Tuesday, 9 December 2014

సదాశివ అక్షరమాలా స్తోత్రం...

సదాశివ అక్షరమాలా స్తోత్రం:

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ !!సాంబసదాశివ!!
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ !!సాంబసదాశివ!!
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ !!సాంబసదాశివ!!
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ!!సాంబసదాశివ!!
ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ !!సాంబసదాశివ!!
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ !!సాంబసదాశివ!!
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ !!సాంబసదాశివ!!
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ !!సాంబసదాశివ!!
లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ !!సాంబసదాశివ!!
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ !!సాంబసదాశివ!!
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ !!సాంబసదాశివ!!
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ !!సాంబసదాశివ!!
ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ !!సాంబసదాశివ!!
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ !!సాంబసదాశివ!!
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ !!సాంబసదాశివ!!
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ !!సాంబసదాశివ!!

కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ !!సాంబసదాశివ!!
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ !!సాంబసదాశివ!!
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ !!సాంబసదాశివ!!
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ !!సాంబసదాశివ!!
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ !!సాంబసదాశివ!!
చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ !!సాంబసదాశివ!!
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ !!సాంబసదాశివ!!
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ !!సాంబసదాశివ!!
ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ!!సాంబసదాశివ!!
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ !!సాంబసదాశివ!!
టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ !!సాంబసదాశివ!!
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ !!సాంబసదాశివ!!
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ !!సాంబసదాశివ!!
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ !!సాంబసదాశివ!!
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ !!సాంబసదాశివ!!
తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ !!సాంబసదాశివ!!
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ !!సాంబసదాశివ!!
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ !!సాంబసదాశివ!!
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ !!సాంబసదాశివ!!
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ !!సాంబసదాశివ!!
పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ !!సాంబసదాశివ!!
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ !!సాంబసదాశివ!!
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ !!సాంబసదాశివ!!
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ !!సాంబసదాశివ!!
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ !!సాంబసదాశివ!!
యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ !!సాంబసదాశివ!!
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ !!సాంబసదాశివ!!
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ !!సాంబసదాశివ!!
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ !!సాంబసదాశివ!!
శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ !!సాంబసదాశివ!!
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ !!సాంబసదాశివ!!
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ !!సాంబసదాశివ!!
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ !!సాంబసదాశివ!!

ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ !!సాంబసదాశివ!!
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ !!సాంబసదాశివ!!
సాంబసదాశివ సాంబ సదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబశివ సదాశివ సాంబసదాశివ సాంబశివ ||

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...