Sunday 18 January 2015

క్షీరసాగర శయన....

రచన: శ్రీ త్యాగరాజ స్వామి
తాళం: ఆది
రాగం: దేవగాంధారి

పల్లవి:
క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ  ।। క్షీర ।।

అనుపల్లవి:
వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది
విన్నానురా రామ  ।। క్షీర ।।

చరణము:
నారీమణికి జీర లిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది
విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారకనామ త్యాగరాజనుత దయతో నేలుకోర రామ  ।। క్షీర ।।

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...