమవాలంటే అంతఃకరణ శుద్ధి అతి అవసరం. ప్రజ్ఞానం అనేది ఒక అనభవం కాదు. అది కష్టపడడం వల్ల కూడా రాదు. ప్రజ్ఞానం అనేది 'స్వయం ప్రకాశం', అది మన అంతఃకరణములోనే జాగృతమవాలి. ప్రజ్ఞానాన్ని బయటపడకుండా ప్రపంచంలోని ఏ వస్తువూ ఆపలేదు.  అది సాధకుడి సాధనను బట్టి సరియైన సమయంలో మాత్రమే బయపడుతుంది ఎందుకంటే ఒక్కొక్కరి సాధన ఒక్కొలాగా ఉంటుంది....

(ఇంకా వుంది........)

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...