శతకము: నరసింహ శతకము
రచన: శ్రీ శేషప్ప కవి
పద్యం: బ్రతికినన్నాళ్ళు
సీ.బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని - మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి - ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ గప్పఁగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ - బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో
తే.నాఁటి కిప్పుడె చేతు నీనామ భజన - తలఁచెదను జెవి నిడవయ్య! ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
No comments:
Post a Comment